29 జన, 2011

నా బ్లాగ్ నా పైన అలిగింది

మీకు తెలుసా! నా బ్లాగ్  అదేనండి నా ప్రతి ఉదయం బ్లాగ్ నా పైన అలిగింది. ఎందుకంటే నేను నా బ్లాగ్  ద్వారా నా మీ అందరికీ ప్రతి పండుగకి శుభాకాంక్షలు తెలియజేసాను. కాని మన జాతీయ పండుగ అయినటువంటి  గణతంత్ర దినోత్సవం నాడు మాత్రం  నేను శుభాకాంక్షలు తెలియ చేయలేక పోయాను. అందుకని నా బ్లాగ్ నన్ను కోపం గా చూస్తుంది. కాని నేను ఇది కావాలని చేయలేదు. నాకు కుదరక పోవడం తో అలా జరిగింది.  
మరి ఈ విషయం నా బ్లాగ్ కి చెప్పడం ఎలా?
నాకేమి తోచడం లేదు.
మీకేమైనా ఐడియా వస్తే చెప్పరా..! please.... 

14 జన, 2011

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

అందమైన ముగ్గులతో స్వాగతం పలికే మకర సంక్రాంతి వచ్చేసింది .
ఈ బ్లాగ్ తరఫున మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


7 జన, 2011

అన్న దానమే ఎందుకంత గొప్పది?

"అన్ని దానలల్లో కెల్లా అన్న దానము చాలా గొప్పదని అందరూ అంటారు.మనం వింటూనే ఉన్నాం . కాని ఎందుకు గొప్పదో తెలుసా! తాతయ్య" అని మనవడు తన తాతయ్య ని అడిగాడు.
"ఇదిగో నేను చెప్తున్నా ..... మరి చక్కగా  గా విను" అని అన్నాడు తాతయ్య మనవాడి తో.
                       ఏదయినా వస్తువు ని దానం చేస్తే దానం తీసుకున్న వాడికి ఇంకో వస్తువు కావాలనిపిస్తుంది. డబ్బు ని దానం చేస్తే ఇంకొంచం కావాలి అని అడుగుతారు. విద్య ని దానం చేస్తే మరింత జ్ఞానం కోసం ఆరాట పడుతారు. కాని అదే అన్న దానం చేసినట్లయితే  కడుపు నిండా తినగానే ఇక చాలు అంటాడు. చాలు అన్న పదం కేవలం అన్న దానం లోనే తప్ప మరెక్కడా వినపడదు. చాలు అన్న పదం ఆ వ్యక్తి కి మరియు దానం చేసిన వారికీ ఎంతో సంతృప్తి ని కలుగ చేస్తుంది. అందుకే అన్ని దానాలల్లో కెల్లా అన్న దానం చాలా  గొప్పది. అలా తాతయ్య మనవడి సందేహాన్ని తీర్చాడు .

5 జన, 2011

నా iPhone అలారం తప్పు చేసింది

 మీకు తెలుసా! నిన్న నా iphone అలారం  ముళ్ళు కి జ్వరం  వచ్చింది . దాంతో నీరసం వొచ్చేసి మెల్లి  మెల్లి గా నడిచింది. అంతే.. ఒక గంట వెనక్కి వెళ్లి పోయింది . నేను లేచి చూసుకునే సరికి కరెక్ట్ గా ఒక గంట ఆలస్యమైయింది. పాపం కదా!


నోయిడా (2)

మన Central Bureau Of Investigation(C.B.I)  గురించి అందరికి తెలిసిందే. ఇది మన దేశం లోనే అత్యున్నత మైన investigating police agency. దేశానికి  సంబంధించిన అతి కీలకమైన కేసులను, ముఖ్యం గా దేశ ప్రజలకు ఆర్థిక, సామాజికముగా నష్టం కలుగ చేసే కేసులను తీసుకొని విచారించే విభాగము. అతి కీలకమైన క్రిమినల్ కేసులను కూడా మన ప్రభుత్వం (union government)  C.B.I. కే అప్పగిస్తుంది. ఈ  విభాగము గత 48 సంవత్సరాల నుండి  దేశం లోని ఎన్నో ముఖ్యమైన కేసులను చేదిస్తూ  వస్తుంది.  మరి ఇంతటి  గణనీయమైన అనుభవం కలిగిన C.B.I ఒక మాములు అమ్మాయి హత్య కి సంబంధించిన కేసుకి తగిన సాక్షాధారాలు దొరకక పోవడం విచిత్రం.ఈ మధ్య కాలం లో ఎలాగో  దేశ ద్రోహుల కి సంబంధిన కేసులను  ఒక కొలిక్కి తీసుకు రావట్లేదు. కనీసం  ఒక  సాధారణ అమ్మాయి హత్య ఇంట్లో జరిగింది . అది ఎలా జరిగిందో కూడా తేల్చలేకపోవడం  విడ్డూరం. మరి ఇక ఆ సంస్థ ఉండి ఎందుకు? ఈ కేసు గురించి ఒక మన దేశం లినే కాదు, ఇతర దేశాలల్లో కూడా న్యూస్ పేపర్స్ చాలా దారుణం గా వ్రాస్తున్నాయి. అయిన మన వాళ్ళు మారరు, మనల్ని బాగు పడనీయరు. చిన్న చిన్న కేసులు కూడా సంవత్సరాల కొద్ది తీర్పు కోసం వాయిదా పడుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో? ఇది  వ్రాస్తుంటే నాకు లీడర్  సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది.


