26 ఆగ, 2011

రవాణా శాఖ కి రాబోతున్న మంచి ఘడియలు

మన దేశం లో ప్రవేశ పెట్ట బోతున్న కామన్ మొబిలిటీ కార్డు కాన్సెప్ట్ అభినందనీయము.
ఈ కార్డు వలన దేశం లోని ఏ రాష్రంలోనైనా, ఏ ప్రభుత్వ  రవాణ సాధనన్ని అయినా వినియోగించుకోవచ్చు.  అవినీతి నిర్మూలనకి ఇది తొలి మెట్టు కాబోతునదని నా అభిప్రాయం.
ఈ రకం గా నైన రావణ శాఖ లో ఎదురవుతున్న మోసాలు, అవినీతి ని అరికట్ట వచ్చు.
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలని పరిశీలించినట్లయియితే..
1. తిరుపతి/ తిరుమల ప్రాంతం లో తిరిగే కొన్నిబస్సు సర్వీసులలో పనిచేసే కొంతమందికండక్టర్లు అసలు టికెట్లకి బదులుగా నకిలీ టికెట్లని తయారు చెస్తూ దొరికి పోయారు.
2. మన సౌలభ్యం కోసం రైల్వే  శాఖ ఇ-టికెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కాని ఇ-టికెట్ లను కూడా అచ్చం గా ఒరిజినల్ టికెట్ల మాదిరి కొన్నింటిని తయారు చేసి  దేశ వ్యాప్తముగా దోచుకుంటున్నదొంగల ముఠా ఒకటి ఈ  మధ్య నే వెలుగులోకి వచ్చింది.  
3. ఇక సిటీ బస్సులలో పనిచేసే కొంత మంది కండక్టర్లు చిల్లర లేదనే సాకుతో ప్రయనికులకి గండి కొట్టేస్తున్నారు. మరికొంత మందేమో ఇది వరకే ఇష్యూ చేసిన టికెట్ ని కొన్నిసార్లు ప్రయాణికుల దగ్గరి నుండి తీసుకొని వేరే వాళ్ళకి అదే టికెట్ ని ఇవ్వడం. ఇలాంటి సంఘటనలయితే వారం లో కనీసం  2-3 అయిన చుస్తూనె  ఉన్నాం . ఈ రకమైన దోపిడీలో మగ కండక్టర్ల  కంటే మహిళా కండక్టర్ల చేయివాటమే అధికం గా కనిపించడం నిజంగా అవమానం.
ఇవి కేవలం నాకు గుర్తున్న ఈ మధ్య జరిగిన, జరుగుతున్న సంఘటనలు మాత్రమే. ఇంకా ఇలాంటివి మన దేశం మొత్తం లో ఎన్నిజరుగుతున్నాయో ఎవరికి తెలుసు?  వీటన్నింటి కి చెక్ పెట్టాలంటే కామన్ మొబిలిటీ కార్డు సరియైన విధానం అని నాకు అనిపిస్తుంది. 
ఈ మధ్య సింగపూర్ కి వెళ్ళినపుడు అక్కడ కూడా ఇలాంటి కార్డు ని చూసాను. దాన్ని ez-link
అనే పేరు తో పిలుస్తారు . నేను మొట్ట మొదటి సారిగా అక్కడి మెట్రో ఎక్కినపుడు ఈ విధానానికి చాల సంతోష పడ్డాను. చిల్లర లేక పొతే మన హైదరాబాద్ లోని కండక్టర్లు అనే మాటలు ఒక్కసారి గుర్తొచ్చి నవ్వుకున్నాను కూడా. ఇప్పుడు ఇదే విధానం మన దేశం లో రాబోతోన్దంటే ఇది ఖచితంగా ప్రభుత్వ రవాణా విభాగం లో అవినీతి ని నిర్మూలించడానికి  రాబోతున్నమంచి ఘడియలు అని అనుకోవచ్చు. దీనికి మీరేమంటారు?   

