16 డిసెం, 2013

మా కిట్టి పార్టీ కబుర్లు.... (PART ONE)


నేను కిట్టి పార్టీ లో చేరడం ఇదే మొదటి సారి. మా రూల్స్ ప్రకారం ఉదయం 10.30 వరకు లంచ్ ప్రిపేర్ చెసెయ్యలి. ఫ్రెండ్స్ 10. 45 కి వచ్చేస్తారు . అవును ఇంతకీ కిట్టి పార్టీ అంటే తెలుసు కద.. ఏదో ఫ్రెండ్స్ ని కలవడానికి మన ఇంటికి వారిని ఇన్వయ్టే చేయడానికి  , మన వంటలు టేస్ట్ చేయించడానికి ఇదో ఒక ఛాన్స్ అన్న మాట . అయితే మేము మా గ్రూప్ లో కిట్టి ని ఒక థీమ్ తో చేస్తాము . ఒక్కో నెల లో ఒక స్నేహితురాలు ఒక విధమైన థీమ్ తో కిట్టి ని హోస్ట్ చెస్తున్ది.  
ఈ సంవత్సరం జనవరి లో ఒక ఫ్రెండ్ వెస్టర్న్ థీమ్ తో చేసింది . 
ఇంకో ఫ్రెండ్ ఫిబ్రవరి లో ఫ్లొరల్ థీమ్, ఇంకొకరు మార్చ్ లో హోలీ (కలర్స్) థీమ్ , ఏప్రిల్ లో  కొత్త పెళ్ళికూతురు గా , చేసారు . తర్వాత రెండు నెలలు హాలిడేస్ తో అందరు బిజీ అయ్యారు . మల్లి జూలై  లో ఫ్రెండ్షిప్ థీమ్ తో ఒకరు , ఆగష్టు లో ఫ్రూట్ థీమ్ తో ఒకరు చేసారు . అందరు సూపర్ గ వాళ్ళ వాళ్ళ స్టైల్స్ తో కొత్త కొత్త వంటల తో అదరగొట్టేసారు . ఇక లాస్ట్ కి మిగిలింది నేనే ... కిట్టి పార్టీ లో జాయిన్ అవ్వడం ఇదే మొదటి సారి. అందుకని నేను అదే థీమ్ ఎంచుకున్నాను . అదే అంటే ..????
    "FUN AT MY FIRST KITTY PARTY " అని డిసైడ్ చేసుకొని టీనేజ్ పార్టీ ల చెద్దమనుకున్నను. అలానే మొదలు పెట్టాను . ఇన్విటేషన్ లో టీనేజ్ కిట్టి పార్టీ అని రాసాను.  ఇల్లంతా టీనేజ్ గర్ల్ రూం ల ఉండాలని ఫ్రెండ్ ఫొటోస్ అతికించాను. కేవలం ఫొటోస్ కాకుండా .. అందరి కిట్టి గురిచి ఒక్కొక్క చిన్న కవిత లాంటి వాక్యాలను రాశాను.  ఏంటి కవిత లాంటి వాక్యాలు అనుకుంటున్నారా??? ఏమి లేదు కవిత లని వాటిని అనొచ్చో లేదో నాకు తెలియదు.. నాకు రాయలనిపించిన తీరుగా రసెసాను. అంతే . 

మొదటి కిట్టి గురించి ఈ రకం గా... 

తొలకరి మధు మాసం లో తోలి అడుగు తో మొదలెట్టి 
తనదైన రీతి లో పాశ్చాత్య శైలితో !
నీలి రంగు నీడలలో దాగి ఉన్న నెమలి వోలె 
కవ్వించి నవ్వించి మనసార మురిపించి 
తకిట తడిమి నాట్యాలతో అలరించిన గీతాలు !!

రెండవ కిట్టి గురించి ఈ రకం గా .....

పటియాలలో  విరబూసిన పులా తోటలను చూసి 
ఝుం ఝుంమ్మనే నాదం తో ఎగిరొచ్చిన తుమ్మెదలకు !
మందార మకరంద మాధుర్యమునందించి 
కురిపిచెను పుత్యాల మమతాను రాగాలు !! 

 మూడవ కిట్టి గురిచి .. 

ఇంద్ర ధనుసు సొగసు లోని రంగు లన్ని ఏకమయి 
శ్వేత వర్ణపు  తామర వలె సున్నితం గా తేలియాడి !
అద్దాల మెడ లో ఆకతాయి అల్లరి లతో
 హోలీ రే హోలీ అంటూ సాగిపోయిన హ్రుదయమా !!

నాల్గవ కిట్టి గురించి ... 

గళ గళ మనే సవ్వడి తో , ఎరుపెక్కిన గోరింటాకు  తో 
తన లోని అందమంతా చీర లోన బంధించి !
తొలకరి సిగ్గులతో సింగరమొనరిచి 
తనవాడి స్పందన కై వేచి ఉన్న కొత్త పెళ్లి  కూతురు!! 

ఫ్రెండ్షిప్ థీమ్ తో చేసిన కిట్టి కి డ్రెస్ కోడ్ గుజతి స్టైల్ పళ్ళు చీర .. దాని గురిచి ఇలా.. 

లంగా ఓణి వేసుకున్న ఎల్లోరా శిల్పమా 
లేక గుజరాతీ పళ్ళు తో పులకరించిన పరువమా  !
చక్కనైన ఆకృతి తో అదర గొట్టిన అందమా 
స్నేహమనే భాష్యం  తో కట్టేసిన కావ్యమా   !!

ఫ్రుటీ థీమ్ పైన ఈ రకమ గా రాసాను .. 

మధురమైన కంఠం  తో సుస్వరాలనాలపించే 
స్వచ్చమైన మనసు తో అందర్నీ పలకరించే
మృదువైన హస్తాలతో ముచ్చటైన పళ్ళ తో 
ముంగిలినే రంగుల మాయం చేసేసిన తరుణం లో 
అనార్కలి వాలే అగుపించి దేవా నే మురిపించిన 
నా చెలి లావణ్యానికి  ఇదే నా సలాము.   


  ఇలా ఒక్కొక్కరి కిట్టి గురిచి , వారిని వర్ణిస్తూ రాసాను. 

ఇక గేమ్స్ గురించి చెప్పాలంటే .. 

నేను అందరిలా వన్ మినిట్ గేమ్స్ మాత్రమే కాకుండా  tressure hunt  గేమ్ చేశాను . తర్వాత రెండు గేమ్స్ వన్ మినిట్ వి చెసను. అంటే మా రూల్స్ ప్రకారం మూడు గేమ్స్ ఉండాలి . అందులో గెలిచినా వారికీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వలి. ఇక కామన్ గా అందరికి ఒక గిఫ్ట్ ఇవ్వలి. అంటే గేమ్ లో గెలవని వాళ్ళు కూడా హ్యాపీ గ ఇంటికి వెల్లాలని. 

23 నవం, 2013

చాట్స్ లో ఉపయోగించే గ్రీన్ చట్నీ చేసారా ఎప్పుడయినా?

చాట్ అంటేనే నీళ్ళు ఊరుతు ఉంటాయి . ఎక్కడ ఎప్పుడు చుసిన అబ్బ చాట్ .. తిందామా  అని అనిపిస్తున్ది..  చాట్ అంటే  నాకు మా collage డేస్ గుర్తొస్తాయి .. నేను engg లో  ఉన్నప్పుడు collage అయ్యాక ఫ్రెండ్స్ అందరం ఒకటే collage  బస్సు లో ఇంటికి వెళ్తున్నాం .. బహుశ ఆ  రోజు లాస్ట్ ఎక్షమ్ రాసామనుకునట .. అందరం కలిసి సరదాగా ఏదయినా తిందామా  అని అనుకుంటూ .. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర చాట్ బండి కనిపించిన్ది. సరే అయితే చాట్ తిందాం అని అనుకోని వెళ్లి తిన్నమ్..ఫుల్  గ ఎవరికీ నచ్చింది వాళ్ళు తినేసి , చివరికి పాని పూరి  కూడా తినేసి ఒకటే  నవ్వుతూ  ఉన్నాం .. 

