11 అక్టో, 2012

సింగపూర్ పెరుమాళ్ టెంపుల్ లో జరిగిన అన్నదానం....

దానాలన్నింటి లో కెల్లా అన్నదానం చాల గోప్పదంటారు. ఎందుకు  అంటే ఇది చదివండి,మీకే తెలుస్తుంది
ఇంతటి గొప్ప అన్నదానాన్ని కేవలం మన  దేశం లోనే కాకుండా ఇతర దేశాలల్లో కూడా మన వారు జరిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ సింగపూర్ లో ఉన్న పెరుమాళ్  టెంపుల్ లో గత శనివారం (06-10-2012) అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాములుగానే ఈ గుళ్ళో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. మేము అనుకోకుండా ఆ రోజు దేవుడి దర్శనానికని వెళ్ళాము, అంతే  అక్కడ ఉన్న జనాల్ని చూసి ఒక్కసారి గా ఆశ్చర్య పోయాము, ఏంటి ఇంత  మంది... ఎం జరుగుతున్డబ్బ అని చుస్తే అన్నతానం (తమిళ్ భాష లో అన్నతానం అంటారేమో) అని బోర్డు పెట్టి ఉంది. 
ఎన్ని వేల మంది వచ్చారో తెలీదు కాని బంతి , బంతి కి హాల్ నిండా నిండి పోయారు. నాకైతే ఎ 4-5 వేల మంది వచ్చారో అని అనిపించింది.
అందరు అన్న ప్రసాదం కోసం పెద్ద పెద్ద క్యూ  లలలో నిలబడి ఉన్నారు. వారిలో చిన్న చిన్న పిల్లలని పట్టుకొని ఉన్నవారు కూడా ఉన్నారు. మొదట మేము మా బాబు తో ఈ క్యు లో నిలబడటం కష్టం అని అనుకున్నాం, కాని తర్వాత మా కంటే పసి పిల్లలని ఎత్తుకొని కూడా క్యు లో జనాలను నిలబడి ఉండటం చూసి మేము నిలబడే సాహసం చేసాం. అంత  తమిళ్ స్టైల్ లో భోజనాలు ఏర్పాటు చేసారు. "అందరిని కుర్చీ లలలో కుర్చోబట్టి ముందర పొడవాటి టేబుల్ ల్లు  వేసి, అరటి ఆకూ లో అన్నం వడ్డించడం ".. బహుశ ఇది తమిళ్ వారి పద్దతనుకుంటాను, ఎందుకంటే నేను ఒకసారి చెన్నై లో జరిగిన ఒక  పెళ్లి కి వెళ్ళినప్పుడు కూడా ఇదే పద్దతి లో వడ్డించడం చూసాను.
ఏమో ఈ పద్దతి గురించి నాకు అంతగా తెలియదు లే..
మన  తెలుగు వాళ్లము (ఇది వరకయితే  మన రాష్ట్రమ గురించి ఏదయినా చెప్తున్నప్పుడు ఆంద్ర అని సంభోదిన్చేవాళ్ళం, కాని ఇప్పుడు ఆంధ్ర అంటే నన్ను జనాలు కొడతారేమో.. తెలంగాణా అయి ఉండి  ఆంధ్ర అంటావేంటి?? అని అందుకే ముందు జాగ్రత్త గా తెలుగు వాళ్ళం అని అంటున్నా.. :)   ) ఏదయినా భోజనాలల్లో కింద ఒక మాట్  వేసి, విస్తారాకు లో అన్నం వడ్డిస్తం  కదా..
కాని తమిళ్ వాళ్ళు అరటి ఆకులనే ఎక్కువగా ఉపయోగిస్తారు .

          ఆరోజు మధ్యాన్నం  అప్పటికే భోజనాలు చేస్తున్నారు కొందరు; అన్ని  క్యూ లు ఫుల్ అయ్యాయి బయట ఇంకా  చాల మంది క్యు లో నిల్చోవడానికి ఎదురు చూస్తున్నారు. అప్పుడు వెంటనే ఈ కుర్చీ ల సిస్టం సరిపోదనుకున్నారో ఏమో అక్కడి వలెన్తీర్స్ పక్కనే ఉన్న పెద్ద  హాల్ లో కిందనే అందరినీ బంతు లుగా కూర్చో పెట్టి ఫటా ఫట్ వద్దిన్చేసారు. అప్పుడు కొంచెం ఫాస్ట్ గా అయింది. 
ఇక వలెన్తీర్స్ గురించి చెప్పాలంటే ...
వాళ్లకి ఎంత ఓపిక అంటే .. వాళ్ళని చుస్తే ఉన్న కోపం అంత  హరిచుకు పోతదనిపించింది . తిన్న అరటి ఆకులని కూడా ఎవరిదీ వారు ఎత్తి పారేయడానికి వీల్లేదు, వాళ్ళే వచ్చి తీస్తున్నారు. వేరు వాళ్ళు తిన్న పళ్ళెం మనమెందుకు తీయాలి అనే వ్యక్తిత్వం గల వారు  ఒక్కసారి ఆ సీన్ చూడాలేమో  ని మనసులోఅనిపించింది. 