20 ఆగ, 2011

కల్తీ చేయబడుతున్న కుంకుమ

కుంకుమ నుదిటి మీద పెట్టుకోవడం మన  సంప్రదాయం.
కానీ ఈ మధ్య కాలం లో అన్ని వస్తువులను కల్తీ చేయడం ఒక వ్యాపారం గా మారిపోయింది. ఆ కల్తీ వస్తువుల లోకి ఇప్పుడు కుంకుమ ని కుడా చేర్చేసారు.  
కుంకుమ ను పెట్టుకున్నాక కొన్ని గంటల లోపే దురద మొదలవుతుంది.
తర్వాత అది అలర్జీ గ మారుతుంది. కాబట్టి కొనే ముందు ఒకటి కి రెండు సార్లు గమనించి  కొనండి. మంచి కుంకుమ (ఎలాంటి కల్తి లేనిది ) అని గుర్తు పట్టడం ఎలా ?  మీలో ఎవరికైనా సమాధానం తెలిస్తే  ఇక్కడ సూచించంచగలరు.

19 ఆగ, 2011

శ్రీ రామ రాజ్యం పాటలు విన్నారా...?

హలో .... నమస్తే.... నమస్కారం.... ఎలా ఉన్నారు...?

ఏమి చేస్తున్నారు...? అంతా కుశలమేనా..!

ఏంటి ఈ రోజు ప్రతి-ఉదయం లో ఈ సోది ప్రశ్నలు అని అనుకుంటున్నారా..!

ఏమి లేదు లెండి, ఏదో వెరైటీ కోసం ప్రయత్నించాను. మీకు నచితే సంతోషం, నచ్చక పొతే సారీ... నేనేమి చెయ్యలేను. అసలు విషయానికి వస్తే... నేను నిన్న న ఒక ఫ్రెండ్ ని కలిసాను. అప్పుడు మాటల్లో మాట గ ఈ శ్రీ రామ రాజ్యం సినిమా గురించి వచ్చింది. ఈ సినిమాపాటలు విన్నావా అని న ఫ్రెండ్ నాతో అనింది. నేను ఇంకా లేదు అన్నాను. విను చాల బాగున్నాయి అని తన అభిప్రాయం గ చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత పాటలు పెట్టాను. మొదటి పాట విన్నాను. ఏదో కొంచెం కొత్త బాణీ  లో పాడినట్లున్నారు అని అనుకున్నాను. అలాగే వరుసగా అన్ని పాటల్ని కంటిన్యూ చేశాను. మధ్య లో ఈ సినిమా కి ఇంతకీ మ్యూజిక్  అందించిన  మహాను భావులు ఎవరా అని ఒక్కసారి చూసాను.

అంతే.. ఒక్కసారిగా ఖంగు తిన్నాను. ఎందుకంటే ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ది గ్రేట్ గురువు గారు, నా ఫేవరేట్ అయిన ఇలయ రాజా నా అని !

అప్పుడు అనిపించించింది... గురువు గారి బాణీ లో నే తేడా లు మొదలైనట్లున్నాయి  అని.
మనసులో చిన్న అనుమానం కూడా వేసింది ఏంటంటే.. ప్రొడ్యూసర్ అనుకున్నంత డబ్బు ఇవ్వకుండా మోసం చేసదేమో అందుకు గురువు గారు ఈ రకం గా ప్రతీకారం తీసుకున్నరేమో అని. (ఇది నా మనసులో మెదిలిన  ఒక పిచ్చి ఊహమాత్రమే.)

మొత్తానికి ఇలయ రాజా గారు కూడా ఈ తరం సంగీత దర్శకులల్లో ఒకరిగా కలిసి పోయారు.
ప్చ్... చాలా బాధ గా ఉంది  .






17 ఆగ, 2011

అమ్మో వీళ్ళు మన నాయకులేనా? ఎంత మార్పు...!

