14 డిసెం, 2011

సినిమాలలో కనపడే కామిడి సీన్ కి అర్థం ఎందుకు మారి పోతుంది ????

ఎందుకు ఈ మధ్య సినిమాలల్లో హాస్యానికి అర్థం మారి పోయింది?
హాస్య నటులతో హాస్యానికి బదులు అపహాస్యం పలికిస్తున్నట్లు ఉంది.
కామిడి సీన్ వచ్చినదంటే చాలు... బ్రహ్మానందం ని పలు రకాలుగా తిట్టడమో లేక కొట్టడమో చేయడం. ఆ సమయం లో బ్రహ్మానందం గారి ముఖ కవలికల్ని చూసి మనం నవ్వుకోవడం. ఇంతే. ఇదే జరుగుతుంది. ఇది ఏ ఒక్క సినిమా లో కాదు దాదాపు గా గత 6/7 సంవత్సరాల నుండి వస్తున్న అన్ని తెలుగు సినిమా లలలో ఇదే కనపడుతుంది. అప్పుడు అది హాస్యం ఎలా అవుతుందో నాకు మాత్రం అర్థం కావడం లేదు. హాస్యం అంటే సహజం గ ఉండాలి. విన గానే లేదా చూడగానే మనసుకి ఒక రకమైన భావన కలగాలి. అప్పుడు మన లో సంతోషం ఏర్పడుతుంది. అది మన పెదవుల పైన నవ్వు ని చిలకరిస్తుంది. కాని ఈ మధ్య వస్తున్న సినిమా లలో హాస్యం అంటే కేవలం హాస్యనటులని కొడుతూ , తిడుతూ ఉండటం. ఇది నిజానికి హాస్యం కాదు. అపహాస్యమే అవుతుంది. వేరే వాళ్ళ మీద సటైర్లు వేసి నవ్వించడం ఒకటి రెండు సార్లు అయితే చూడవచ్చు కాని అదే సీను అన్ని సినిమాలల్లో వాడుతుంటే ఈ డైరెక్టర్ లకు తీయడానికి బోర్ కొట్టట్లేదు, చేసే నటులకు బోర్ కొట్టట్లేదు. ఇక మిగిలింది మనమే.. ప్రేక్షకులం. మనకు మాత్రం బోర్ కొట్టిచ్చి చంపుతున్నారు. రవి తేజ సినిమా ఒకటి (పేరు గుర్తు లేదు )... అందులో అయితే ఒకటే పని గా కొట్టడమే కామిడి అయిపొయింది. మొన్న వచ్చిన దూకుడు అంతే . అంత పెద్ద కమిడియన్ స్టార్ అయిన బ్రహ్మానందం ని అరేయ్ ఒరేయ్ అని పిలుస్తూ ఉండటం చూసే వాళ్ళకే అసహ్యం వేసే ల ఉంది . ఇక ఉన్న డైరెక్టర్ లకు కొత్త ఆలోచనలు ఎలాగో రావని అర్థమయి పోయింది కాని తీసే నటులయిన కొంచెం కొత్తగా ఉంటే నే తీస్తాం అని మొండి కేస్తే సరి.

    "అలా మొదలైంది" సినిమా లో ని కామిడి కొంచెం కొత్తగా ఉంది.  ఆ డైరెక్టర్ నందిని రెడ్డి సినిమా క్లైమాక్స్ సీన్ లో గౌతమ్ (హీరో కాదు, తాగు బోతు గా నటించిన రమేష్ ) అనే కొత్త కారెక్టర్ తో  చాలానే  నవ్వించింది. 
ఆ గౌతమ్ "అబ్బ తమ్ముడూ..." అనే డైలాగ్ ని వింటే చాలా బాగా అనిపిస్తుంది. అతను సహజం గా చేసినట్లు ఉంది. అతను మాట్లాడే ప్రతి డైలాగ్ ఆ రోల్ కి కరెక్ట్ గా suit అయ్యింది. ఇలా కొంచెం కొత్త డైరెక్టర్లయినా వచ్చి ఉన్న హాస్యాన్ని అపహాస్యం కానీయకుండా చుస్తే బాగుంటది,( పాత వాళ్ళు ఎలాగో మారరు).



13 డిసెం, 2011

"ఈ రోజుల్లో జనాలకి ఓపిక లేకుండా పోతుంది"

అలా బోర్ కొడుతుందని రేడియో ఖుషి పెట్టాను. అందులో ఎక్కువగా నేను R.J మిత్ర ప్రోగ్రాం అదేనండి "మల్లి మల్లి పాడాలి" అనే ప్రోగ్రాం వింటాను. అది కాకుండా "నమస్తే మామ" కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాను. ఈ రోజు కుడా ఎప్పటి లాగానే "నమస్తే మామ" పెట్టాను. అందులో ఇవ్వాల్టి టాపిక్ 
"ఈ రోజుల్లో జనాలకి ఓపిక లేకుండా పోతుంది". ఈ టాపిక్ గురించి ఆ మామ , అల్లుల్లూ ఇద్దరి సంభాషణ సూపర్. మామ చెప్పే మాటలకు మధ్య మధ్య లో అల్లుడు వేసే జోక్స్ చాల బాగున్నాయి. మొత్తానికి వీళ్ళిద్దరూ ఉన్నది ఉన్నట్టు గా కరెక్ట్ గా చెప్తారు. ఒక్కోసారి వింటుంటే మన లో  కూడా ఈ లక్షణం ఉంది అని బయటికి అనుకోక పోయినా మనసులో మాత్రం ఒప్పుకుంటాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మామ రైల్వే స్టేషన్ లో జరిగే ఒక చిన్న ఉదాహరణ ఇచ్హాడు. అది exact  గా ఈ మధ్య జరుగుతూనే ఉంది.
అదేంటంటే... 
మామ : ఈ మధ్య కాలం లో అంతా ఆన్ లైన్ లోనే టికెట్ బుక్ చేసుకుంటారు. స్తేషని కి కేవలం ఒక మూడు, నాలుగు నిమిషాల ముందు వస్తారు . ఇక ట్రైన్ పొరపాటుగా కొంచెం లేట్ ఉంది అని అన్నౌన్సుమేంట్ వచిన్దనుకోండి. అంతే.. ఒకటే చిరాకు పడతారు. పది నిమిషాలు కూడా ఓపిక పట్టరు. ఇటు అటు తిరుగుతూ ఒకటే టెన్షన్ పదుతూ కొంపలు అంటుకుపోతున్నట్టు చేస్తారు అని అంటాడు. అదే మా కాలం లో అయితే మేము ఓపికగా అలాగనే కూర్చొని ఉండే వాళ్ళం అని అంటాడు. దానికి వెంటనే అల్లుడు మీ కాలం లో మీకు ఏమి పని ఉండకపోయేదేమో అని టక్కున అనేస్తాడు . :D 
అప్పుడు మామ : మా కాలం లో ఎందుకు పనులు ఉండవనుకున్టున్నావు, మీకంటే ఎక్కువ గానే ఉండేవి; ఇంకా మాకు అప్పుడు ఇంత టెక్నాలజీ  లేకున్నా మేము ఆదర , బాదర పడకుండా ఓపిక గా ఉండే వాళ్ళం అని అనేస్తాడు. ఏది ఏమయినా ఆ కాలం వాళ్ళ తో పోల్చుకుంటే  మనలో కొంచెం ఓపిక తక్కువే అని మాత్రం మనం అందరం ఒప్పుకోవాల్సిందే. 

అలా సరదాగా సాగే  వీరి ప్రోగ్రాం వింటే ఖుషి ఖుషి గా , హాయి హాయి గా అనిపిస్తుంది.

5 డిసెం, 2011

కడాయి పనీర్ తిందామా!

ఈ రోజు కడాయి పనీర్ తినాలని అనిపించింది . అంతే ఇక వెంటనే షాప్ కి వెళ్లి కావాల్సినవన్నీ  తెచుకొని చక చక చేసేసాను . ఎలా చేసానంటే... 
కావలసినవి:


1 . పనీర్ ౩౦౦ gm
2.కాప్సికం ౩ (చిన్నవి)
(ట్రాఫ్ఫిక్ లైట్ కాప్సికం కొన్నాను... అంటే green, red, yellow కలర్  వి  )
3 .ఉల్లిపాయలు తరిగినవి  ఒక పెద్ద కప్ నిండా
4 . నూనె 3/4 tbps 
5 . టమాటాలు 2
6 . కొత్తిమీర
7 . కరివేపాకు 
8 . ఎండు మిర్చి
9 . జీలకర్ర 
10 .ఉప్పు , కారం, పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు 








 ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా!!!!!




step 1: ముందుగా కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పనీర్ ని వేయించుకున్నాను



ఆ తర్వాత పనీర్ ని అందులోంచి తీసి అదే కడాయి లో ఇంకొచెం నూనె వేసి కాప్సికం ముక్కల్ని వేయించాలి.





ఇక్కడ నేను తీసుకొని వచ్చిన రెడ్ కాప్సికం ఖరాబ్ అయింది. అందుకని వాడలేక పోయాను.
వీటిని  కొంచెం వేయించిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలి. 







తర్వాత అదే నూనె లో ఎండిన మిరప కాయలు, జీలకర్ర, వేసి వేయించాలి. 




 


 ఆ తర్వాత అందులోనే  సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు , టమాట ముక్కలు కూడా వేసి కలిపి  మూత పెట్టాలి .




 కొంచెం సేపు అయ్యాక కలిపి అప్పుడు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్టు  వేసి మల్లి మూత పెట్టాలి 

                                                        అది మొత్తం గ్రేవీ  చిక్క పడుతుంది.


 అప్పుడు ముందుగ వేయించిన కాప్సికం ముక్కల్ని, పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని  వేసి కలిపి  ఒక 5 నిముషాలు మూతపెట్టాలి. 










       తర్వాత పనీర్ కూడా వేసి కలిపి కొంచెం సేపు (మరో 5  నిముషాలు  ) మూత పెట్టాలి. 








చివరిగా కొత్తిమీర వేసి దించెయ్యాలి.








అంతే కడాయి పనీర్ తయ్యార్ !!!!!!!!!!!!!!!!!!!!!!!!













25 నవం, 2011

ఈ మధ్య ఎవరి నోట విన్న ఈ పాట గురించే మాట్లడుతున్నారు.

ఈ పాట గురించి చెప్పాలంటే ....
 ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట వినిపిస్తుంది.
ఎవరి పేస్ బుక్ లో చూసినా ఈ పాట గురించే కామెంట్స్ కనిపిస్తున్నాయి.
ఇది ఇప్పుడు universal  హిట్  సాంగ్ గ మారింది. 
మా ఇంట్లో అయితే ఈ సాంగ్ సుప్రభాతం లా రోజు మోగుతూనే ఉంది. 
చూసినా కొద్దీ చూడాలని అనిపిస్తుంది. ఇందులో ధనుష్ గొంతు తో పాటు తను చూపించిన చేష్టలు (facial  expressions ) చాల చాల బాగున్నాయి. 
కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి  మీరు కూడా  ఎంజాయ్ చేసుకోండి, కాదు కాదు పండగ చేసుకోండి.
:) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :


http://www.youtube.com/watch?v=YR12Z8f1Dh8

19 నవం, 2011

@చివరిగా వ్రాసిన అజ్ఞాత గారు :




@చివరిగా వ్రాసిన అజ్ఞాత గారు : 

u said that, "u would fight against andhra governament".

before that u must think of ur local leaders . if they are doing well in ur constistution then ok, otherwise u must start ur fight agaist ur near by leader. 

be practical man... in our assembly we have telangana , andhra and rayalaseema leaders. so our governament is mixture of all three areas. dont say its andhra governamment. 

ఇంకో మాట ... తెలుగు లో ఒక  సామెత ఉంది ...  "మన బంగారం మంచిది కాకపొతే మందిని అంటే ఏమొస్తది" అని అది ఇక్కడ చక్కగా వర్తిస్తుంది. మన తెలంగాణా నాయకులు పేరుకే గాని ఒక్కడు కూడా అభివృద్ధి గురించి ఏనాడూ మాట్లాడరు.  మన అవసరాల గురించి ఎప్పుడైనా  పట్టించుకున్తున్నర..?  నేను ఓకే  ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.. (  ఇక్కడ ఆంధ్ర , రాయలసీమ నాయకుల గురించి మాట్లాడ దలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఆ ప్రాంతాలకి వెళ్ళలేదు, నాకు అక్కడి నిజామైన పరిస్తితుల గురించి స్వంత అవగాహన లేదు . ఏదో పేపర్ లల్లోచదవడమే, T.V. లల్లో చూడటమే  తప్ప.)

                           మనకి పండుగలు వస్తే బస్సుల లలో, ట్రైన్స్ లల్లో రద్దీ విపరీతం గా ఉంటుంది . అసలు ఆ సమయాలల్లో ట్రైన్ ఎక్కితే కనీసం నిల్చొని వెళ్ళడానికి కూడా చోటు ఉండదు. ఇక స్టూడెంట్స్ అయితే ఫుడ్ బోర్డింగ్ లోనే ఉండి పోతారు. ఇవన్నీ నేను కట్టు కథలుగా  చెప్పట్లేదు. మీరు పండగ సమయం లో భాగ్యనగర్ ఎక్ష్ప్రెస్స్ గాని, లేదా తెలంగాణా ఎక్ష్ప్రెస్స్ గాని ఎక్కి చూడండి మీకే  తెలుస్తుంది. మరి అదే సమయలో మనం పేపర్లలో చూస్తుంటాం... గుంటూరు కి ఇన్ని ప్రత్యెక రైళ్ళు , విజయవాడ కి ఇన్ని ప్రత్యెక రైళ్ళు, రాజమండ్రి కి ఇన్ని ప్రత్యెక రైళ్ళు, విశాఖ పట్టణానినకి ఇన్ని ప్రత్యెక రైళ్ళు వేయబడ్డాయి అని కనిపిస్తుంది. అన్ని రైళ్ళ తో పాటు గా  ఏదో మచ్చుకు ఒకటో రెండో మన తెలంగాణా ప్రాంతానికి కూడా వేస్తారు. కాని ఇక్కడ  కుడా అంతే అవసరం ఉందీ, అందరూ పండుగలకి ఇంటికి వెళ్తారు ఎక్కువ రైళ్ళు అవసరం అవుతాయేమో అని ఆలోచించరు. ఇవన్నీ ఎవరు చేయాలి? మన తెలంగాణా నాయకులు చేయాలి, వాళ్ళు మన అవసరలాకి తగినన్ని వసతులు ఏర్పాటు అయ్యేలా చూడాలి, కాని ఏ ఒక్క తెలంగాణా నాయకుడైన పండగ సమయం లో వీటి గురించి మాట్లడుతాడ??? లేదు ఎవ్వరు మాట్లడరు . అప్పుడు మనం ఏమనుకుంటాం.. "అబ్బ వేరే ప్రాంతాల కి ఎన్ని కొత్త ట్రైన్స్ వేసారు మనకేమో ఒక్కటే "...అని ఇలా ఆలోచిస్తాం కాని మన ఇంటి నాయకులే సరిగ్గా లేరు వాళ్ళే కరెక్ట్ గా ఉంటె మనకి కూడా కొన్ని ఎక్కువ ట్రైన్స్ వచేవి అని మాత్రం అనుకోము. ఈ విధం గా ఏర్పడిన భేద భావన ని నేడు మన నాయకులు ఆసరాగా తీసుకొని మన మనస్తత్వాలతో ఆటాడు తున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఏర్పాటు వాదం  అంటారు,  అక్కడ ఆంధ్ర వాళ్ళు సమైఖ్య వాదం అంటారు .

వీళ్ళ ఇద్దరి వాదనల్లోను వాళ్ళ వాళ్ళ స్వార్థమే ఉంది గాని, మామూలు మధ్య తరగతి వ్యక్తీ కి ఒరిగే మంచి ఏ మాత్రం లేదు. ఇప్పుడు తెలంగాణా వచ్చినా గద్దేనేక్కేది ఇదే నాయకులు, రాకపోయినా ఉండేది ఇదే నాయకులు. కాబట్టి ఈ నాయకుల కుటిల బుద్ది మారే వరకు కలిసి ఉన్నా, విడి పోయిన మాములు కుటుంబానికి కలిగే మంచి అయితే ఏమత్రం లేదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 

17 నవం, 2011

గాలి కి ఎంత ఆశ ! అది ఆశ కాదు దురాశ!

గాలి కి ఎంత ఆశ ! అది ఆశ కాదు దురాశ! రోజు కో కొత్త కేసు, రోజు లో కొన్ని వందల కోట్లు స్వాహా అంటున్న గాలి  వార్తలు "గాలి జనార్ధన రెడ్డి " గారి వార్తలు వింటుంటే ఒంట్లో రక్తం ఉడికి పోతుంది. ఒక మనిషి రోజు కి ఎంత తింటాడు? కడుపులో పట్టినంత అన్నమే కదా మనిషి తినగలడు. ఈ పుట తిన్నాక ఇంకొంచెం అన్నాన్ని మరో పూట కోసం దాచుకుంటాడు. అందులో తప్పు లేదు. ఒక మాములు ఉద్యోగి తను సంపాదించినా దాంట్లో  నుండి కొంచెం తన జీవితం గడపటానికి దాచుకుంటాడు. ఇంకా కొంచెం పెద్ద ఉద్యోగి లేదా ఒక వ్యాపారి అయితే తన పిల్లల భవిష్యత్తు  కోసం కొంచెం కూడ పెడతాడు. దానిలోనూ తప్పు లేదు. ఇలా ఒక వ్యక్తి కోసమో  లేదా కుటుంబాని కోసమో సరిపడేంత దాచుకుంటే అది సహజం.  దాన్ని ఎవరు తప్పు పట్టరు. కాని ఇప్పుడున్న కుటుంబానికే కాదు, తన వంశం మొత్తానికి ఇంకా తర్వాత పుట్టే వంశం వారికీ, వారికీ పుట్టే తరాల వారికీ ఇలా ... లెక్కలు వేసుకుంటే పొతే దాన్ని ఏమనాలి? తప్పు అనాలా వద్దా? అది తప్పు కాదు, మహా పాపం, అక్రమం, అన్యాయం,దోపిడీ , దురాశ. ఇలా తెలుగు లో నీచ బుద్ది కి ఎన్ని పర్యాయ పదాలుంటే అన్ని ఆ వ్యక్తి కి వర్తిస్తాయి. ఇది ఈనాటి మన రాజకీయ నాయకుల కథ. తను తినడమే కాదు , తన తర తరాల వారు కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి పాస్తులను సంపాదించుకుంటున్నారు. ఈ కథ కేవలం గాలి ఒక్కడి ది కాదు, ఇక్కడ జగన్ అన్న, అక్కడ మాయావతి , పక్కన A. రాజ ఇలా  ఎ ఒక్క పార్టీ కో, లేక ఎ ఒక్క రాష్ట్రానికో కాదు, మన భారత  దేశం మొత్తం ఒకటే సినిమా. దోచుకో ,దోచుకో, దోచుకో....( ఇంకా ఇలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు మచుకు పెద్ద చాపలు ఇవి అనుకోండి. )
ఇలా పుట్టని తరాల వారికోసం కూడా ఇప్పుడే దోచుకొని దాచుకుంటే మరి ఇప్పుడు బతుకుతున్న మనిషి గతి ఏమవ్వాలి? దోచుకోవడానికి , దాచుకోవడానికి కాదు, కనీసం ఒక పూట కడుపు నింపు కోవడానికి కూడా అన్నం దొరకక విల విల లాడుతున్నాడు. పంటలు లేక రైతులు అల్లాడి పోతున్నారు. విపరీతమైన ధరల తో సాధారణ వ్యక్తి కుమిలి పోతున్నాడు. ఆసుపత్రి ఖర్చులు భరించలేక రోగులు నానా అవస్తలు పడుతున్నారు. మన చుట్టూ ఉన్న ఇంత మంది నరక యాతనలు అనుభవిస్తూ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఎలా  ఎంత పడితే అంత  దోచుకు తినగలుగుతున్నారు ?  పక్కనున్న వ్యక్తీ పడే అవస్తలు వాళ్ళ కంటి కి కూడా కనపడటం లేదు. పైగా వాళ్ళ వ్రుత్తి  సమాజ  సేవ (రాజకీయ రంగం). వాళ్ళకి తిన్న తిండి ఎలా అరుగుతుందో ఏమో? ఇన్ని ఘోర పాపాలు చేస్తుంటే కంటి నిండా నిద్ర ఎలా పో గాలుతున్నారో ఏమో?
ఇలాంటి వాళ్ళని ఎవరు శిక్షిస్తారు?
       ఇప్పటికి మన దేశం లో చాల చోట్ల పక్క వీధి లో ఎవరైనా చని పొతే ఆ ఇంట్లో వాళ్ళు బాధల్లో ఉన్నారు, మనం మాత్రం వండుకొని తింటే ఎలా అని , వాళ్ళు కూడా ఆ రోజంతా తినకుండా పక్కింటి వారితో కలిసి దుఖాన్ని పంచుకుంటారు. అంతటి గొప్ప సంస్కృతి మనది. అలాంటి చోట పుట్టిన ఈ రాజకీయనాయకులకి ఈ దుర్భుద్ది ఎప్పుడు వీడుతుందో  ఏమో !!!!




ఈ కోదండ రామ్ ని ఏమనాలి?

ఈ కోదండ రామ్ ని ఏమనాలి? ఈయనకి నిజంగ తెలంగాణా రావాలని ఉందా అని ఒక చిన్న అనుమానం వేస్తుంది. ఎప్పుడు చుసిన ఏదో ఒక కొత్త పేరు తో బంద్ కి పిలుపు నిస్తాడు. ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తాడు. ఆయన ఇంట్లో చిన్న పిల్లలు బడికి వెళ్ళే వయస్సు వారు లేరు కవోచు. ఉంటె తెలిసేది స్కూలు సమయం ఎంత గా వృధా అవుతుందో అని; ఆయనకి ఎదిగిన పిల్లలు (నిరుద్యోగులు గాని, కాలేజి చదువులు చదువుతున్న పిల్లలు) లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది ఇంత వరకి కష్ట పడి చదివి  ఈ స్థాయికి చేరిన కొడుకో, కూతురి దో జీవితం ఇలా బందల కారణం గా ఆటంకాలకి గురవుతుందీ అని;  ఆయనకి నెల నెల జీతం సరిగ్గా వస్తుంది కావచు, అల నెల నెల జీతం  సరిగ్గా రాకపోతే ఇల్లు గడవడం ఎంత కష్టమవుతుందో అని, ఆయనకీ ఇంట్లో బి.పి, షుగర్ ఉన్న పెద్ద వాళ్ళు లేరు కావచు, ఉంటె తెలిసేది  నిరంతర బంద వల్ల ఇంట్లో కనీసం కరెంటు లేక ఫ్యాన్ తిరుగక , గాలి కుడా  ఆడక పొతే మనిషికి ఎంత కష్టం గా ఉంటుందో నని; ఆయన ఇంట్లో ప్రభుత్వ ఆఫీసులతో అయ్యే పనులు లేవు కావొచ్చు, ఉంటె తెలిసేది నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు ముసి ఉంటె ఆ అవసరం ఉన్న వారికి ఎంత ఇబ్బంది అవుతుందో  అని;  ఆయనకి ఇంట్లో గర్భిని స్త్రీలు లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది అసలు సమయం లో ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ రవాణా (ఇటు బస్సులు, రైళ్ళు; అటు ఆటోలు ....) సదుపాయం కూడా లేకపోతె ఆ తండ్రి పడే ఆవేదన అర్థమయి ఉండేది.
ఇవన్ని కష్టాలు మన రాజకీయ ఐ.క.స. చైర్మన్ గారైన శ్రీ కోదండ రామ్ గారికి లేవు కావొచ్చు ఉంటె తెలిసేది అసలు బంద్ అనే చిన్న పదం వలన ఎంత పెద్ద ప్రమాద సృష్తి కి మూల పురుషుడు అవుతున్నాడు అని. కేవలం ఈ మహానుభావుడు ఒక్కడే కాదు, మన హరీష్ రావ్ గారు, కే.సి.ర గారు ఇంకా ఇలా బంద్ అనే పేరు ఎత్తుతున్న ప్రతి మహా మహారతులందరూ ఎప్పుడు ఈ బంద్ అనే అపదని ఆపేస్తారో అని అనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణా లోనే కాదు ఆంద్ర, రాయలసీమ , యావత్ భారత్ దేశం మొత్తానికి ఈ బంద్ అనే విపత్తు నుండి విముక్తి కావాలి. 
  నేను పైన వ్రాసిన ఉదాహరణలు కేవలం ఊహత్మకమ్ కాదు , మొన్న జరిగిన సకల జనుల సమ్మె వల్ల నా  చుట్టూ పక్కల ఉన్న వారు పడ్డ ఆవేదనలు. ఆ సమ్మె వలన మరి మన సమ్మె కి నాంది  పలికిన వీరులు ఏమంత ఘన విజయం సాధించారో ఏమో మరి. ఈ రోజేమో ఆయన గారు మనం మహానేత అయినటువంటి ఉత్తర ప్రదేశ్  ముఖ్య మంత్రి గారి బాటలో నడవాలని హితువు పలుకుతున్నాడు, అసలు ఈయనకి మాయావతి ఎంతటి గొప్ప చరిత్ర కలిగిన నేతనో తెలియదు కావొచ్చు. ఒక్కసారి ఒక నెల రోజుల కోసం కుటుంబం తో కలిసి  ఉత్తర ప్రదేశ కి వెళ్లి ఒక ఇల్లు అద్దె కి తీసుకొని ఉంటె తెలుస్తుంది, ఆమె గారి పరిపాలన ఎంతటి ఘనం గా సాగుతుందో అని; ఊరికే ఎవరిని పడితే వారిని ఉదాహరణ గా తీసుకుంటే ఇక అంటే సంగతులు. చిప్ప చేత పట్టుకొని రోడ్డునేక్కల్సిందే.  ఈ విషయాలన్నీ మన మహా మహా కుటిల రాజకేయ నాయకులకి ఎన్నడు అవగత మవుతాయో ఏమో?????

12 అక్టో, 2011

ప్రకృతి ఎంత అందమయినది

మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో అందం గా ఉంటుంది.
ఆ అందాలను వర్ణించాలంటే కేవలం కవులు, రచయితలూ వంటి గోప్పవల్లకే సాధ్యమవుతుంది.
నా లాంటి సాధారణ వ్యక్తీ కి అంతగా రాకపోయినా మనసులో కదిలే భావాలను మాటల్లో మాత్రం చెప్పగలను.
మనం ఎలాంటి మూడ్ లో ఉన్న కాని ఒక్కసారి జల జలా పారే నీళ్ళకి దగ్గర గా కుర్చున్నామంటే చాలు, మన మనస్సు లో మనకే తెలియని ప్రశాంతత చేరిపోతుంది. ఆ ప్రవాహ చప్పుడు వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అది సూర్యోదయ వేల లేదా సూర్యాస్తమయ వేల అయ్యి ఉంటె ఆ సమయలో ఉండే ఆకాశ అందాలని తనివి తీర చూడవచ్చు. అదే సమయం లో చల్లగా వీచే గాలి కూడా జత అయితే మన శరీరానికి కూడా కాస్త హాయి గా ఉండటం మొదలవుతుంది. చల్లని గాలుల మధ్యన చుట్టూ పచ్చదనము తో నిండిన ప్రాంతం లో అల జల జల పారుతున్న నీళ్ళ కి ఒడ్డున కూర్చొని ఆకాశాన్ని చుస్తే చాలు, ప్రకృతి మధురిమలు మన స్వరాల్లోకి చేరి పోతాయి. ఆ సమయం లో మన తో  పాటు ఎవరు లేకున్నా కూడా మనకి ఒంటరితనం ఏర్పడదు. ఒకవేళ మన తో పాటుగా మనకి బాగా నచ్చే వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని మరేవరయిన గాని కూడా అక్కడే ఉంటె ఇంకెంత బావుంటుందో చెప్పలేము. ఒకవేళ చిన్న పిల్లలు, అప్పుడే అడుగులో అడుగులు  వేస్తున్న పసి పాపలు అక్కడ మన తో నే ఉండి ఉంటె... ఆహ..! ఇంకెంత బావుంటుందో కదా! వారికీ వచ్చీ, రానీ మాటల తో సరదాగా నవ్విస్తు ఉంటె  మనసుకి చాల సంతోషం గా ఉంటుంది. అందుకే కావచ్చు విహార కేంద్రాలు ఎక్కువ గా  నీటి కి దగ్గరగా అంటే, నదులకి , సముద్రపు బీచ్ ల కి దగ్గరగా ఉంటాయి. కాని ఇప్పటికే ఇలాంటి అందాలూ రోజు రోజు కి కరువవుతున్నాయి, ఇక రేపటి మన తర్వాత వచ్చే వారికి ఈ అందాలూ కేవలం ఫోటో లకే పరిమితమవుతయేమో అని ఒక్కోసారి భయమవుతుంది. ఏది ఏమయినా ప్రకృతి మాత్రం ఎప్పటికీ అద్భుతమే !  





9 సెప్టెం, 2011

ఈ రోజు ఎంత ప్రొద్దున్నేలేచానో...

చాల రోజుల నుండి అనుకుంటున్నా నా కల నెరవేరింది.
పొద్దున్నే లేచాను, వాకింగ్ కి వెళ్ళాను, అక్కడే కొంచం సేపు exercise కూడా చేశాను.
అక్కడి పచ్చని వాతావరణం లో , పెద్ద పెద్ద చెట్ల మధ్యన నడుస్తుంటే.. ఆహా...
ఎంత హాయిగా, ప్రశాంతం గా ఉందో మాటల్లో చెప్పలేను.
చల్లని గాలి అలా తాకుతూ ఉంది.
నాటో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ ముందే ఉన్నారు. 
వాళ్ళందరినీ చుస్తే నాకు మరింత ఉత్సాహం గా అనిపించింది.
అలా మెల్ల మెల్ల గ నడుస్తూ ఉంటె... " ఇన్ని రోజులు గా ఇంత చక్కటి వాతావరణాన్ని
 ఎలా మిస్  చేసుకున్నానా అని మనసులో ఒక చిన్న బాధ కూడా  కలిగింది.
మొత్తానికి ఏది ఏమైనా , నేను ఈ రోజు న మార్నింగ్ వాక్ వల్ల ఒక రకమైన అనుభూతి ని
పొందగలిగాను.
ఇప్పుడనిపిస్తుంది..." ప్రొద్దున లేచే అలవాటు, కేవలం శరీరానికే కాదు, మనసుకి కూడా ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుందని."
అందుకే కావచ్చు  ఇలా ఉదయమే లేచే అలవాటు ఉన్న వాళ్ళు రోజంతా బాగుంటదని అంటుంటారు.
ఈరోజు మొదలైన ఈ మంచి పని (నాకైతే చాల గొప్ప పని ) ని నేను ఇలాగె కంటిన్యూ చేయగలగాలి.
అంతేనా కాదా !


26 ఆగ, 2011

రవాణా శాఖ కి రాబోతున్న మంచి ఘడియలు

మన దేశం లో ప్రవేశ పెట్ట బోతున్న కామన్ మొబిలిటీ కార్డు కాన్సెప్ట్ అభినందనీయము.
ఈ కార్డు వలన దేశం లోని ఏ రాష్రంలోనైనా, ఏ ప్రభుత్వ  రవాణ సాధనన్ని అయినా వినియోగించుకోవచ్చు.  అవినీతి నిర్మూలనకి ఇది తొలి మెట్టు కాబోతునదని నా అభిప్రాయం.
ఈ రకం గా నైన రావణ శాఖ లో ఎదురవుతున్న మోసాలు, అవినీతి ని అరికట్ట వచ్చు.
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలని పరిశీలించినట్లయియితే..
1. తిరుపతి/ తిరుమల ప్రాంతం లో తిరిగే కొన్నిబస్సు సర్వీసులలో పనిచేసే కొంతమందికండక్టర్లు అసలు టికెట్లకి బదులుగా నకిలీ టికెట్లని తయారు చెస్తూ దొరికి పోయారు.
2. మన సౌలభ్యం కోసం రైల్వే  శాఖ ఇ-టికెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కాని ఇ-టికెట్ లను కూడా అచ్చం గా ఒరిజినల్ టికెట్ల మాదిరి కొన్నింటిని తయారు చేసి  దేశ వ్యాప్తముగా దోచుకుంటున్నదొంగల ముఠా ఒకటి ఈ  మధ్య నే వెలుగులోకి వచ్చింది.  
3. ఇక సిటీ బస్సులలో పనిచేసే కొంత మంది కండక్టర్లు చిల్లర లేదనే సాకుతో ప్రయనికులకి గండి కొట్టేస్తున్నారు. మరికొంత మందేమో ఇది వరకే ఇష్యూ చేసిన టికెట్ ని కొన్నిసార్లు ప్రయాణికుల దగ్గరి నుండి తీసుకొని వేరే వాళ్ళకి అదే టికెట్ ని ఇవ్వడం. ఇలాంటి సంఘటనలయితే వారం లో కనీసం  2-3 అయిన చుస్తూనె  ఉన్నాం . ఈ రకమైన దోపిడీలో మగ కండక్టర్ల  కంటే మహిళా కండక్టర్ల చేయివాటమే అధికం గా కనిపించడం నిజంగా అవమానం.
ఇవి కేవలం నాకు గుర్తున్న ఈ మధ్య జరిగిన, జరుగుతున్న సంఘటనలు మాత్రమే. ఇంకా ఇలాంటివి మన దేశం మొత్తం లో ఎన్నిజరుగుతున్నాయో ఎవరికి తెలుసు?  వీటన్నింటి కి చెక్ పెట్టాలంటే కామన్ మొబిలిటీ కార్డు సరియైన విధానం అని నాకు అనిపిస్తుంది. 
ఈ మధ్య సింగపూర్ కి వెళ్ళినపుడు అక్కడ కూడా ఇలాంటి కార్డు ని చూసాను. దాన్ని ez-link
అనే పేరు తో పిలుస్తారు . నేను మొట్ట మొదటి సారిగా అక్కడి మెట్రో ఎక్కినపుడు ఈ విధానానికి చాల సంతోష పడ్డాను. చిల్లర లేక పొతే మన హైదరాబాద్ లోని కండక్టర్లు అనే మాటలు ఒక్కసారి గుర్తొచ్చి నవ్వుకున్నాను కూడా. ఇప్పుడు ఇదే విధానం మన దేశం లో రాబోతోన్దంటే ఇది ఖచితంగా ప్రభుత్వ రవాణా విభాగం లో అవినీతి ని నిర్మూలించడానికి  రాబోతున్నమంచి ఘడియలు అని అనుకోవచ్చు. దీనికి మీరేమంటారు?   

20 ఆగ, 2011

కల్తీ చేయబడుతున్న కుంకుమ

కుంకుమ నుదిటి మీద పెట్టుకోవడం మన  సంప్రదాయం.
కానీ ఈ మధ్య కాలం లో అన్ని వస్తువులను కల్తీ చేయడం ఒక వ్యాపారం గా మారిపోయింది. ఆ కల్తీ వస్తువుల లోకి ఇప్పుడు కుంకుమ ని కుడా చేర్చేసారు.  
కుంకుమ ను పెట్టుకున్నాక కొన్ని గంటల లోపే దురద మొదలవుతుంది.
తర్వాత అది అలర్జీ గ మారుతుంది. కాబట్టి కొనే ముందు ఒకటి కి రెండు సార్లు గమనించి  కొనండి. మంచి కుంకుమ (ఎలాంటి కల్తి లేనిది ) అని గుర్తు పట్టడం ఎలా ?  మీలో ఎవరికైనా సమాధానం తెలిస్తే  ఇక్కడ సూచించంచగలరు.

19 ఆగ, 2011

శ్రీ రామ రాజ్యం పాటలు విన్నారా...?

హలో .... నమస్తే.... నమస్కారం.... ఎలా ఉన్నారు...?

ఏమి చేస్తున్నారు...? అంతా కుశలమేనా..!

ఏంటి ఈ రోజు ప్రతి-ఉదయం లో ఈ సోది ప్రశ్నలు అని అనుకుంటున్నారా..!

ఏమి లేదు లెండి, ఏదో వెరైటీ కోసం ప్రయత్నించాను. మీకు నచితే సంతోషం, నచ్చక పొతే సారీ... నేనేమి చెయ్యలేను. అసలు విషయానికి వస్తే... నేను నిన్న న ఒక ఫ్రెండ్ ని కలిసాను. అప్పుడు మాటల్లో మాట గ ఈ శ్రీ రామ రాజ్యం సినిమా గురించి వచ్చింది. ఈ సినిమాపాటలు విన్నావా అని న ఫ్రెండ్ నాతో అనింది. నేను ఇంకా లేదు అన్నాను. విను చాల బాగున్నాయి అని తన అభిప్రాయం గ చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత పాటలు పెట్టాను. మొదటి పాట విన్నాను. ఏదో కొంచెం కొత్త బాణీ  లో పాడినట్లున్నారు అని అనుకున్నాను. అలాగే వరుసగా అన్ని పాటల్ని కంటిన్యూ చేశాను. మధ్య లో ఈ సినిమా కి ఇంతకీ మ్యూజిక్  అందించిన  మహాను భావులు ఎవరా అని ఒక్కసారి చూసాను.

అంతే.. ఒక్కసారిగా ఖంగు తిన్నాను. ఎందుకంటే ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ది గ్రేట్ గురువు గారు, నా ఫేవరేట్ అయిన ఇలయ రాజా నా అని !

అప్పుడు అనిపించించింది... గురువు గారి బాణీ లో నే తేడా లు మొదలైనట్లున్నాయి  అని.
మనసులో చిన్న అనుమానం కూడా వేసింది ఏంటంటే.. ప్రొడ్యూసర్ అనుకున్నంత డబ్బు ఇవ్వకుండా మోసం చేసదేమో అందుకు గురువు గారు ఈ రకం గా ప్రతీకారం తీసుకున్నరేమో అని. (ఇది నా మనసులో మెదిలిన  ఒక పిచ్చి ఊహమాత్రమే.)

మొత్తానికి ఇలయ రాజా గారు కూడా ఈ తరం సంగీత దర్శకులల్లో ఒకరిగా కలిసి పోయారు.
ప్చ్... చాలా బాధ గా ఉంది  .






17 ఆగ, 2011

అమ్మో వీళ్ళు మన నాయకులేనా? ఎంత మార్పు...!

మన రాజకీయ నాయకులు = ఎప్పుడు గొడవలు సృష్టిద్దామా అని ఎదురు చూసే వాళ్ళు.
మన రాజకీయ నాయకులు = అధికారమే జీవితాంత ఆశయం గా నమ్మే వాళ్ళు.
మనరాజకీయ నాయకులు =అక్రమ సంపాదన ఉంటేనే కడుపు నిండా భోజనం చేయగలరు, కంటి నిండా నిద్రించ గలరు.  
మన రాజకీయ నాయకులు = గ్రామ సర్పంచ్ నుండి పార్లమెంటు మెంబెర్ వరకు అందరికీ ఒకటే నీతి- అందినంత  వరకు దోచుకోవడమే.
మన రాజకీయ నాయకులు =ఎంత పెద్ద కుమ్భకోణం  లో  ఇరికినప్పటికీ  దర్జాగా  బ్రతుకుతూ శిక్ష నుండి తప్పించు కునే వారు.
మన రాజకీయ నాయకులు = కేవలం తామే కాదు, తమ  కొడుకులు,కూతుర్లు  లేదా  ఇతర  కుటుంబ  సభ్యులు  ఎవరైనా  ఎంతటి నేరాలకి పాల్పడినప్పటికీ కుడా  న్యాయస్థానానికి మాత్రం దొరకని వారు. 

మన రాజకీయ నాయకులు ఇలా  చాలానే అర్థాలని  సంతరించుకున్నారు.

                     కాని అందులో "అమ్మో!  వీళ్ళేనా!" అని అనిపించే అర్థం ఒకటి నాకు ఈ రోజే కనిపించింది. ఏంటంటే... వీళ్ళు, మన రాజకీయ నాయకులు అవినీతి కి వ్యతిరేకం గా పోరాడుతున్న మన అత్యుత్తమ దేశ నాయకుడైన శ్రీ అన్న హజారే గారికి మద్దతు తెలపడం.
ఇది నిజమైన వింత, ప్రపంచ లోని అన్ని వింతలలో కేల్ల అతి కొత్త వింత.
అవినీతికి  పరాకాష్ట అని చెప్పుకునే మన రాజ కీయ నాయకులు అవినీతి నిర్ములనకి తోడ్పాటు నందించడం  నమ్మదగిన విశయమేనా?

నాకెందుకో సందేహం గానే ఉంది.

ముందు ముందు ఈ బడా బాబులు ఇంకా ఎన్ని వింతల్ని , విడ్డూరాలని  మనకి చూపించ బోతున్నారో వేచి చూడాల్సిందే మరి!




15 ఆగ, 2011

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


                              



                             
జై హింద్
                                                                     


      


భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు












 
 
 

14 ఆగ, 2011

మన రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు వస్తాయేమో....!

నా కెందుకో మన  రాష్ట్రం  లో  మధ్యంతర ఎలక్షన్స్ వస్తే బావుండు అని అనిపిస్తుంది.
ఈ చాత కాని సి ఎం  ని చూడ లేక పోతున్నా. ఒకప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ అంటే మన
దేశంలోనే కాదు దాదాపు ప్రపంచం అంతటా ఓ మంచి పేరు ఉండేది. ఆ  స్థితికి రావడానికి చాల కాలం  పట్టింది.
బహుశ చంద్రబాబు కుడా తన హయాం లో ఈ పేరు కోసం చాల నే పబ్లిసిటీ చేసాడనుకోండి  . తానూ చేసింది గోరంతే అయినా చెప్పుకుంది కొండంత (అది వేరే విషయం లేండి).
అప్పుడున్న  మన రాష్ట్రాన్ని ఒక మామిడి తోట తో  పోలిస్తే, ఎవరో చెట్లని   నాటి, పెంచి, మరెవరో వాటిని పెద్దచేయాగా ఆ తోట  మంచి పక్వ దశ కి చేరువ అయింది  . ఆసమయం లో తోట ని కాపాడుతున్న తోట మాలి(న్.సి.న్ )  కి పైత్యం పెరిగి (కాలేజీ ఫీజు లు పెంచడం, ప్రభుత్వ ఉద్యోగులతో చెలగాట ఆడటం లాంటివి చేసాడు కదా..) తోటనంత చిందర వందర చేయడం మొదలు పెట్టాడు . దాంతో విసుగు చెందిన యజమాని (ఇక్కడ రాష్ట్ర ప్రజలు) ఆ తోటను వేరే తోట మాలి చేతి లో (వై.ఎస్.ర్) పెట్టాడు...       

అయితే ఇది వరకు ఉన్న తోట మాలి తోటను కొంచం చిందర వందర చేశాడే కాని , పక్వానికి వచ్చిన చెట్లను పాపం ఏమి చేయలేదు. అలా పరి పక్వ దశ లో ఉన్న మామిడి తోట ను తన  చేతి లోకి అందుకున్నతోట మాలి తోలి  దశ లో బాగానే కష్ట పడి ఆ పళ్ళను సరియైన రీతి లో సరియైన విధం గానే యజమానికి అప్పచెప్పాడు.

కాని మనిషికి దుర్భుద్ది అనేది ఒకటి ఉంటుంది  కదా.. అది కాస్త ఆ తోట మాలి ని నిలువునా మింగేసి కాచిన పల్లనన్నీ తనే తినడం, తనవాల్లకే పంచి పెట్టడం మొదలెట్టాడు.
ఇంకేముంది.... పళ్లన్నీ ఖాళీ అయ్యాయి, అంతే  కాకుండా.. చెట్లనీ పట్టిచుకునే నాథుడు లేక  చీడ కూడా మొదలయింది.

చీడ వేరు దశలో ఉన్నప్పుడే తోట మాలి మారిపోయాడు. కాని తర్వాత వచ్చిన తోట మాలి కి ఆ తోట ని బాగు చెసే  శక్తి లేక ఇంకా దీనవస్తకి తీసుకు వచ్చాడు .
అల చూస్తూ చూస్తూ ఉండగానే ఎక్కడి నుండో వచ్చిన దుండగులు ఆ తోట ని ముక్కలు ముక్కలు చేసి పంచుకోవాలని పన్నాగం పన్నారు. పాపం అమాయకుడయిన యజ మాని కి ఆ విషయం అర్థం కాలేదు. ఆ దుండగుల ని నమ్మడం  , వారి మాటలకి విలువనివ్వడం చెస్తూ వచ్చాడు   .
దాంతో ఇప్పుడు తోట కాస్త పంట లేక, విల విల బోతుంది . ఇప్పుడయిన ఆ తోట యజమాని (మన రాష్ట్ర ప్రజలు )మేలుకొని తోట బాగోగులని చూడటానికి ఒక  సరియైన , సమర్థుడైన తోట మాలి ని ఎంచుకుంటే బావుండు అని అనిపిస్తుంది.

అందుకోసం మధ్యంతర  ఎన్నికలు వస్తే బావుండు అని అనిపిస్తుంది.
దీనికి మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారా/ లేక ఈ అభిప్రాయాన్ని తప్పు పడతారా? లేక వేరే ఇతర సమాధానం చూపిస్తారా?


12 ఆగ, 2011

ఈ రోజు ఏమి చేద్దామంటే....

హాయ్ ఫ్రెండ్స్...
       నిన్న అంతా నా ప్రతి-ఉదయం బ్లాగ్ లో చాల వేడి వేడి గ చర్చలు జరిగాయి.
అందరూ మీ అభిప్రాయాలను తెలియ  చేసినందుకు చాల కృతఙ్ఞతలు. ఆ "బంద్"
అనే టాపిక్ ని ప్రస్తుతానికి అల పక్కన పెడుదాం. ఎందుకంటే ఎప్పుడూ  ఒకటే రచ్చ 
 చేయడం నాకు నచ్చదు. అలా అని ఆ టాపిక్ ని అలాగే వదిలి పెట్టను కుడా. మల్లి
 ఒక రోజు దీని గురించి మాట్లాడుకుందాం.
       ఈ రోజు  "వరలక్ష్మి వ్రతం" కదా... ముందుగా మీ అందరికి వరలక్ష్మి వ్రత
శుభాకాంక్షలు. ఈరోజు  అందరం మనసార ఆ జగన్మాతను ప్రార్థిస్తూ హాయిగా ఉందాం.
ఇంట్లో చేసిన రుచి కరమైన వంటలను  తింటూ సరదాగా గడుపుదాం

  
          

11 ఆగ, 2011

ఈ బంద్ ల వాళ్ళ ఏమి సాధిస్తున్నారు?

మన రాష్ట్రం లో 2009 డిసెంబర్ 9 నుండి ప్రతి ఒక్కరికి పరిచయమైనా పదం " బంద్ ".
కెసిఆర్ ఏఉదేశ్యముతో తెలంగాణా అంశాన్ని లేవనేత్తాడో తెలియదు కానీ, ఆ మహానుభావుడి
పుణ్యమా అని దాదాపు గా ప్రతి  నెలలో బంద్ లను చూడాల్సిన దుస్థితి దాపురిచినది.
నాకు ఒక్క  విషయం ఇంత వరకు అర్థం కావడం లేదు... అది ఏంటంటే.. 
      " ఒక సంస్థ లో  పని చేసే వారు వారి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం బంద్ చేస్తారు అది ఓకే. మరి ఇక్కడ మన రాష్ట్రం లో "తెలంగాణా" అనే  ఒక అద్భుతమైన పేరు వాడుకుంటూ ప్రతి నెల బంద్ ప్రకటించడం ఏంటి?"  ఈ బంద్ ఉన్నప్పుడు

1. దుకాణాలన్నీ మూసెయ్యాలని అంటారు.
2. అన్ని విద్య సంస్థలు మూయలంటారు.
3. ఆఫీసు లను మూయలంటారు.
4. ఎలాంటి ప్రభుత్వ  వాహనాలను నడప వద్దంటారు.
5. చివరికి కనీసము కూరగాయల బండ్ల ను కూడా రోడ్డు మీదికి రావద్దంటారు.
అమ్మో ఇంకా చాలా నే అంటారు లే..

కానీ ఇవన్నీ  2009 డిసెంబర్ నుండి విధి గా ప్రతి నెల సాగిస్తున్నారు. ఈ మధ్య అయితే మరీ ప్రతి 10  రోజులకు ఒక బంద్ ఉంటున్నట్టు ఉంది. ఇప్పటి వరకు   చేసిన బంధ ల వాళ్ళ
కెసిఆర్ కైతే చాల పేరు వచ్చింది. ఇతర రాజకీయ నాయకులకి అయితే ఢిల్లీ నుండి హైదరాబాద్ కి ప్రయానాలే  ప్రయాణాలు . ఇలా విమానం ఎక్కుతారు, అలా విమానం లో నుండి దిగుతారు
ఎందుకు వెళ్తున్నారో, ఏమి సాధిస్తున్నారో  వాళ్ళ కే తెలియాలి.
కానీ నేను ఒక్క విషయం మాత్రం మీ అందర్నీ అడగాలనుకుంటున్నా.. ఏంటంటే ప్రతి ఉద్యమం లో విద్యార్థులు పాత్ర ఉండాలి ఉండాలి అంటారు కదా కానీ అసలు ఉద్యమము అంటే ఏంటో కూడా  తెలియని ప్రాథమిక పాటశాల విద్యార్థుల్ని ఎందుకు ఈ ఉబి లో దిన్చుతున్నారో అర్థం కావడం లేదు.
కాలేజీ చదువులు చదువుతున్న వారిని ఎలాగో ఈ ఉబి లోకి దించారు, వారిని నిలువునా  ముంచుతున్నారు. మరి పసి పాపాలు ఏమి తప్పు చేస్సారని వారికీ కూడా బంద్ లని వర్తింప చేస్తున్నారు? 




11 జూన్, 2011

చాల రోజుల తర్వాత సొంత ఊరికి వస్తే ఎలా ఉంటుంది?

చాల రోజుల తర్వాత సొంత ఊరికి వస్తే ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుందో నాకయితే తెలియదు కాని నాకు మాత్రం మా ఇల్లు ని, అమ్మ , నాన్న లని చుస్తే చాల ప్రశాంతం గ అనిపిస్తుంది . మనం ఎంత పెద్ద అందమైన  సిటీలో ఉండి  వచ్చిన కానీ మన సొంత ఇంట్లో ఉండే ఆనందం అది వేరు . హాయిగా వేడి వేడి అన్నం లో కందిపప్పు, నెయ్యి, అప్పుడే పెట్టిన ఆవకాయ పచ్చడి తో అన్నం తింటే ఆ హా ..! ఆ రుచే వేరు...
    వేసవి లో పిల్లలందరూ సెలవులకి ఇంటికి వస్తారు. ఆ పిల్లలతో సరదాగా గడపవచ్చు. సాయంకాలం అయిందంటే చల్ల గాలి కోసం అల సరదాగా బయట తిరగొచ్చు. ఇలా ఏంటో ప్రశాంతం గ మన ఊరిలో మనం దర్జా గ గడపవచ్చు.
     

10 మే, 2011

రిటైర్ అయిన క్రికెటర్ ----- IPL , రిటైర్ అయిన మధ్య తరగతి ఉద్యోగి ?????


  మన దేశం లో  సివిల్ సర్వెంట్స్ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ యొక్క ఏదో ఒక కమిటీ లో చైర్మన్ గానో లేక ఏదో ఒక మెంబెర్ గానో  చేరి పోతారు .

రిటైర్ అయిన సినిమా ఆర్టిస్టు లు గతం లో అయితే రాజ కీయల్లోకి వచ్చే వాళ్ళు. ఇప్పుడు రాజకీయాల తో పాటు రియాల్టీ షౌస్ కూడా వారిని ఉద్దరిన్చడానికి  ముందుకొచ్చాయి .

రిటైర్ అయిన క్రికెటర్లకు డబ్బులు విపరీతమ గా  సంపాదించుకోవడానికి  IPL వచ్చేసింది. ఇలా దాదాపు గొప్ప వాళ్ళని ఉద్దరించడానికి పెద్ద పెద్ద రహదారులే ఉన్నాయి  కాని

రిటైర్ అయిన మధ్య తరగతి ఉద్యోగి కోసం ???????????




             

8 మే, 2011

అయ్యో! నా బ్లాగ్ లో కామెంట్స్ వ్రాసే బాక్స్ ఎగిరిపోయింది . ఎవరైనా చెప్పరా?

అయ్యో! నా బ్లాగ్ లో కామెంట్స్ వ్రాసే బాక్స్ ఎగిరిపోయింది .ఎంత ప్రయత్నించినా నాకు కనపడటం లేదు. దయచేసి ఎవరైనా సమాధానం చెప్పరా...  ప్లీజ్    

కొందరు ఎందుకు ఇలా ఉంటారో.....?????

మన దేశం లో పెళ్లి కి చాలా విలువ ఇస్తారు. అది జీవితం లో జరిగే అతి ముఖ్య మైన ఘట్టం గా మనం భావిస్తాం. ఇది నేను అంటున్న మాట కాదు, తర తరాలు గా ఈ విలువ పెరుగు తూనే ఉంది. పెళ్ళికి దాదాపు గా తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాం . ఏ చిన్న పరిచయం ఉన్నా పెళ్లి పత్రిక పంపిస్తాం.అది కుదరక పొతే నేటి కాలం లో ఇంటర్నెట్, ఫోన్ లను వాడుతున్నాం. కాని మన పెళ్ళికి అందరూ రావాలి అనే ఆరాటం మాత్రం దాదాపు గా అందరిలో ఉంటుంది( ఒక్క పిసినారి కి తప్ప  ). ఇంకా ఆ పెళ్లి లో మన ఫ్రెండ్స్ వస్తే ఉండే ఆనందం వేరే చెప్పానక్కర లేదు. చాలా హాయిగా , మనసుకి ఎంతో సంతోషం గా అనిపిస్తుంది. 
           ఈ కాలం లో globalization వలన అందరూ దూరం దూరం ఉంటున్నారు. ఎంత దగ్గరి ఫ్రండ్ పెళ్లి అయినా ఒక్కోసారి వేరే దేశం లో ఉండటం వల్లనో లేక ఆఫీసు లో పని వల్లనో అటెండ్ అవ్వలేక పోతారు. కాని నేను ఈ మధ్య కొందరిని గమనిస్తున్నాను. వాళ్ళు ఎలా ఉంటారంటే... వాళ్ళ పెళ్ళికి మాత్రం అందరూ రావాలి అని అనుకుంటారు, వాళ్ళ అదృష్టం కొద్దీ అందరూ వస్తారు. ముఖ్యం గా ఫ్రండ్స్ ఖచితం గా వస్తారు (అదేంటో గాని.?). కాని తమ  ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి  మాత్రం వెళ్ళరు. ఎమన్నా అని అడిగితే ప్రతి దానికి ఒక కారణం ముందే చూసి పెట్టుకొని ఉంటారు. మన కి ఉండే ఫ్రెండ్స్ లిస్టు లో కొందరు చాలా కావాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా..! మరి కనీసం అలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ పెల్లిలకి కూడా వెళ్ళరు . ఎంత సేపు నేను, నా ఫ్యామిలీ, నా అవసరాలు అని ఇలా  అనుకుంటూనే ఉంటారు. నాకు కొన్ని సార్లు ఆశ్చర్యం వేస్తుంటుంది... వాళ్ళ గురించి ఫ్రెండ్స్ ఏమని అనుకుంటారో అని కూడా ఆలోచించరా అని ? 

పోనీ డబ్బులు లేక అంటే  అలా కాదు, పోనీ వేరే ఊర్లో పెళ్లి , చాల దూరం ప్రయాణం చేయాలి అంటే అలా కుడా కాదు, ఆఫీసు వర్కింగ్ డే రోజు మ్యారేజ్ ఆ అంటే అదీ కాదు  .
అన్ని ఉంటాయి , హాలిడే ఉంటది కాని వెళ్ళరు .తర్వాత కలిసినప్పుడు ఏదో సాకు చెప్తారు . ఎందుకు ఇలా జనాలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని సంస్కారం లేని విధం గా ప్రవర్తిస్తారో? నాకైతే వాళ్ళు అర్థమే కారు. ఏంటో??????

కాని ఈ గుణం కరెక్ట్ కాదు . మనం ఒక సొసైటీ లో ఉంటున్నామంటే ఆ సొసైటీ కి, ఆ సొసైటీ లో ఉండే కొన్ని అలవాట్ల కైనా మనం గౌరవం  ఇవ్వాలి  . ఎంత సేపు కుటుంబం ఒక్కటే కాదు కదా బ్రతకడానికి ముఖ్యమైనది. 




25 ఏప్రి, 2011

ఈసారి IPL లో ఆరెంజ్ కేప్ ఎవరికీ వస్తుందో...

ఈ సారి ipl  లో ఆరంజ్  కేప్ ఎవరికీ వస్తుందనేది నా ప్రశ్న. IPL మొదలు పెట్టినప్పటి నుండి మన దేశం లో క్రికెట్ పైన చాల మందికి ఉత్సాహం మరింత ఎక్కువయినట్లుంది.

 IPL లో  ఒక కొత్త రకం అవార్డులు సృష్తించబడినవి కదా  . అవే ఆరంజ్ కేప్ మరియు పుర్పుల్ కేప్. టోర్నమెంట్ మొత్తం లో ఎక్కువ రన్స్ చేసిన వారికీ ఆరంజ్  కేప్, ఎక్కువ వికెట్స్ తీసిన వారికి పుర్పుల్ కేప్ ఇవ్వడం జరుగుతుంది కదా.. మరి ఈ సారి ఈ ఆరంజ్  కేప్ చాల గమ్మతుగా ఒకరి నుంచి ఒకరికి కదులు తూ ఉంది . చివరికి ఎవరికీ వస్తుందో అని ఉత్సాహం గా ఉంది. నేనైతే మన మాస్టర్ బ్లాస్టర్ కే వస్తుందనుకుంటున్న. మరి మీరేమంటారు?
 
ఈ సారి ఇప్పటి వరకు ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళని ఒక్కసారి చూద్దాం.
1) సచిన్ టెండూల్కర్  - 269 రన్స్ (M.I)
2) పాల్ వాల్తటి  - 261 రన్స్ (k.XI.P)
3) కల్లిస్  - 233 రన్స్ (KKR)
4) డేవిడ్ వార్నేర్  - 229 రన్స్ (D.D)
5)అంబటి రాయుడు - 201 రన్స్   (M.I) 
ఒక్కసారి 2008 నుండి  ఈ ఆరెంజ్ కేప్ ఎవరెవరిని వరించిందో చూద్దాం... 

2008----->షాన్ మార్ష్ ,616 రన్స్ (K.XI.P) 
2009----->మాత్యు హెడెన్ , (CSK)
2010----->సచిన్ టెండూల్కర్-618 (MI)


20 ఏప్రి, 2011

ఆంజనేయ స్వామి విగ్రహానికి చందనం ఎందుకు పూస్తారు?

మొన్న హనుమాన్ జయంతి జరుపుకున్నాం కదా... మరి మీలో చాల మంది గుడికి వెళ్లి ఉంటారు.అక్కడ ఆంజనేయ స్వామి ని మీ కోరికలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఉంటారు. పూజారి గారు పెట్టిన వడ ప్రసదమో లేక, పులిహోర నో లేక శనగల ప్రసదమో ఇలా ఏదో ఒకటి తినే ఉంటారు. మరీ ఒక్కసారి ఆ స్వామి కి పూసి ఉన్న చందనం చూసారా? ఆ చందనం ఎందుకు పూయబడిందో తెలుసుకున్నారా?
                       ఇదిగో నేను చెప్తున్నా వినండి....  ఎందుకంటే... 
                        సీత దేవి ఆచూకి  కనిపెట్టడానికి హనుమంతుడు లంక కి వెళ్తాడు కదా. అక్కడ సీతమ్మ వారి నుదుట ఉన్న బొట్టు చూసి ఇలా అడుగుతాడు ... "అమ్మ నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావ్" ఇలా అడిగినపుడు ఆ సీతమ్మతల్లి " న రాముడి ఆయుశ్హు పెరగాలని" అని చెప్పినదట. అది విన్న ఆంజనేయ స్వామి శ్రీరామ చంద్ర మూర్తి కోసం తన ఒళ్ళంతా చందనం పూసుకోవడం ఆరంభించినాడట . అందుకని ఆ సంప్రదాయం అలాగే నేటికీ కొనసాగుతూ ఉంది.
                                         జై శ్రీ రామ్ 

ఎవరైనా ఇది తెలియచేయరా..... ప్లీజ్...

నా బ్లాగ్ చదివిన  వాళ్ళు వ్యాఖ్యలు తెలుగు లో రాయాలి అంటే ఎలా అని అడుగుతున్నారు. తెలుగు లోవ్యాఖ్యలు  రాయాలి అంటే  ఎలా? బ్లాగ్గర్స్ అయితే వాళ్ళ బ్లాగ్ న్యూ పేజి లో ముందుగా రాసుకొని కాపీ -పేస్టు చేయొచ్చు. కాని మిగతా వాళ్ళు ఎలా రాయగలరో దయచేసి నాకు ఎవరైనా తెలియ చేయండి.
ప్లీజ్......... 

18 ఏప్రి, 2011

పూణే వారియర్స్ చేసింది చాలా మంచి పని.

పూణే వారియర్స్ మొదలు పెట్టిన "Cheer Queens" పద్ధతి  మెచ్చుకోదగినది. ఇలా చేయడం వలన మన దేశము లోని అన్ని రకాల నృత్య కలలకి ఆదరణ లభిస్తుంది. అంతే కాకుండా మన లోని నూతన కళాకారులకి ఒక విధమైన ప్రోత్సాహము ఇచినట్లు అవుతుంది. ఇవ్వాళా ఉన్న పరిస్థితి లోఒక స్కూల్ పిల్లాడిని ఇలా అడిగితే..." మన దేశం లో ఎన్ని రకాల నృత్య కళలు ఉన్నాయి అని అడిగితే"   జవాబు చెప్పే వాళ్ళు చాల అరుదు. కాని ఒక క్రికెటర్ పేరు చెప్పగానే వాడి పుట్టు పూర్వోత్తరాలు అన్ని గడ గడా చెప్పేస్తారు. మరి అంతటి పోపులరితి ఉన్న వేదిక దొరికినప్పుడు అంది పట్టుకోవడం గొప్పవాళ్ళ లక్షణం . అదే పని పూణే టీం మొదలు పెట్టింది. మిగతా టీం లు కూడా ఇదే పద్ధతి ని పాటిస్తే బాగుంటది. కదా...! మీరు  ఏమంటారు?
కాకపొతే ఒక చిన్న మార్పు ఉంటె బాగుంటదని నేను అనుకుంటున్నా.
ఏంటంటే... మన దేశం లో ఒక్కో ప్రాంతానికి/ రాష్ట్రానికి ఒక్కో ప్రత్యెక నాట్యం ఉంది.  దాన్ని ఆయా టీం వాళ్ళు తీసుకొని ప్రదర్శిస్తే బాగుంటది( అన్ని రాష్ట్రాల నాట్యలని ఒకే టీం ప్రదర్శించకుండా). 

నా ప్రశ్న నేడు దేశమంతటా వెలుగు లోకి వచ్చింది.

నేను ఆ నాడు వేసిన ప్రశ్న కి కార్య రూపం రాబోతుంది. ఏంటో తెలుసా.... మన నోటు మీద కేవలం గాంధీ నే ఎందుకు ఉండాలి అని??? 
ఈ ప్రశ్న కి స్పందించిన వారందరికి నా ప్రత్యెక నమస్కారములు. నేను ఈ రోజే ఒక ఆర్టికల్ చదివాను. అది చదివిన తర్వాత మీతో తప్పకుండ పంచుకోవాలి అని అనుకున్నా . అంతే,వెంటనే మీకు కూడా అది చదివి వినిపించాలనే ఆశ తో  ఇలా ఆ ఆర్టికల్ నిఇక్కడ లింక్ చేస్తున్నాను. మీరు కూడా దానిని  చదవాలని కోరుకుంటున్న.

2 ఫిబ్ర, 2011

మన నోటు మీద గాంధీ నే ఎందుకు ఉండాలి ?

మనకు స్వాతంత్ర్యం వచ్చి 63 సంవత్సరాలు దాటింది. ఈ 63 ఏళ్లలో మన నోటు మీద ఉండే  బొమ్మయొక్క రూపు రేఖలు మారుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా గమనించారా?
లేకపోతె ఇప్పుడు గమనించండి...



చూసారా...! పైన ఉన్నా మార్పు.. అదేనండోయ్.. మన జాతీయ చిహ్నం ఉన్న చోటు కి గాంధీ బొమ్మ వచ్చింది.అలా గాంధీ బొమ్మ చాల కాలం నుండి(1996 నుండి) ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. కాని ఎందుకు ఈ మార్పు రావాల్సి వచ్చింది? అంతటి ఉన్నతమైన స్థానం కేవలం ఆ ఒక్కడికే  ఎందుకు వచ్చింది ?

29 జన, 2011

నా బ్లాగ్ నా పైన అలిగింది

మీకు తెలుసా! నా బ్లాగ్  అదేనండి నా ప్రతి ఉదయం బ్లాగ్ నా పైన అలిగింది. ఎందుకంటే నేను నా బ్లాగ్  ద్వారా నా మీ అందరికీ ప్రతి పండుగకి శుభాకాంక్షలు తెలియజేసాను. కాని మన జాతీయ పండుగ అయినటువంటి  గణతంత్ర దినోత్సవం నాడు మాత్రం  నేను శుభాకాంక్షలు తెలియ చేయలేక పోయాను. అందుకని నా బ్లాగ్ నన్ను కోపం గా చూస్తుంది. కాని నేను ఇది కావాలని చేయలేదు. నాకు కుదరక పోవడం తో అలా జరిగింది.  
మరి ఈ విషయం నా బ్లాగ్ కి చెప్పడం ఎలా?
నాకేమి తోచడం లేదు.
మీకేమైనా ఐడియా వస్తే చెప్పరా..! please.... 

14 జన, 2011

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

అందమైన ముగ్గులతో స్వాగతం పలికే మకర సంక్రాంతి వచ్చేసింది .
ఈ బ్లాగ్ తరఫున మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


7 జన, 2011

అన్న దానమే ఎందుకంత గొప్పది?

"అన్ని దానలల్లో కెల్లా అన్న దానము చాలా గొప్పదని అందరూ అంటారు.మనం వింటూనే ఉన్నాం . కాని ఎందుకు గొప్పదో తెలుసా! తాతయ్య" అని మనవడు తన తాతయ్య ని అడిగాడు.
"ఇదిగో నేను చెప్తున్నా ..... మరి చక్కగా  గా విను" అని అన్నాడు తాతయ్య మనవాడి తో.
                       ఏదయినా వస్తువు ని దానం చేస్తే దానం తీసుకున్న వాడికి ఇంకో వస్తువు కావాలనిపిస్తుంది. డబ్బు ని దానం చేస్తే ఇంకొంచం కావాలి అని అడుగుతారు. విద్య ని దానం చేస్తే మరింత జ్ఞానం కోసం ఆరాట పడుతారు. కాని అదే అన్న దానం చేసినట్లయితే  కడుపు నిండా తినగానే ఇక చాలు అంటాడు. చాలు అన్న పదం కేవలం అన్న దానం లోనే తప్ప మరెక్కడా వినపడదు. చాలు అన్న పదం ఆ వ్యక్తి కి మరియు దానం చేసిన వారికీ ఎంతో సంతృప్తి ని కలుగ చేస్తుంది. అందుకే అన్ని దానాలల్లో కెల్లా అన్న దానం చాలా  గొప్పది. అలా తాతయ్య మనవడి సందేహాన్ని తీర్చాడు .

5 జన, 2011

నా iPhone అలారం తప్పు చేసింది

 మీకు తెలుసా! నిన్న నా iphone అలారం  ముళ్ళు కి జ్వరం  వచ్చింది . దాంతో నీరసం వొచ్చేసి మెల్లి  మెల్లి గా నడిచింది. అంతే.. ఒక గంట వెనక్కి వెళ్లి పోయింది . నేను లేచి చూసుకునే సరికి కరెక్ట్ గా ఒక గంట ఆలస్యమైయింది. పాపం కదా!


నోయిడా (2)

మన Central Bureau Of Investigation(C.B.I)  గురించి అందరికి తెలిసిందే. ఇది మన దేశం లోనే అత్యున్నత మైన investigating police agency. దేశానికి  సంబంధించిన అతి కీలకమైన కేసులను, ముఖ్యం గా దేశ ప్రజలకు ఆర్థిక, సామాజికముగా నష్టం కలుగ చేసే కేసులను తీసుకొని విచారించే విభాగము. అతి కీలకమైన క్రిమినల్ కేసులను కూడా మన ప్రభుత్వం (union government)  C.B.I. కే అప్పగిస్తుంది. ఈ  విభాగము గత 48 సంవత్సరాల నుండి  దేశం లోని ఎన్నో ముఖ్యమైన కేసులను చేదిస్తూ  వస్తుంది.  మరి ఇంతటి  గణనీయమైన అనుభవం కలిగిన C.B.I ఒక మాములు అమ్మాయి హత్య కి సంబంధించిన కేసుకి తగిన సాక్షాధారాలు దొరకక పోవడం విచిత్రం.ఈ మధ్య కాలం లో ఎలాగో  దేశ ద్రోహుల కి సంబంధిన కేసులను  ఒక కొలిక్కి తీసుకు రావట్లేదు. కనీసం  ఒక  సాధారణ అమ్మాయి హత్య ఇంట్లో జరిగింది . అది ఎలా జరిగిందో కూడా తేల్చలేకపోవడం  విడ్డూరం. మరి ఇక ఆ సంస్థ ఉండి ఎందుకు? ఈ కేసు గురించి ఒక మన దేశం లినే కాదు, ఇతర దేశాలల్లో కూడా న్యూస్ పేపర్స్ చాలా దారుణం గా వ్రాస్తున్నాయి. అయిన మన వాళ్ళు మారరు, మనల్ని బాగు పడనీయరు. చిన్న చిన్న కేసులు కూడా సంవత్సరాల కొద్ది తీర్పు కోసం వాయిదా పడుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో? ఇది  వ్రాస్తుంటే నాకు లీడర్  సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది.


"ఒక అమాయకు రాలైనా ఆడపిల్లకు న్యాయం చేయం లేని వ్యవస్థ ఉంటె ఎంత? ఊడితే  ఎంత?"

3 జన, 2011

నోయిడా (1)

అది మే నెల , 2008  . మేము అప్పుడే అంటే అదే నెల 2 వ తేదీన నోయిడా వెళ్ళాము . అప్పుడు మేము ఒక company vaallichina accommodation లో ఉన్నాం. వారం  రోజులయింది. నాకు నోయిడ చాలా  నచ్చింది .ఎందుకంటే నేను అప్పటి వరకు హైదరాబాద్ దాటి వేరే ప్రదేశానికి వెల్ల లేదు. నోయిడా ని చూసే సరికి చాల బాగా నచ్చేసింది .పెద్ద పెద్ద లివింగ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి మధ్య లో నే కమ్యూనిటీ పార్క్స్  ఉన్నాయి. చక్కగా డిజైన్ చేయబడిన రోడ్స్ ఉన్నాయి, అడ్రస్ కోసం ఎక్కువ కష్ట పడాల్సిన అవసరం రాదు. 
అన్ని గల్లిలు అనుసంధానమై ఉంటాయి. అన్ని పేర్లు సెక్టార్ లా తో ఉంటాయి. ఉదా: సెక్టార్ 21, సెక్టార్ 50 ....
  రోడ్డు మీద నడిచే వారి కోసం ప్రత్యెక మైన దార్లు ఉంటాయి. ఎక్కడ కాలుష్యం  (polution)  అనేది కనపడదు . ఎక్కడికి వెళ్ళాలన్న రిక్షా వాళ్ళు ఉంటారు. కేవలం సెక్టార్ నెంబర్ చెప్పి అపార్ట్మెంట్ పేరు చెబితే చాలు చేరిపోతాం.
 ఇవన్ని మన హైదరాబాద్ లో కూడా ఉంటాయి కాని నడిచే రోడ్డు ఎప్పుడు ఖాలీ గా ఉండదు. కొత్త అడ్రస్ వెతుక్కో వాలంటే పడే తంటాలు అంతా- ఇంతా కాదు. ఇలా నేను అన్నిట్లో నోయిడా ని హైదరాబాబ్ద్ తో పోల్చుకుంటూ ఉంటుండే.
        
అల ఉండగా ఒక్కసారి టీవీ లో ఆరుషి హత్య గురించి విన్నాను. చాలా భయమేసింది. అప్పటికి మేము ఇంకా ఇల్లు వెతుక్కోలేదు. 
ఆరుషి హత్య వినగానే అర్థమయింది... నోయిడా చూడటానికే బాగుంటది, కాని ఇక్కడి జనాలు చాల భయంకరులని. అంటే అందరూ అల ఉండక పోయినప్పటికీ .... అక్కడ safety  మాత్రం ఉండదని అక్కడ ఇలాంటి గొడవలు సర్వ సాధారణమని తెలిసి పోయింది . అక్కడ ఉంటె చాలా ధన వంతులుంటారు, లేక పొతే నిరు పెద  వాళ్ళు. మధ్య  తరగతి వాళ్ళు ఉండటం కొంచం తక్కువే.
ఇక ఇంట్లో ఉండే ఇద్దరు( భార్య , భర్త)  దాదాపుగా ఉద్యోగస్తులే ఉంటారు. 
ఇంకేముంది.... ఎప్పుడూ దొంగతనాలు, హత్యలు....ఇవే అక్కడ. ఇంటికీ, మనుషులకీ  ఏమాత్రం safety ఉండదు. ఇంట్లో ఉన్నా , బయటికి వెళ్ళినా తాళం తప్పనిసరి. 
అలా నోయిడా గురించి తెలుసుకున్నాను. అంతలోనే 2 వారాలు గడిచి పోయాయి. మేము ఇల్లు వెతుక్కున్నం. కాని నా మనస్సులో  మాత్రం భయం పేరుకు  పోయింది. కొంచం రాత్రి అయిందంటే చాలు మేము భయటికి వెళ్ళడానికే ఆలోచించే వాళ్ళం.
ఇక మళ్లీ కథ మొదలయింది అదే పోల్చుకోవడం.... మన హైదరాబాద్ లో అయితే ఎంత రాత్రి అయిన హాయిగా తిరగొచ్చు. 
పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో ఉండక పోయిన ప్రశాంతం గా బ్రతకొచ్చు. ఇలా మళ్లీ మొదలయింది. ఇంకే ముంది.... ఎలా గోలా కొన్ని నెలలు ఉండి తిరిగి హైదరాబాద్ కే transfer  చేయించుకున్నాం. 
ఎంతయినా మన హైదరాబాద్ లో ఉన్నంత safety  కాని, ఫ్రీడం కాని, flexibility  కాని ఎక్కడ ఉండదని అర్తమయింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మనది తెలుగు సంస్కృతి. ప్రత్యెక మైన పద్దతి తో , పచ్చని తోరణాల ముంగిళ్ళలో  అందం గా , ఆనందం గా జరుపుకునే పండుగలు ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా మన ప్రతి పండుగ   ఒక విశేష మైన కారణం తో జరుపుకోబడుతుంది.మరి అలాంటపుడు మనకంటూ ప్రత్యెక మైన తెలుగు సంవత్సర ఆరంభ వేడుక అదేనండి మన "ఉగాది" ఉండగా మరి ఈ జనవరి ఒకటిని ఎందుకు మనము జరుపుకోవాలి?


 ఎందుకంటే.. మారుతున్న పరిస్థితుల తో, పరిచయాల తో మనము నడుచుకోవాలి అనేది పెద్దల మాట. అలాగని మన సంప్రదాయాల్ని, మన ఆచారలని, పండుగలని  మనము మర్చి పోకూడదు. ఈ ప్రపంచీకరణ  యుగం  లో ఒక దేశపు, అలవాట్లను మరొకరు స్వీకరించడం పరిపాటి గా మారింది. ఉదాహరణకి మన యోగా , ధ్యానం, ఆయుర్వేదం, వంటి పురాతన పద్ధతులను  విదేశీయులు మన నుండి నేర్చుకొని విధి గా ఆచరిస్తున్నారు. అంతే కాకుండా మన అతి పెద్ద పండుగ అయిన దీపావళి ని ఇతర దేశా లలలో ప్రభుత్వ పండుగ గా ప్రకటించి అమలు పరుసున్నారు. అలా అమలు చేయడం  అక్కడ ఉండే మన వారి కోసమే అయినప్పటికీ మన పండుగను వాళ్ళు జరుపుకోవడం ఆనవాయితీ గా మరి పోయింది. అదే విధం గా మనం కుడా జనవరి ఒకటి ని కొత్త సంవత్సర పండు గా జరుపుకుంటున్నాం  .   మన దగ్గరి  చాలా రంగాలలో  జనవరి ని సంవత్సర ఆరంభం గా, డిసెంబర్ ని చివరి నెల గా పాటిస్తున్నారు.  ఇంట్లో, బయటా , పిల్లలు పెద్దలు అందరూ కూడా జనవరి నుండి,డిసెంబర్ వరకు ఉండే కాలాన్ని ఒక సంవత్సరం గా పరిగనిస్తున్నారు . ఇలా ఏ రకం గా చూసిన కూడా మనకి తెలిసో , తెలియకనో జనవరి నెల మొదటి  నెల గా మారి పోయింది. కాబట్టి మనము కూడా దీన్ని  అంటే జనవరి ఒకటి ని నూతన సంవత్సర తోలి వేడుక గా , ఓ పండుగ గా చూస్తున్నాం మరియు అలా జరుపుకుంటున్నాం కూడా. 


మరి ఈ 2011 సంవత్సరము మనందరికీ మంచి ఆరోగ్య సంవత్సరం గా ఉండాలని, మరియు అన్నింటిలో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుందాం.