14 డిసెం, 2011

సినిమాలలో కనపడే కామిడి సీన్ కి అర్థం ఎందుకు మారి పోతుంది ????

ఎందుకు ఈ మధ్య సినిమాలల్లో హాస్యానికి అర్థం మారి పోయింది?
హాస్య నటులతో హాస్యానికి బదులు అపహాస్యం పలికిస్తున్నట్లు ఉంది.
కామిడి సీన్ వచ్చినదంటే చాలు... బ్రహ్మానందం ని పలు రకాలుగా తిట్టడమో లేక కొట్టడమో చేయడం. ఆ సమయం లో బ్రహ్మానందం గారి ముఖ కవలికల్ని చూసి మనం నవ్వుకోవడం. ఇంతే. ఇదే జరుగుతుంది. ఇది ఏ ఒక్క సినిమా లో కాదు దాదాపు గా గత 6/7 సంవత్సరాల నుండి వస్తున్న అన్ని తెలుగు సినిమా లలలో ఇదే కనపడుతుంది. అప్పుడు అది హాస్యం ఎలా అవుతుందో నాకు మాత్రం అర్థం కావడం లేదు. హాస్యం అంటే సహజం గ ఉండాలి. విన గానే లేదా చూడగానే మనసుకి ఒక రకమైన భావన కలగాలి. అప్పుడు మన లో సంతోషం ఏర్పడుతుంది. అది మన పెదవుల పైన నవ్వు ని చిలకరిస్తుంది. కాని ఈ మధ్య వస్తున్న సినిమా లలో హాస్యం అంటే కేవలం హాస్యనటులని కొడుతూ , తిడుతూ ఉండటం. ఇది నిజానికి హాస్యం కాదు. అపహాస్యమే అవుతుంది. వేరే వాళ్ళ మీద సటైర్లు వేసి నవ్వించడం ఒకటి రెండు సార్లు అయితే చూడవచ్చు కాని అదే సీను అన్ని సినిమాలల్లో వాడుతుంటే ఈ డైరెక్టర్ లకు తీయడానికి బోర్ కొట్టట్లేదు, చేసే నటులకు బోర్ కొట్టట్లేదు. ఇక మిగిలింది మనమే.. ప్రేక్షకులం. మనకు మాత్రం బోర్ కొట్టిచ్చి చంపుతున్నారు. రవి తేజ సినిమా ఒకటి (పేరు గుర్తు లేదు )... అందులో అయితే ఒకటే పని గా కొట్టడమే కామిడి అయిపొయింది. మొన్న వచ్చిన దూకుడు అంతే . అంత పెద్ద కమిడియన్ స్టార్ అయిన బ్రహ్మానందం ని అరేయ్ ఒరేయ్ అని పిలుస్తూ ఉండటం చూసే వాళ్ళకే అసహ్యం వేసే ల ఉంది . ఇక ఉన్న డైరెక్టర్ లకు కొత్త ఆలోచనలు ఎలాగో రావని అర్థమయి పోయింది కాని తీసే నటులయిన కొంచెం కొత్తగా ఉంటే నే తీస్తాం అని మొండి కేస్తే సరి.

    "అలా మొదలైంది" సినిమా లో ని కామిడి కొంచెం కొత్తగా ఉంది.  ఆ డైరెక్టర్ నందిని రెడ్డి సినిమా క్లైమాక్స్ సీన్ లో గౌతమ్ (హీరో కాదు, తాగు బోతు గా నటించిన రమేష్ ) అనే కొత్త కారెక్టర్ తో  చాలానే  నవ్వించింది. 
ఆ గౌతమ్ "అబ్బ తమ్ముడూ..." అనే డైలాగ్ ని వింటే చాలా బాగా అనిపిస్తుంది. అతను సహజం గా చేసినట్లు ఉంది. అతను మాట్లాడే ప్రతి డైలాగ్ ఆ రోల్ కి కరెక్ట్ గా suit అయ్యింది. ఇలా కొంచెం కొత్త డైరెక్టర్లయినా వచ్చి ఉన్న హాస్యాన్ని అపహాస్యం కానీయకుండా చుస్తే బాగుంటది,( పాత వాళ్ళు ఎలాగో మారరు).



13 డిసెం, 2011

"ఈ రోజుల్లో జనాలకి ఓపిక లేకుండా పోతుంది"