మన రాజకీయ నాయకులు = ఎప్పుడు గొడవలు సృష్టిద్దామా అని ఎదురు చూసే వాళ్ళు.
మన రాజకీయ నాయకులు = అధికారమే జీవితాంత ఆశయం గా నమ్మే వాళ్ళు.
మనరాజకీయ నాయకులు =అక్రమ సంపాదన ఉంటేనే కడుపు నిండా భోజనం చేయగలరు, కంటి నిండా నిద్రించ గలరు.  
మన రాజకీయ నాయకులు = గ్రామ సర్పంచ్ నుండి పార్లమెంటు మెంబెర్ వరకు అందరికీ ఒకటే నీతి- అందినంత  వరకు దోచుకోవడమే.
మన రాజకీయ నాయకులు =ఎంత పెద్ద కుమ్భకోణం  లో  ఇరికినప్పటికీ  దర్జాగా  బ్రతుకుతూ శిక్ష నుండి తప్పించు కునే వారు.
మన రాజకీయ నాయకులు = కేవలం తామే కాదు, తమ  కొడుకులు,కూతుర్లు  లేదా  ఇతర  కుటుంబ  సభ్యులు  ఎవరైనా  ఎంతటి నేరాలకి పాల్పడినప్పటికీ కుడా  న్యాయస్థానానికి మాత్రం దొరకని వారు. 

మన రాజకీయ నాయకులు ఇలా  చాలానే అర్థాలని  సంతరించుకున్నారు.

                     కాని అందులో "అమ్మో!  వీళ్ళేనా!" అని అనిపించే అర్థం ఒకటి నాకు ఈ రోజే కనిపించింది. ఏంటంటే... వీళ్ళు, మన రాజకీయ నాయకులు అవినీతి కి వ్యతిరేకం గా పోరాడుతున్న మన అత్యుత్తమ దేశ నాయకుడైన శ్రీ అన్న హజారే గారికి మద్దతు తెలపడం.
ఇది నిజమైన వింత, ప్రపంచ లోని అన్ని వింతలలో కేల్ల అతి కొత్త వింత.
అవినీతికి  పరాకాష్ట అని చెప్పుకునే మన రాజ కీయ నాయకులు అవినీతి నిర్ములనకి తోడ్పాటు నందించడం  నమ్మదగిన విశయమేనా?

నాకెందుకో సందేహం గానే ఉంది.

ముందు ముందు ఈ బడా బాబులు ఇంకా ఎన్ని వింతల్ని , విడ్డూరాలని  మనకి చూపించ బోతున్నారో వేచి చూడాల్సిందే మరి!




15 ఆగ, 2011

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


                              



                             
జై హింద్
                                                                     


      


భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు












 
 
 

14 ఆగ, 2011

మన రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు వస్తాయేమో....!

నా కెందుకో మన  రాష్ట్రం  లో  మధ్యంతర ఎలక్షన్స్ వస్తే బావుండు అని అనిపిస్తుంది.
ఈ చాత కాని సి ఎం  ని చూడ లేక పోతున్నా. ఒకప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ అంటే మన
దేశంలోనే కాదు దాదాపు ప్రపంచం అంతటా ఓ మంచి పేరు ఉండేది. ఆ  స్థితికి రావడానికి చాల కాలం  పట్టింది.
బహుశ చంద్రబాబు కుడా తన హయాం లో ఈ పేరు కోసం చాల నే పబ్లిసిటీ చేసాడనుకోండి  . తానూ చేసింది గోరంతే అయినా చెప్పుకుంది కొండంత (అది వేరే విషయం లేండి).
అప్పుడున్న  మన రాష్ట్రాన్ని ఒక మామిడి తోట తో  పోలిస్తే, ఎవరో చెట్లని   నాటి, పెంచి, మరెవరో వాటిని పెద్దచేయాగా ఆ తోట  మంచి పక్వ దశ కి చేరువ అయింది  . ఆసమయం లో తోట ని కాపాడుతున్న తోట మాలి(న్.సి.న్ )  కి పైత్యం పెరిగి (కాలేజీ ఫీజు లు పెంచడం, ప్రభుత్వ ఉద్యోగులతో చెలగాట ఆడటం లాంటివి చేసాడు కదా..) తోటనంత చిందర వందర చేయడం మొదలు పెట్టాడు . దాంతో విసుగు చెందిన యజమాని (ఇక్కడ రాష్ట్ర ప్రజలు) ఆ తోటను వేరే తోట మాలి చేతి లో (వై.ఎస్.ర్) పెట్టాడు...       