  తిన్న ఆకులు ఎవరిదీ వారు తీసుకుని వెళ్తే అక్కడి వారికి కొంచెం పని తగ్గుతుంది కదా అని నేను మా వారిని అడిగితె.. భోజనం పెట్టం అంటే కూర్చోబెట్టి అన్నం  వడ్డించి వారు తిన్న విస్తారకులు తీయడం వరకు అని అన్నాడు. అవునా??? ఇది కరెక్ట్ ఆ?? 





ఇంత  గొప్ప అన్నదానం నిర్వహించిన వారికి, టెంపుల్ వారికి, ఆ వాలేన్తీర్స్ కి  చేతులెత్తి మొక్కాల్సిందే !!   అన్నదాత సుఖీభవ!!!

     ఏమో లే మొత్తానికి కనీసం ఒక్కసారయిన  అలా ఒక అన్నదానం రోజున నిలబడి అందరికి సేవ చేయాలని  మాత్రం మనసులో  అనిపించింది. అది ఎలా నెరవేరుతుందో చూడాలి ...   



3 అక్టో, 2012

బొత్స సత్యనారాయణ! - తల పొగరు నారాయణ !!

బొత్స మాటలు వింటుంటే ఆయనకి ఎంత తల పోగారో క్లియర్ గా అర్థమవుతుంది. సీమంధ్ర విద్యార్థి JAC వందేళ్ళు బహిష్కరించినా నాకేమి పర్వాలేదు అంటే.. ఏంటి దాని అర్థం???తనకి ఓ పదవి ఉందనా అంత అహంకారం??  తనకో పదవి, తన సతీమణి కోక పదవి ఇలా ఫ్యామిలీ మొత్తం పదవులతో దోచుకుంటుంటే.. ఇంకెందుకు భయం?? ఎవడు వెలేసిన డబ్బు ఉంది కదా అనే అహంభావం.
ఇలాంటి వాళ్ళను కూడా మన అమాయక ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారో ఏమో!
విజయనగరం వారెవరియన ఈ ఆర్టికల్ చదివితే బొత్స గారు తమ తమ ప్రజలకు చేసిన, చేస్తున్న మంచి  పనులుంటే ఎక్కడో ఒకచోట (ఈ బ్లాగ్ లోనో లేద మీ బ్లాగ్ లోనో )  తెలియచేయండి..  



 

2 అక్టో, 2012

ఈ ios6 గొడవేంటో అసలు అర్థం కావడం లేదు.


గూగుల్ మాప్స్ లేదు, యూ ట్యూబ్ లేదు, బ్రౌసింగ్ స్ప్పేడ్ కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. (ఇప్పుడు వీటిని  సెపరేట్ ఆప్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు లే అది వేరే విషయం.) కేవలం ఫోటో స్ట్రీం ఒక్కటే బాగున్నట్లు గ అనిపిస్తుంది. ఇప్పుడు గూగుల్ మీద ఎంతగా డిపెండ్ అయ్యమో మనకే తెలీదు, ఏ విషయం కావాలన్న  గూగుల్ క్లిక్ చేస్తాం. అంతగా వినియోగ దారులకి ఉపయోగం గా ఉన్నగూగుల్ ని కాదనాలని చేసే ఆపిల్ ప్రయత్నం ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. 

మీరు కూడా ios6 పైన మీకున్న అభిప్రాయాలని ఇక్కడ  మాతో షేర్ చేసుకోండి.. 

28 సెప్టెం, 2012

ఇప్పుడు మన నోటు మీద (నాణెం మీద) కేవలం గాంధీ నే కాదు,

నేను గత సంవత్సరం  ఫెబ్రవరి లో ఒక ఆర్టికల్ రాసాను.
అది మన నోటు మీద గాంధీ నే ఎందుకు ఉండాలి అని....??? ఆఆర్టికల్   లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://prathiudayam.blogspot.sg/2011/02/blog-post.html


 కాని ఇప్పుడు మన నోటు మీద (నాణెం  మీద) కేవలం గాంధీ నే కాదు, భగత్ సింగ్ కూడా ఉన్నాడని గర్వం గా చెప్పుకోవచ్చు.
ఆ నాణెం ని చూడాలంటే ఇదిగో భాస్కేర్ గారి బ్లాగ్ చదవాలి మరి.
భాస్కర్ గారి బ్లాగ్ కి లింక్ ఇది...
http://bhaskar321.blogspot.sg/2012/09/blog-post_27.html



ఈ నాణాన్ని  మనకు తెలియచేసినందుకు భాస్కర్ గారికి ధన్యవాదాలు .



సైకిల్ పార్కింగ్ ఇలా కూడా ఉంటుంది... తెలుసా!!

సైకిల్ పార్కింగ్ ఇలా కూడా ఉంటుంది... తెలుసా!!

సైకిళ్ళు మరీ ఎక్కువయిపోతే ఇదిగో ఇలాంటి స్టాండ్స్ ఏర్పాటు చేస్తే సరి. 


