12 అక్టో, 2011

ప్రకృతి ఎంత అందమయినది

మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో అందం గా ఉంటుంది.
ఆ అందాలను వర్ణించాలంటే కేవలం కవులు, రచయితలూ వంటి గోప్పవల్లకే సాధ్యమవుతుంది.
నా లాంటి సాధారణ వ్యక్తీ కి అంతగా రాకపోయినా మనసులో కదిలే భావాలను మాటల్లో మాత్రం చెప్పగలను.
మనం ఎలాంటి మూడ్ లో ఉన్న కాని ఒక్కసారి జల జలా పారే నీళ్ళకి దగ్గర గా కుర్చున్నామంటే చాలు, మన మనస్సు లో మనకే తెలియని ప్రశాంతత చేరిపోతుంది. ఆ ప్రవాహ చప్పుడు వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అది సూర్యోదయ వేల లేదా సూర్యాస్తమయ వేల అయ్యి ఉంటె ఆ సమయలో ఉండే ఆకాశ అందాలని తనివి తీర చూడవచ్చు. అదే సమయం లో చల్లగా వీచే గాలి కూడా జత అయితే మన శరీరానికి కూడా కాస్త హాయి గా ఉండటం మొదలవుతుంది. చల్లని గాలుల మధ్యన చుట్టూ పచ్చదనము తో నిండిన ప్రాంతం లో అల జల జల పారుతున్న నీళ్ళ కి ఒడ్డున కూర్చొని ఆకాశాన్ని చుస్తే చాలు, ప్రకృతి మధురిమలు మన స్వరాల్లోకి చేరి పోతాయి. ఆ సమయం లో మన తో  పాటు ఎవరు లేకున్నా కూడా మనకి ఒంటరితనం ఏర్పడదు. ఒకవేళ మన తో పాటుగా మనకి బాగా నచ్చే వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని మరేవరయిన గాని కూడా అక్కడే ఉంటె ఇంకెంత బావుంటుందో చెప్పలేము. ఒకవేళ చిన్న పిల్లలు, అప్పుడే అడుగులో అడుగులు  వేస్తున్న పసి పాపలు అక్కడ మన తో నే ఉండి ఉంటె... ఆహ..! ఇంకెంత బావుంటుందో కదా! వారికీ వచ్చీ, రానీ మాటల తో సరదాగా నవ్విస్తు ఉంటె  మనసుకి చాల సంతోషం గా ఉంటుంది. అందుకే కావచ్చు విహార కేంద్రాలు ఎక్కువ గా  నీటి కి దగ్గరగా అంటే, నదులకి , సముద్రపు బీచ్ ల కి దగ్గరగా ఉంటాయి. కాని ఇప్పటికే ఇలాంటి అందాలూ రోజు రోజు కి కరువవుతున్నాయి, ఇక రేపటి మన తర్వాత వచ్చే వారికి ఈ అందాలూ కేవలం ఫోటో లకే పరిమితమవుతయేమో అని ఒక్కోసారి భయమవుతుంది. ఏది ఏమయినా ప్రకృతి మాత్రం ఎప్పటికీ అద్భుతమే !