అయితే ఇది వరకు ఉన్న తోట మాలి తోటను కొంచం చిందర వందర చేశాడే కాని , పక్వానికి వచ్చిన చెట్లను పాపం ఏమి చేయలేదు. అలా పరి పక్వ దశ లో ఉన్న మామిడి తోట ను తన  చేతి లోకి అందుకున్నతోట మాలి తోలి  దశ లో బాగానే కష్ట పడి ఆ పళ్ళను సరియైన రీతి లో సరియైన విధం గానే యజమానికి అప్పచెప్పాడు.

కాని మనిషికి దుర్భుద్ది అనేది ఒకటి ఉంటుంది  కదా.. అది కాస్త ఆ తోట మాలి ని నిలువునా మింగేసి కాచిన పల్లనన్నీ తనే తినడం, తనవాల్లకే పంచి పెట్టడం మొదలెట్టాడు.
ఇంకేముంది.... పళ్లన్నీ ఖాళీ అయ్యాయి, అంతే  కాకుండా.. చెట్లనీ పట్టిచుకునే నాథుడు లేక  చీడ కూడా మొదలయింది.

చీడ వేరు దశలో ఉన్నప్పుడే తోట మాలి మారిపోయాడు. కాని తర్వాత వచ్చిన తోట మాలి కి ఆ తోట ని బాగు చెసే  శక్తి లేక ఇంకా దీనవస్తకి తీసుకు వచ్చాడు .
అల చూస్తూ చూస్తూ ఉండగానే ఎక్కడి నుండో వచ్చిన దుండగులు ఆ తోట ని ముక్కలు ముక్కలు చేసి పంచుకోవాలని పన్నాగం పన్నారు. పాపం అమాయకుడయిన యజ మాని కి ఆ విషయం అర్థం కాలేదు. ఆ దుండగుల ని నమ్మడం  , వారి మాటలకి విలువనివ్వడం చెస్తూ వచ్చాడు   .
దాంతో ఇప్పుడు తోట కాస్త పంట లేక, విల విల బోతుంది . ఇప్పుడయిన ఆ తోట యజమాని (మన రాష్ట్ర ప్రజలు )మేలుకొని తోట బాగోగులని చూడటానికి ఒక  సరియైన , సమర్థుడైన తోట మాలి ని ఎంచుకుంటే బావుండు అని అనిపిస్తుంది.

అందుకోసం మధ్యంతర  ఎన్నికలు వస్తే బావుండు అని అనిపిస్తుంది.
దీనికి మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారా/ లేక ఈ అభిప్రాయాన్ని తప్పు పడతారా? లేక వేరే ఇతర సమాధానం చూపిస్తారా?


12 ఆగ, 2011

ఈ రోజు ఏమి చేద్దామంటే....

హాయ్ ఫ్రెండ్స్...
       నిన్న అంతా నా ప్రతి-ఉదయం బ్లాగ్ లో చాల వేడి వేడి గ చర్చలు జరిగాయి.
అందరూ మీ అభిప్రాయాలను తెలియ  చేసినందుకు చాల కృతఙ్ఞతలు. ఆ "బంద్"
అనే టాపిక్ ని ప్రస్తుతానికి అల పక్కన పెడుదాం. ఎందుకంటే ఎప్పుడూ  ఒకటే రచ్చ 
 చేయడం నాకు నచ్చదు. అలా అని ఆ టాపిక్ ని అలాగే వదిలి పెట్టను కుడా. మల్లి
 ఒక రోజు దీని గురించి మాట్లాడుకుందాం.
       ఈ రోజు  "వరలక్ష్మి వ్రతం" కదా... ముందుగా మీ అందరికి వరలక్ష్మి వ్రత
శుభాకాంక్షలు. ఈరోజు  అందరం మనసార ఆ జగన్మాతను ప్రార్థిస్తూ హాయిగా ఉందాం.
ఇంట్లో చేసిన రుచి కరమైన వంటలను  తింటూ సరదాగా గడుపుదాం