క్లాసు బాయ్స్ పైన జోక్స్ వేసుకుంటూ ఎవరెవరు ఆరోజు  ఎక్షమ్ డ్రాప్ చేసారా అని అనుకుంటూ ఫుల్ గ తినెసమ్.. అంతే  తినేసి ఎవరి  దారిన వాళ్ళమీ వెళ్లి పోయాం . అందరం డబ్బులు ఇవ్వాలి అన్న ఆలోచనే మర్చి పొయమ్. చాట్ బండి అతను హలో హలో అంటుంటే ఒక ఫ్రెండ్ విని వచ్చి అడిగిన్దంట .. ఏమని .. అప్పుడు అతను డబ్బులు అని అంటే .. ఒకటే తిట్టుకున్దంట అది .. దొంగ మొహాలు తినేసి డబ్బులు ఇవ్వకుండా వెల్లారని..పాపం అది తినకున్న డబ్బులు కట్టేసింది ఆ రోజు ఫ్రైడే తనకి ఉపవాసం ..
 ఇలా కొన్ని మెమోరీస్ చాట్ తో ముడి పడి ఉన్నాయి ..  అందరికీ ఇలాంటివి ఏవో కొన్ని ఉంటాయి కదా .. అందుకే చాట్ ఇస్ ఎవర్ గ్రీన్ .. 

ఇంతకీ గ్రీన్  చట్నీ నేర్చుకుందామ మరి.. 
ఇది చాల సింపుల్ .. 
మన అరచేతి నిండా పుదినా ఆకులూ తీసుకొని , ఒక పది కొత్తిమీర కొమ్మలు అంటే అరా చేతిలో సగం వరకు  కొత్తిమీర ఆకులూ తీసుకొని కడిగి మిక్సీ జార లో వెయ్యలి. అందులో రెండు పచ్చి మిరప కాయలు  3 -4 వెల్లుల్లి పాయలు,కొంచెం జీలకర్ర ఉప్పు కూడా వెయ్యాలి . ఇవన్నింటి తో పాటు తప్పని సరిగా వెయ్యాల్సింది నిమ్మ రసం . అది మిక్సీ పట్టక ముందే వేస్తె ఆకుల గ్రీన్ కలర్ అలాగే ఫ్రెష్ గ గ్రీన్ గ ఉంటుంది . ఈ మిశ్రమం మరీ చిక్క గ ఉన్దదు. అందుకని మిక్సీ పట్టేటప్పుడు కొన్ని పుట్నాలు కూడా వేస్తె పేస్టు లా  థిక్ గా  వస్తున్ది.
అంతే  గ్రీన్ చట్నీ రెడీ .  

19 నవం, 2013

చాట్స్ లో వాడే స్వీట్ చట్నీ చేసారా ఎప్పుడైనా ???

చాట్ అంటే ఇష్ట పడని  వారు ఉండరు . సాయంత్రం వేల మన హైదరాబాద్ లో ఎ గల్లి లో చుసిన ఒక చాట్ బండి కనిపిస్తున్ది. తినాలి తినాలి అనిపించే ఘుమ ఘుమ వాసనలతో లక్కేల్తారు మనల్ని. తీర వెళ్లి చూసాక అసలు  నీట్  గ ఉండదు . అదే చాట్ ని మనం ఇంట్లో చేసుకుంటే .. హాయిగా సరదాగా ఇంట్లో వాళ్ళం అందరం కలిసి తినొఛు. ఈ చాట్ లో ముఖ్యం గా వాడే స్వీట్ చట్నీ ని ఇక్కడ ఎలా చేయాలో చూద్దాం . 