అలా బోర్ కొడుతుందని రేడియో ఖుషి పెట్టాను. అందులో ఎక్కువగా నేను R.J మిత్ర ప్రోగ్రాం అదేనండి "మల్లి మల్లి పాడాలి" అనే ప్రోగ్రాం వింటాను. అది కాకుండా "నమస్తే మామ" కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాను. ఈ రోజు కుడా ఎప్పటి లాగానే "నమస్తే మామ" పెట్టాను. అందులో ఇవ్వాల్టి టాపిక్ 
"ఈ రోజుల్లో జనాలకి ఓపిక లేకుండా పోతుంది". ఈ టాపిక్ గురించి ఆ మామ , అల్లుల్లూ ఇద్దరి సంభాషణ సూపర్. మామ చెప్పే మాటలకు మధ్య మధ్య లో అల్లుడు వేసే జోక్స్ చాల బాగున్నాయి. మొత్తానికి వీళ్ళిద్దరూ ఉన్నది ఉన్నట్టు గా కరెక్ట్ గా చెప్తారు. ఒక్కోసారి వింటుంటే మన లో  కూడా ఈ లక్షణం ఉంది అని బయటికి అనుకోక పోయినా మనసులో మాత్రం ఒప్పుకుంటాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మామ రైల్వే స్టేషన్ లో జరిగే ఒక చిన్న ఉదాహరణ ఇచ్హాడు. అది exact  గా ఈ మధ్య జరుగుతూనే ఉంది.
అదేంటంటే... 
మామ : ఈ మధ్య కాలం లో అంతా ఆన్ లైన్ లోనే టికెట్ బుక్ చేసుకుంటారు. స్తేషని కి కేవలం ఒక మూడు, నాలుగు నిమిషాల ముందు వస్తారు . ఇక ట్రైన్ పొరపాటుగా కొంచెం లేట్ ఉంది అని అన్నౌన్సుమేంట్ వచిన్దనుకోండి. అంతే.. ఒకటే చిరాకు పడతారు. పది నిమిషాలు కూడా ఓపిక పట్టరు. ఇటు అటు తిరుగుతూ ఒకటే టెన్షన్ పదుతూ కొంపలు అంటుకుపోతున్నట్టు చేస్తారు అని అంటాడు. అదే మా కాలం లో అయితే మేము ఓపికగా అలాగనే కూర్చొని ఉండే వాళ్ళం అని అంటాడు. దానికి వెంటనే అల్లుడు మీ కాలం లో మీకు ఏమి పని ఉండకపోయేదేమో అని టక్కున అనేస్తాడు . :D 
అప్పుడు మామ : మా కాలం లో ఎందుకు పనులు ఉండవనుకున్టున్నావు, మీకంటే ఎక్కువ గానే ఉండేవి; ఇంకా మాకు అప్పుడు ఇంత టెక్నాలజీ  లేకున్నా మేము ఆదర , బాదర పడకుండా ఓపిక గా ఉండే వాళ్ళం అని అనేస్తాడు. ఏది ఏమయినా ఆ కాలం వాళ్ళ తో పోల్చుకుంటే  మనలో కొంచెం ఓపిక తక్కువే అని మాత్రం మనం అందరం ఒప్పుకోవాల్సిందే. 

అలా సరదాగా సాగే  వీరి ప్రోగ్రాం వింటే ఖుషి ఖుషి గా , హాయి హాయి గా అనిపిస్తుంది.

5 డిసెం, 2011

కడాయి పనీర్ తిందామా!

ఈ రోజు కడాయి పనీర్ తినాలని అనిపించింది . అంతే ఇక వెంటనే షాప్ కి వెళ్లి కావాల్సినవన్నీ  తెచుకొని చక చక చేసేసాను . ఎలా చేసానంటే... 
కావలసినవి:


1 . పనీర్ ౩౦౦ gm
2.కాప్సికం ౩ (చిన్నవి)
(ట్రాఫ్ఫిక్ లైట్ కాప్సికం కొన్నాను... అంటే green, red, yellow కలర్  వి  )
3 .ఉల్లిపాయలు తరిగినవి  ఒక పెద్ద కప్ నిండా
4 . నూనె 3/4 tbps 
5 . టమాటాలు 2
6 . కొత్తిమీర
7 . కరివేపాకు 
8 . ఎండు మిర్చి
9 . జీలకర్ర 
10 .ఉప్పు , కారం, పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు 








 ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా!!!!!




step 1: ముందుగా కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పనీర్ ని వేయించుకున్నాను



ఆ తర్వాత పనీర్ ని అందులోంచి తీసి అదే కడాయి లో ఇంకొచెం నూనె వేసి కాప్సికం ముక్కల్ని వేయించాలి.





ఇక్కడ నేను తీసుకొని వచ్చిన రెడ్ కాప్సికం ఖరాబ్ అయింది. అందుకని వాడలేక పోయాను.
వీటిని  కొంచెం వేయించిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలి. 







తర్వాత అదే నూనె లో ఎండిన మిరప కాయలు, జీలకర్ర, వేసి వేయించాలి. 




 


 ఆ తర్వాత అందులోనే  సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు , టమాట ముక్కలు కూడా వేసి కలిపి  మూత పెట్టాలి .




 కొంచెం సేపు అయ్యాక కలిపి అప్పుడు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్టు  వేసి మల్లి మూత పెట్టాలి 

                                                        అది మొత్తం గ్రేవీ  చిక్క పడుతుంది.


 అప్పుడు ముందుగ వేయించిన కాప్సికం ముక్కల్ని, పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని  వేసి కలిపి  ఒక 5 నిముషాలు మూతపెట్టాలి. 










       తర్వాత పనీర్ కూడా వేసి కలిపి కొంచెం సేపు (మరో 5  నిముషాలు  ) మూత పెట్టాలి. 








చివరిగా కొత్తిమీర వేసి దించెయ్యాలి.








అంతే కడాయి పనీర్ తయ్యార్ !!!!!!!!!!!!!!!!!!!!!!!!