  
          

11 ఆగ, 2011

ఈ బంద్ ల వాళ్ళ ఏమి సాధిస్తున్నారు?

మన రాష్ట్రం లో 2009 డిసెంబర్ 9 నుండి ప్రతి ఒక్కరికి పరిచయమైనా పదం " బంద్ ".
కెసిఆర్ ఏఉదేశ్యముతో తెలంగాణా అంశాన్ని లేవనేత్తాడో తెలియదు కానీ, ఆ మహానుభావుడి
పుణ్యమా అని దాదాపు గా ప్రతి  నెలలో బంద్ లను చూడాల్సిన దుస్థితి దాపురిచినది.
నాకు ఒక్క  విషయం ఇంత వరకు అర్థం కావడం లేదు... అది ఏంటంటే.. 
      " ఒక సంస్థ లో  పని చేసే వారు వారి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం బంద్ చేస్తారు అది ఓకే. మరి ఇక్కడ మన రాష్ట్రం లో "తెలంగాణా" అనే  ఒక అద్భుతమైన పేరు వాడుకుంటూ ప్రతి నెల బంద్ ప్రకటించడం ఏంటి?"  ఈ బంద్ ఉన్నప్పుడు

1. దుకాణాలన్నీ మూసెయ్యాలని అంటారు.
2. అన్ని విద్య సంస్థలు మూయలంటారు.
3. ఆఫీసు లను మూయలంటారు.
4. ఎలాంటి ప్రభుత్వ  వాహనాలను నడప వద్దంటారు.
5. చివరికి కనీసము కూరగాయల బండ్ల ను కూడా రోడ్డు మీదికి రావద్దంటారు.
అమ్మో ఇంకా చాలా నే అంటారు లే..

కానీ ఇవన్నీ  2009 డిసెంబర్ నుండి విధి గా ప్రతి నెల సాగిస్తున్నారు. ఈ మధ్య అయితే మరీ ప్రతి 10  రోజులకు ఒక బంద్ ఉంటున్నట్టు ఉంది. ఇప్పటి వరకు   చేసిన బంధ ల వాళ్ళ
కెసిఆర్ కైతే చాల పేరు వచ్చింది. ఇతర రాజకీయ నాయకులకి అయితే ఢిల్లీ నుండి హైదరాబాద్ కి ప్రయానాలే  ప్రయాణాలు . ఇలా విమానం ఎక్కుతారు, అలా విమానం లో నుండి దిగుతారు
ఎందుకు వెళ్తున్నారో, ఏమి సాధిస్తున్నారో  వాళ్ళ కే తెలియాలి.
కానీ నేను ఒక్క విషయం మాత్రం మీ అందర్నీ అడగాలనుకుంటున్నా.. ఏంటంటే ప్రతి ఉద్యమం లో విద్యార్థులు పాత్ర ఉండాలి ఉండాలి అంటారు కదా కానీ అసలు ఉద్యమము అంటే ఏంటో కూడా  తెలియని ప్రాథమిక పాటశాల విద్యార్థుల్ని ఎందుకు ఈ ఉబి లో దిన్చుతున్నారో అర్థం కావడం లేదు.
కాలేజీ చదువులు చదువుతున్న వారిని ఎలాగో ఈ ఉబి లోకి దించారు, వారిని నిలువునా  ముంచుతున్నారు. మరి పసి పాపాలు ఏమి తప్పు చేస్సారని వారికీ కూడా బంద్ లని వర్తింప చేస్తున్నారు?