25 సెప్టెం, 2012

ఒక్కోసారి మన మీద మనకే చాల కోపం వస్తుంది.

ఒక్కోసారి మన మీద మనకే చాల కోపం వస్తుంది

ఆ కోపం మరీ ఎక్కువయితే అసహ్యం గా కూడా మారి పోతుంది.
ఇంకే ముంది మనసులోనే గడగడ తిట్టుకోవడం, చేసే ఎ పని మీద అయిన ధ్యాస ఉండక పోవడం చివరికి అన్నిట్లో  చిరాకు పడటం ఇలా ... జరుగుతూ ఉంటాయి కొన్ని సార్లు.
 అసలు ఈ కథ  అంత  ఎప్పుడు మొదలవుతుందంటే ... 

* ఒకరనుకుంటారు.. రేపు పొద్దున్నే లేవాలి అని...

 $ మరొకరేమో.... రేపటి నుండి సీరియస్ గా చదవడం స్టార్ట్ చేయాలి అని..
% ఇంకొకరేమో నేను కొంచెం కోపాన్ని తగ్గించు కోవాలి; ఈ మధ్య అందరి మీదికి బస్సు మని లేస్తున్నాను  అని..
ఇలా ఎవరికి కావాల్సిన టార్గెట్ ని వారు ఎంచుకొని పెట్టుకుంటారు. ఇక ఆచరణ లోకి తెద్దాం అనుకోని ఓ తెగ రెడీ అయిపోతారు.
* గారు మరుసటి రోజు ల్పోద్దున్నే లెవరు, మొదలు పెట్టలనుకున్న్న వాకింగ్/జాగింగ్/ఎక్షెర్కిసె చేయరు, అల ఒకటి , రెండు,  రోజులు గడిచి పోతాయి; ఇక మూడో రోజు ఏదో లేచి అలా కొంచెం స్టార్ట్ చేస్తారు. మల్లీ  కథ  మొదటికే.. ఏదో అడపా దడపా చేసి చేయనట్టు సాగిపోతుంది. ఇలాగె బద్ధకం గా చేయాలనుకున్న పనులు పెట్టుకున్న టార్గెట్ లోపల పూర్తీ కావు.
దానితో రిజల్ట్స్ ఉండవు. పని ఒత్తిడి ఎక్కువ అయిపోతుంటది. ఇక కోపం ,చిరాకు అన్నీ స్టార్ట్ అయ్యి మన మీద మనకే అసహ్యం వ్వేసుకునే లా తయారవుతాము. ఇది ఎ ఒకరికో ,ఇద్దరికో కాదు. దాదాపుగామన వాళ్ళ లోనే ఎక్కువగా చూస్తాము. ఎవరో నూటి లో ఒక్కరు అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూరి చేసి చూపిస్తారు.
నాలెడ్జ్  విషయం లో ఇద్దరు సమానం గా ఉన్నప్పటికీ రిజల్ట్స్ ఎందుకు సమానం గా ఉండవు???
      ఎందుకంటే  మనసు మీద పట్టు (control) ఉన్న వ్యక్తీ సక్సెస్ ని చూస్తాడు, అది లేని వాడు తన మీద తనకే అసహ్యం  వేసుకునేలా తయారవుతాడు.
కేవలం ఒక్క విషయం లో (మనసు మీద) ఆధిపత్యం సాధిస్తే ఇక తిరుగే ఉండదు. ప్రతీ విషయం లో  టార్గెట్స్  ఉంటాయని   అందరికీ తెలిసిందే; కాని అవి ఆచరణ లోకి వచ్చినప్పుడే వాటికి జీవం పడుతుంది.  



16 సెప్టెం, 2012

ఏమయిందో ఆ కార్డు సంగతి?


అప్పుడెప్పుడో మన రాష్ట్ర ప్రభుత్వం కామన్ మొబిలిటీ కార్డు గురించి ప్రస్తావించింది. దాని తర్వాత మళ్ళీ ఆ ఊసే లేదు. ఇంతకీ ఆ కార్డు వస్తుందా??/రాదా??





14 సెప్టెం, 2012

మళ్ళీ నా గోల మొదలయిందోచ్ ....

మళ్ళీ నా గోల మొదలయిందోచ్ ....

 చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ ని sign  ఇన్ అయ్యాను. చుస్తే తెలిసింది కరెక్ట్ గా  9 నెలలు గా నేను అసలు బ్లాగ్ నే ఓపెన్ చేయలేదా??? అని ఒక్కసారి గా షాక్ అయ్యాను. ఇంట్లో పసి పిల్లలు వచ్చె సరికి టైం ఎంత ఫాస్ట్ గా గడిచి పోతుందో అర్థం కావడం లేదు. ఏది ఏమయినా కనీసం ఇప్పుడయిన టైం దొరికించుకొని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసినందుకు ఫుల్ ఖుష్ ... ఇంతకీ చెప్పలేదు కదా.. మా బాబు నిక్ నేమ్ (ముద్దు పేరు ) ఖుష్ ..  ఇక ఇప్పటి నుండి నా గోల నే కాదు, ఖుష్ గోల కూడా మీరు భరించాల్సిందే...