22 డిసెం, 2010

అందంగా ముస్తాబవుతున్న ప్రపంచం..... చూద్దాం రండి..

క్రిస్మస్ వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. మన దేశం లో కొంచం తక్కువ గానే చూస్తుంటాం కాని విదేశాలల్లో ముఖ్యం గా పాశ్చాత్య దేశాలలో ఇది చాలా ఘనం గా జరుపబడుతూ ఉంటుంది. అన్ని షాపింగ్ మాల్స్, వీధులు, అంతటా క్రిస్మస్ ట్రీ తో వెలిగి పొతూ ఉంటాయి.  నేను తీసిన కొన్ని ఫోటో లను ఏ బ్లాగ్ లో జత చేస్తున్నాను. 















21 డిసెం, 2010

సచిన్! సచిన్! సచిన్! సచిన్ టెండుల్కర్!......

కొందరి గురుంచి మాట్లాడటం మొదలు పెట్టగానే అబ్బ! ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అని విసుగు పుడుతుంది.
అదే మరి కొందరి గురించి మాట్లాడటం మొదలు పెట్ట బోతుంటేనే...చెవులకి ఎంతో హాయిగా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. ఆ కోవకు చెందిన వారే మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.
                            ఎన్ని  రికార్డులు సృష్టించినా , ఎన్ని పతకాలు సాధించినా ఏమాత్రం గర్వపడకుండా, ఎంతో ఒదిగి ఉండే  మనస్తత్వం కేవలం సచిన్ కే సాధ్యం కావచ్చు. అంతర్జాతీయ వన్డే లలలో 46 శతకాలు సాధించి, 17,514 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచినే అని చెప్పుకోవడాన్ని  ప్రతి భారతీయుడు ఇష్టపడుతాడు  . అంతే కాకుండా 1990లో ప్రారంభించిన తన టెస్ట్ శతకాల ప్రవాహం నేటికీ  ఝాలా ఝాలా అంటూ   ప్రవహిస్తూ, అర్థ శతక శతకాలతో  మన దేశ గొప్పతనాన్ని రోజు రోజు కి పెంచుతూనే ఉంది. అతను ఎన్ని రికార్డులు బ్రేఅక్ చేసినా  కూడా అతని ముఖము లో  మాత్రం  గర్వమనే ఛాయలు మచ్చుకైనా కనపడవు. అదే స్వరం, అదే అభిమానం, అదే దేశ భక్తీ ఆనాటి నుండి నేటి వరకు ఆ ముఖం లో కొట్టచ్చినట్లు  కనిపిస్తుంది. ఆ రోజు జరిగే మ్యాచ్ లో సచిన్ ఉండటం వలన మొత్తం ఆ మ్యాచ్ కే ఆదరణ బాగా పెరిగి పోతుందని విదేశీయులే చెప్పుకోవటం చూస్తుంటే మన సచిన్ ఎక్కడున్నాడో అర్థమవుతుంది.అంతటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా  తక్కువే అవుతుతుంది. ఒక్క మాటలో చెప్పాలి  అంటే.. 
"ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే వాఖ్యానికి పరిపూర్ణమైన నిర్వచనం సచిన్ టెండుల్కర్ అని మనం సగర్వం గా చెప్పవచ్చు .


20 డిసెం, 2010

please anyone suggest me...

నేను వ్రాసే శీర్షికలలకు పేరు నిర్ణయించే స్థలం లో అంటే ... శీర్షిక యొక్క పేరు వ్రాసే చోట నాకు తెలుగు లో వ్రాయడానికి రావడం లేదు. దయచేసి ఎవరైనా సూచించగలరు. 

19 డిసెం, 2010

మన గురించి ఒక టాక్సీ డ్రైవర్ ఏమన్నాడంటే .....

మన గురించి , మన ట్రాఫ్ఫిక్ సమస్యల గురించి మన దేశం లోనే కాకుండా విదేశాలలో కూడా ఏవిధంగా అనుకుంటున్నారో చెప్పటానికి ఇదో మంచి ఉదాహరణ.
                     నేను ఒక సారి నా ఫ్రెండ్ తో కలిసి మన hyd లో ఉన్నా imbliban బస్సు స్టాప్ కి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక వారం క్రితమే అమెరికా నుండి సెలవుల కోసం ఇండియా కి వచ్హాడు. మేమిద్దరం కలిసి వేరే ఊరికి వెళ్ళడం కోసం imbliban కి వెళ్ళాము.
అప్పుడు మన R. T. C Bus  ల నుండి వినిపించే ఆ భయంకరమైన శబ్దంలను విని తను ఒకటే మాటన్నాడు. ఏమిటంటే..."అరేయ్! నేను ఒక సంవత్సరం లో వినే sound మొత్తాన్ని ఏ ఒక 10 నిమిషాలలో వింటున్నాను రా"
ఆ మాట విన గానే నాకు ఏదో లా అనిపించింది. అంటే మనము ఎంత ఎక్కువగా శబ్ద కాలుష్యాన్ని కలుగ చేస్తున్నామో అని చాల బాధ అనిపించింది. 
            నేను గత వారమ సింగపూర్ కి వేల్లిన్నప్పుడు అక్కడ టాక్సీ ఎక్కాము. ఆ టాక్సీ డ్రైవర్ మమ్మల్ని చూసి indians అని గుర్తు పట్టాడు. అతను మమ్మల్ని  మాట్లాడిస్తూ... మధ్య లో తన గురించి చెప్పాడు ఇలా...." నేను దాదాపుగా  ప్రతి సంవత్సరం నా ఫ్యామిలీ తో సెలవులకి ఇండియా కి వెళ్తుంటాను. దక్షిణ భారత దేశమంతా తిరిగాము. ఇక ఉత్తరాన కాశ్మీర్ , హరిద్వార్, వారణాసి వంటి famous ప్రదేశాలను చూసాము. కానీ మాకు అక్కడ నచ్చనిదంటే... విపరీతమైన ట్రాఫ్ఫిక్ సమస్యలు, తట్టుకోలేనంతగా వినిపించే వాహనాల శబ్దాలు ... "అని అన్నాడు.  మేము ఇక్కడ మా దేశం లో చాల అరుదు గా, అది కూడా తప్పని సరి అని మాకు తోచితే నే మొగిస్తాము.  అతను అలా మాట్లాడగానే నాకు చాల బాధ అనిపించింది. అన్నిట్లో మంచి పేరు ఉన్నా మనము ఇలాంటి  సమస్యల్లో ఎందుకు ఇరుక్కొని  పేరు పోగుట్టుకున్తున్నమా!  
అని.........
                        మనము కోరోకునేదేమిటంటే... అతను మళ్లీ మన దేశాన్ని సందర్శిన్నప్పుడు ఈ విధమైన సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలని...
                             
                      
                     మన గురించి ఒక టాక్సీ డ్రైవర్ ఏమన్నాడంటే  .....