కావలసినవి:

1.  గింజలు లేని ఖర్జూర పళ్ళు  10 
2.   ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు 
3.   చింత పండు ఎంత తీసుకుంటే కరెక్ట్ గ అంతే  బెల్లం 
4.  1 టీ స్పూన్  సోంఫు పొడి 
5.   1 టీ స్పూన్   జీలకర్ర పొడి 
6.   చిటికెడు సొంటి పొడి
7.  1 టీ స్పూన్  ఎర్రటి కారం 
8. 200ml నీళ్ళు  

చేసే విధానం :

 ముందుగ చింత పండు ని కడిగి నానా పెట్టు కోవాలి . 
ఖర్జూర పళ్ళని చిన్న చిన్న ముక్కలు గ కట్ చేసి పెట్టు  కోవాలి . 
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో చింత  పండు ని ఆ నాన పెట్టిన నీళ్ళ తో సహా పోసేసి అందులోనే ఖర్జూర ముక్కల్ని కూడా వేసి ఉడక పెట్టాలి  . అవి ఉడకడానికి కొంచెం ఎక్కువ గానే టైం పదుతున్ది.  ముత  పెట్టడం మరిచి పోవద్దు 

ఆ లోపు జీలకర్ర ని , సొంఫు ని వేరు వేరు గ వేయించి చల్లార్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి .  
మధ్య మధ్య లో ఉడుకుతున్న వాటిని కలుపుతూ ఉండాలి . అది దాదాపుగా ఉడికి మిశ్రమం కొంచెం  చిక్కగా  మారుతున్నప్పుడే ఈ జీలకర్ర పొడి ని, సొంఫు పొడి ని ఒకొక్కటి టీ   స్ప్పోన్ చొప్పున వేసేయ్యాలి . అందులోనే  ఒక స్పూన్  రెడ్ కారం కూడావేయాలి. చిటికెడు సొంటి  పొడి ని కూడా వెయ్యాలి . అంతే . ఈ మిశ్రమము మరీ చిక్కగా కాకూడదు, అలా  అని మరీ నీళ్ళ లా కూడా ఉండ కూడదు . తేనే లా జారు తు ఉంటె సరి పొతున్ది.ఇది చక్కటి మెరూన్ రంగు లో కనిపిస్తుంది. చూడగానే తినాలి  అనిపించేలా ఉంటుది .  దీన్ని వడ కట్టి ఒక డబ్బా లోకి తీసుకొని ఫ్రిజె లో నిలువ ఉంచు కోవచ్చు .

3 ఏప్రి, 2013

ఓం! రావి శాస్త్రి ! నమోనమః !----- ఇది రమణ గారి గొప్పతనం.....

నిన్న సాయత్రం ఇంట్లో ఓ పెద్ద గోడవ  జరిగింది . దాంతో ఎ పని చేయాలన్నా విసుగు, కోపం,  చిరాకు . మాములుగా అయితే కోపం వస్తే అలిగి అన్నం తినకుండా సత్యాగ్రహం చెస్తాను. కాని ఇప్పుడు అది కూడా కుదరనంత పని. ఆ విసుగు తోనే తెల్లారింది . కోపం కోపం గా పని చేసుకుంటూ ఎలాగో బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను . కాని మనసు లో మాత్రం నిన్న పడ్డ మాటలు రగులుతూనే ఉన్నాయి . ఇప్పుడే కొంచెం కడుపు కాలుతుందని ఓ నాలుగు ఇడ్లీలు, కొబ్బరి చట్నీవేసుకొని తిని ఇలా లాప్టాప్ ఆన్ చేసి మాలిక తెరిచను. అంతే  అక్కడ
ఓం! రావి శాస్త్రి ! నమోనమః !! అంటూ "పనిలేక " బ్లాగ్ రచయితా అయిన రమణ గారి శీర్షిక చూసాను . రావి శాస్త్రి అంటే మన రాచ కొండ విశ్వనాథ శాస్త్రి కదా అనిఅనుకొని టక్కున ఓపెన్ చేసి చదివాను. అంతే ...
నా కళ్ళ  లోని కోపం కరుగు తూ కరుగు తూ పెదవుల దాకా కారి ఒక చక్కటి చిరునవ్వు లా రూపం మార్చేసింది .
నా నవ్వుకి పరోక్ష కారణం రావి గారైనప్పటికి ప్రత్యక్ష కారకులు మాత్రం రమణ సర్ గారు.
        వీరి రాతలు : ఎంత చక్కటి మాటలు, అందులో పలికీ పలకని హాస్యం, అందమైన పద జాలం, ఎప్పుడు వినని కొత్త కొత్త పోలికలు అబ్బ ఎంత బాగున్నాయో చెప్పలేను , ఆ బ్లాగ్ తెరిచి చదవాల్సిన్దె. నేను కొన్ని చదివాను . అందులో మిర్చి బజ్జి గురించి రాసిన ఆర్టికల్ చూసి చాల నవ్వుకున్నాను సర్ .  హాట్సాఫ్ రమణ  గారు.