"ఒక అమాయకు రాలైనా ఆడపిల్లకు న్యాయం చేయం లేని వ్యవస్థ ఉంటె ఎంత? ఊడితే  ఎంత?"

3 జన, 2011

నోయిడా (1)

అది మే నెల , 2008  . మేము అప్పుడే అంటే అదే నెల 2 వ తేదీన నోయిడా వెళ్ళాము . అప్పుడు మేము ఒక company vaallichina accommodation లో ఉన్నాం. వారం  రోజులయింది. నాకు నోయిడ చాలా  నచ్చింది .ఎందుకంటే నేను అప్పటి వరకు హైదరాబాద్ దాటి వేరే ప్రదేశానికి వెల్ల లేదు. నోయిడా ని చూసే సరికి చాల బాగా నచ్చేసింది .పెద్ద పెద్ద లివింగ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి మధ్య లో నే కమ్యూనిటీ పార్క్స్  ఉన్నాయి. చక్కగా డిజైన్ చేయబడిన రోడ్స్ ఉన్నాయి, అడ్రస్ కోసం ఎక్కువ కష్ట పడాల్సిన అవసరం రాదు. 
అన్ని గల్లిలు అనుసంధానమై ఉంటాయి. అన్ని పేర్లు సెక్టార్ లా తో ఉంటాయి. ఉదా: సెక్టార్ 21, సెక్టార్ 50 ....
  రోడ్డు మీద నడిచే వారి కోసం ప్రత్యెక మైన దార్లు ఉంటాయి. ఎక్కడ కాలుష్యం  (polution)  అనేది కనపడదు . ఎక్కడికి వెళ్ళాలన్న రిక్షా వాళ్ళు ఉంటారు. కేవలం సెక్టార్ నెంబర్ చెప్పి అపార్ట్మెంట్ పేరు చెబితే చాలు చేరిపోతాం.
 ఇవన్ని మన హైదరాబాద్ లో కూడా ఉంటాయి కాని నడిచే రోడ్డు ఎప్పుడు ఖాలీ గా ఉండదు. కొత్త అడ్రస్ వెతుక్కో వాలంటే పడే తంటాలు అంతా- ఇంతా కాదు. ఇలా నేను అన్నిట్లో నోయిడా ని హైదరాబాబ్ద్ తో పోల్చుకుంటూ ఉంటుండే.
        
