3 ఏప్రి, 2013

ఓం! రావి శాస్త్రి ! నమోనమః !----- ఇది రమణ గారి గొప్పతనం.....

నిన్న సాయత్రం ఇంట్లో ఓ పెద్ద గోడవ  జరిగింది . దాంతో ఎ పని చేయాలన్నా విసుగు, కోపం,  చిరాకు . మాములుగా అయితే కోపం వస్తే అలిగి అన్నం తినకుండా సత్యాగ్రహం చెస్తాను. కాని ఇప్పుడు అది కూడా కుదరనంత పని. ఆ విసుగు తోనే తెల్లారింది . కోపం కోపం గా పని చేసుకుంటూ ఎలాగో బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను . కాని మనసు లో మాత్రం నిన్న పడ్డ మాటలు రగులుతూనే ఉన్నాయి . ఇప్పుడే కొంచెం కడుపు కాలుతుందని ఓ నాలుగు ఇడ్లీలు, కొబ్బరి చట్నీవేసుకొని తిని ఇలా లాప్టాప్ ఆన్ చేసి మాలిక తెరిచను. అంతే  అక్కడ
ఓం! రావి శాస్త్రి ! నమోనమః !! అంటూ "పనిలేక " బ్లాగ్ రచయితా అయిన రమణ గారి శీర్షిక చూసాను . రావి శాస్త్రి అంటే మన రాచ కొండ విశ్వనాథ శాస్త్రి కదా అనిఅనుకొని టక్కున ఓపెన్ చేసి చదివాను. అంతే ...
నా కళ్ళ  లోని కోపం కరుగు తూ కరుగు తూ పెదవుల దాకా కారి ఒక చక్కటి చిరునవ్వు లా రూపం మార్చేసింది .
నా నవ్వుకి పరోక్ష కారణం రావి గారైనప్పటికి ప్రత్యక్ష కారకులు మాత్రం రమణ సర్ గారు.
        వీరి రాతలు : ఎంత చక్కటి మాటలు, అందులో పలికీ పలకని హాస్యం, అందమైన పద జాలం, ఎప్పుడు వినని కొత్త కొత్త పోలికలు అబ్బ ఎంత బాగున్నాయో చెప్పలేను , ఆ బ్లాగ్ తెరిచి చదవాల్సిన్దె. నేను కొన్ని చదివాను . అందులో మిర్చి బజ్జి గురించి రాసిన ఆర్టికల్ చూసి చాల నవ్వుకున్నాను సర్ .  హాట్సాఫ్ రమణ  గారు.