26 జన, 2013

భారతీయులందరికీ అంటే మన అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

64 వ గణతంత్ర దినోత్సవ సందర్భం గా గూగుల్ ఇచ్చిన డూడుల్ చూసారా..
మన జాతీయ మృగం పులి, ఇండియా గేటు , చిన్న కమలం పువ్వులతో మూడు రంగుల బ్యాక్ గ్రౌండ్ తో అటవీ ప్రాంతాన్నిచుట్టూ  పరుచుకొని ఉంది.
 చూడగానే నచ్చింది..
కాని ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది..
ఏంటంటే.. జాతీయ మృగం, జాతీయ పుష్పం  లను ఉపయోగించినప్పుడు జాతీయ పక్షి లేని లోటు స్పష్టం గా కనిపిస్తుంది. కాని ఒకసారి మన స్వాతంత్ర్య  దినోత్సవానికి ప్రత్యేకం గా నెమలి( జాతీయ పక్షి ) తో డూడుల్  తయారు చేసారు కదా, అందుకే ఈ సారి ఆ  కాన్సెప్ట్ పెట్టలేదేమో!!!
 ఇదిగో గూగుల్ డూడుల్స్...

 

24 జన, 2013

"సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు " లో 10 పాయింట్స్ ఇవి



  1.  సినిమా పేరు వింటేనే  బాగుంది . ఇక చుస్తే...??
  2. ఇద్దరు పెద్ద హీరోలు. ఎవరి ఆక్టింగ్  ఘనత వారిదే. మరి ఈ సినిమాని ఎం చేస్తారో?
  3. హీరోయిన్స్ ఓకే..
  4. జయసుధ ఓకే..
  5. ఇక ప్రకాష్ రాజ్ ... ఆ నవ్వేంటి రా బాబోయ్ ! అస్సలు చూడలేక పోయాం. ఈ రోల్ ఇంకా వేరే ఎవరికయినా ఇచ్చి ఉంటె బాగుండేదేమో అని పించింది.
  6. ఇక స్టొరీ విషయానికి వస్తే ... నిల్ కంప్లీట్ గా స్టొరీ నే లేదు. దర్శక మహాశయుడు ఏమి చెప్దమనుకున్నాడో  ఏమో.. అసలు  కథ లోఆద్యన్తాలె  లేవు .
  7. చిన్న చిన్న పిల్లలు అలిగితే ఎలా మొహం మాడ్చుకుంటారో  అదే సినిమా మొత్తం పెద్ద హీరోలతో చూపించాడు మన శ్రీకాంత్ అడ్దాల .
  8. ఇంట పెద్ద హీరోలతో సినిమా తీయాలి అనే ఆలోచన  వచ్చినప్పుడు ఒక మంచి కథ తో , చక్కటి మ్యూజిక్ తో సినిమాలోని కుటుంబం సంతోషం గా ఉన్న సీన్లు పెట్టి అక్కడక్కడ మంచి ఒక విధమయిన కడుపుబ్బ  నవ్వించే బూతులు లేని హాస్యాన్ని అందించి సినిమా చూస్తున్నంత సేపు ఒక కొత్త ఉత్సాహం తో సంతోషం గా ఉన్న  కుటుంబాన్ని కలిసివచ్చామనే భావన కలిగించి ఉంటె బాగుండేది . 
  9. మొత్తానికి ఏది ఏమయినా దిల్రాజ పంట పండింది.
  10. ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే.. ఈ మధ్య వస్తున్న ఒకటే టైపు సినిమా లాగా కాకుండా అంటే కొంచెం భిన్నం గా ఇద్దరు హీరోలతో తీయడం .      ఇలాంటి సినిమాలు మళ్ళీ మన తెలుగు సినమ లోకం లోకి మరిన్ని రావాలి .

12 జన, 2013

అసలు మనము ఎక్కడికి పోతున్నాం???

రోజు రోజు కి మన దేశం లో జరిగే సంఘటనలని చూస్తుంటే మనము ఎక్కడి పోతున్నామ అనే సందేహం కలుగుతుంది.

నేను ఈ మధ్య ఒక బ్లాగ్ లో పెళ్లి గురించి వచ్చిన ఒక వ్యాసం చదివాను. ఆ బ్లాగర్  వివాహం అనే బంధాన్నికొంచెం  వివరించి వ్రాసాడు.అది  బాగానే ఉంది, ఆయన ఎం చెప్పాలనుకున్నాడో అది తన వ్యక్తిగత విషయం .. తనకు నచ్చ్హిన విధం గా చెప్పాడు.
అయితే అది చదివిన వారిలో ఒకరు కామెంట్  చేసిన తీరు చాలా  అసభ్య కరం గా ఉంది.
కన్న తల్లి తండ్రుల విషయం లో ఆయన  మాట్లాడిన విధానం చుస్తే కళ్ళు,చెవులు   ముసుకోక తప్పదు మరి.కాని  తను వ్రాసిన విధానం గమనిస్తే మంచి చదువరి అని అనిపించింది. తను వ్రాసింది సబబబే అని నిరుపించుకోవడానికి ఎంత ప్రయత్నించాడో అనేది ఆ వ్యాసం చదిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యె ఉంటుంది ఈపాటికి . అలా ఉన్నాయి  మన చదువులు,సంస్కారాలు.
   ఇక డిల్లీ అమ్మాయి కి జరిగింది చాలా ఘోరమయిన  అన్యాయం అని తెలిసి కూడా, సాక్ష్యాధారాలు అన్నీ దొరికినా కూడా మన చట్టాలు, న్యాయ స్థానాలు ఇంకా నానుస్తూనే ఉన్నాయి.
అసలు ఆ కేసు ఎంత దూరమ్ పోతుందో , అసలు తీర్పు ఈ దశాబ్ద కాలం లోపల వెలువడుతుందో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు తర్వాత అలాంటివి చాల వెలుగు లోకి వచ్చాయి . వాటిలో కొన్ని 10,15 సంవత్సరాలయినా కూడా తీర్పు వేలువదలేదనట . ఇలా ఉన్నాయి మన న్వ్యవస్థలు.
ఇక మన రాష్ట్రం లో చుస్తే 3 ఏళ్లుగా ఒకటే బంద్ లు,గొడవలు, అల్లర్లు, తెలంగాణా , ఆంధ్రా అని.
ఈ రాజకీయ నాయకులూ వాళ్ళు బతకడానికి మనల్ని చంపుకు తింటున్నారు. చదువుకుంటున్న విద్యార్తులు కూడా "ఊ" అంటే బంద్ అంటున్నారు. వాళ్ళే కాదు వాళ్ళకి చదువు చెప్పే గురువులు కూడా అదే ప్రోత్సహిస్తుంటే ఏమననుకోవాలి? ఒక ప్రాంతం అభివృధ్హి చెందాలంటే కావాల్సింది పాలకుల్లో చిత్త  శుద్హి, అక్కడి వ్యవస్థ లో పారదర్శకత, సత్యము, ధర్మమూ..
ఇవి కనక ఉంటె ఆ ప్రాంతం కలిసి ఉన్న, విడిపోయినా ప్రజలు సుఖం గా బతుకుతారు.
అసలు ఇవే  సరిగ్గా లేనప్పుడు ఎంత మార్పు వస్తే ఏం  లాభం? ముందు మన నాయకులు , వారి తీరు మారనిది మనము ఎంత బంద్ లు చేసినా వృధాయే కదా!!
  ఈ మధ్య you tube  లో దుమారం లేపిన ఒక హైదరాబాద్ వాసి, ప్రజా నాయకుడు గారి ఉపన్యాసం వింటే ఒళ్ళు దద్దరిల్లింది. ఎంతగా కావాలని మత కలహాలు సృష్టిస్తున్నాడా  అని ఆవేదన కలిగింది. ఆయన గారు అలా ఉపన్యాసం ఇస్తూ ఉంటె అక్కడి రక్షక భట యంత్రాంగం ఎం చేస్తుండే అక్కడ?
మన కెమరమన్ గంగ తో రాంబాబు ఎం చేస్తుండే అక్కడ? ఎక్కడో గుడి చుట్టూ పంది  ప్రదక్షణాలు చేసినదని, లేకపోతె కోతి ఏదో వింత చేసిందని, చెత్త చెత్త బ్రేకింగ్ న్యూస్ లతో  లేకపోతె అనవసరమయిన డిస్కషన్స్ పెట్టి చానల్ నడుపుకు పోతున్న వారికి పాపులర్ స్పీచ్ గురించి ఎందుకు న్యూస్  కవర్ చేయలేదో? ఎంత సేపు కమర్షియల్ న్యూస్ ఎ తప్ప ప్రజలకు ఉపయోగ పడేవి మాత్రం శూన్యం.
     ఇవన్ని చూస్తుంటే మొత్తం మన దగ్గర ఉన్న ప్రతి వ్యవస్థ కుల్లిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి వవ్స్తలో ఉన్న మనమ ఎటు పోతున్నామా అని భయం గా  ఉంది.  







8 జన, 2013

2013 వచ్చెన్! ... అప్పుడే వారం గడిచెన్!!

కొత్త సంవత్సరం మొదలై అప్పుడే వారం అవుతుంది.
మనలో చాలా మందిమి ఈ సంవత్సరం లో ఇది చేయాలి, అది చేయాలి అని అనుకొని ఓ పక్క ప్రణాళిక కూడా వేసేసి ఉంటారు. మరి అమలు కార్యక్రమం అసలు ఇంకా మొదలయ్యిందా లేదా?? 
మొదలు పెట్టిన వారికి  ఓహో...
పెట్టని వారికి "-----------" ఇకనైనా మొదలు పెట్టి ఓహో అని అనిపించుకోండి.




సహనం అంటే ఏమిటి?



ఎవరయినా తిట్టినా , కోప్పడినా, ఏదైనా  ఇష్టం లేని ఉచిత సలహా ఇచ్చినా, మనకు నచ్చని వారిని పొగిడినా, 
శక్తి కి మించి పని చేసినా, పిల్లలు సతాయించినా, అట లో ఓడిపోయినా వెంటనే కోపం వస్తుంది.
ఆ కోపం తట్టుకోలేని విధం గా తయారవుతుంది.
ఆ కోపం లో    చేయాల్సిన పనులను సక్రమం గా చేయము తద్వారా మన మీద మనకే మళ్ళీ కోపం మొదలవుతుంది.
ఇలాంటివన్నీ నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అనుభవిస్తాం, బాధ పాడుతాం, మారాలి అనే ఒక చిన్న ప్రయత్నం చేస్తాం కాని మారము. అంతే ...ఇది ఒక చక్రం లా జరుగుతూ ఉంటది.
కోపం తగ్గాక ఆలోచిస్తే... ఛీ.. ఒక్క క్షణం అలోచించి చేస్తే బాగుండేది, అనవసరం గా మళ్లీ  తప్పు చేశాను అని అనుకుంటాం . ఆ ఒక్క క్షణం ఆలోచన అనేది సహనం . అది ఉన్న వాడు ఎప్పుడు తిరిగి తప్పు చేయడు .