అల ఉండగా ఒక్కసారి టీవీ లో ఆరుషి హత్య గురించి విన్నాను. చాలా భయమేసింది. అప్పటికి మేము ఇంకా ఇల్లు వెతుక్కోలేదు. 
ఆరుషి హత్య వినగానే అర్థమయింది... నోయిడా చూడటానికే బాగుంటది, కాని ఇక్కడి జనాలు చాల భయంకరులని. అంటే అందరూ అల ఉండక పోయినప్పటికీ .... అక్కడ safety  మాత్రం ఉండదని అక్కడ ఇలాంటి గొడవలు సర్వ సాధారణమని తెలిసి పోయింది . అక్కడ ఉంటె చాలా ధన వంతులుంటారు, లేక పొతే నిరు పెద  వాళ్ళు. మధ్య  తరగతి వాళ్ళు ఉండటం కొంచం తక్కువే.
ఇక ఇంట్లో ఉండే ఇద్దరు( భార్య , భర్త)  దాదాపుగా ఉద్యోగస్తులే ఉంటారు. 
ఇంకేముంది.... ఎప్పుడూ దొంగతనాలు, హత్యలు....ఇవే అక్కడ. ఇంటికీ, మనుషులకీ  ఏమాత్రం safety ఉండదు. ఇంట్లో ఉన్నా , బయటికి వెళ్ళినా తాళం తప్పనిసరి. 
అలా నోయిడా గురించి తెలుసుకున్నాను. అంతలోనే 2 వారాలు గడిచి పోయాయి. మేము ఇల్లు వెతుక్కున్నం. కాని నా మనస్సులో  మాత్రం భయం పేరుకు  పోయింది. కొంచం రాత్రి అయిందంటే చాలు మేము భయటికి వెళ్ళడానికే ఆలోచించే వాళ్ళం.
ఇక మళ్లీ కథ మొదలయింది అదే పోల్చుకోవడం.... మన హైదరాబాద్ లో అయితే ఎంత రాత్రి అయిన హాయిగా తిరగొచ్చు. 
పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో ఉండక పోయిన ప్రశాంతం గా బ్రతకొచ్చు. ఇలా మళ్లీ మొదలయింది. ఇంకే ముంది.... ఎలా గోలా కొన్ని నెలలు ఉండి తిరిగి హైదరాబాద్ కే transfer  చేయించుకున్నాం. 
ఎంతయినా మన హైదరాబాద్ లో ఉన్నంత safety  కాని, ఫ్రీడం కాని, flexibility  కాని ఎక్కడ ఉండదని అర్తమయింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మనది తెలుగు సంస్కృతి. ప్రత్యెక మైన పద్దతి తో , పచ్చని తోరణాల ముంగిళ్ళలో  అందం గా , ఆనందం గా జరుపుకునే పండుగలు ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా మన ప్రతి పండుగ   ఒక విశేష మైన కారణం తో జరుపుకోబడుతుంది.మరి అలాంటపుడు మనకంటూ ప్రత్యెక మైన తెలుగు సంవత్సర ఆరంభ వేడుక అదేనండి మన "ఉగాది" ఉండగా మరి ఈ జనవరి ఒకటిని ఎందుకు మనము జరుపుకోవాలి?


 ఎందుకంటే.. మారుతున్న పరిస్థితుల తో, పరిచయాల తో మనము నడుచుకోవాలి అనేది పెద్దల మాట. అలాగని మన సంప్రదాయాల్ని, మన ఆచారలని, పండుగలని  మనము మర్చి పోకూడదు. ఈ ప్రపంచీకరణ  యుగం  లో ఒక దేశపు, అలవాట్లను మరొకరు స్వీకరించడం పరిపాటి గా మారింది. ఉదాహరణకి మన యోగా , ధ్యానం, ఆయుర్వేదం, వంటి పురాతన పద్ధతులను  విదేశీయులు మన నుండి నేర్చుకొని విధి గా ఆచరిస్తున్నారు. అంతే కాకుండా మన అతి పెద్ద పండుగ అయిన దీపావళి ని ఇతర దేశా లలలో ప్రభుత్వ పండుగ గా ప్రకటించి అమలు పరుసున్నారు. అలా అమలు చేయడం  అక్కడ ఉండే మన వారి కోసమే అయినప్పటికీ మన పండుగను వాళ్ళు జరుపుకోవడం ఆనవాయితీ గా మరి పోయింది. అదే విధం గా మనం కుడా జనవరి ఒకటి ని కొత్త సంవత్సర పండు గా జరుపుకుంటున్నాం  .   మన దగ్గరి  చాలా రంగాలలో  జనవరి ని సంవత్సర ఆరంభం గా, డిసెంబర్ ని చివరి నెల గా పాటిస్తున్నారు.  ఇంట్లో, బయటా , పిల్లలు పెద్దలు అందరూ కూడా జనవరి నుండి,డిసెంబర్ వరకు ఉండే కాలాన్ని ఒక సంవత్సరం గా పరిగనిస్తున్నారు . ఇలా ఏ రకం గా చూసిన కూడా మనకి తెలిసో , తెలియకనో జనవరి నెల మొదటి  నెల గా మారి పోయింది. కాబట్టి మనము కూడా దీన్ని  అంటే జనవరి ఒకటి ని నూతన సంవత్సర తోలి వేడుక గా , ఓ పండుగ గా చూస్తున్నాం మరియు అలా జరుపుకుంటున్నాం కూడా. 


మరి ఈ 2011 సంవత్సరము మనందరికీ మంచి ఆరోగ్య సంవత్సరం గా ఉండాలని, మరియు అన్నింటిలో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుందాం.