చాట్ అంటే ఇష్ట పడని వారు ఉండరు . సాయంత్రం వేల మన హైదరాబాద్ లో ఎ గల్లి లో చుసిన ఒక చాట్ బండి కనిపిస్తున్ది. తినాలి తినాలి అనిపించే ఘుమ ఘుమ వాసనలతో లక్కేల్తారు మనల్ని. తీర వెళ్లి చూసాక అసలు నీట్ గ ఉండదు . అదే చాట్ ని మనం ఇంట్లో చేసుకుంటే .. హాయిగా సరదాగా ఇంట్లో వాళ్ళం అందరం కలిసి తినొఛు. ఈ చాట్ లో ముఖ్యం గా వాడే స్వీట్ చట్నీ ని ఇక్కడ ఎలా చేయాలో చూద్దాం .
కావలసినవి:
1. గింజలు లేని ఖర్జూర పళ్ళు 10
2. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు
3. చింత పండు ఎంత తీసుకుంటే కరెక్ట్ గ అంతే బెల్లం
4. 1 టీ స్పూన్ సోంఫు పొడి
5. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి
6. చిటికెడు సొంటి పొడి
7. 1 టీ స్పూన్ ఎర్రటి కారం
8. 200ml నీళ్ళు
చేసే విధానం :
ముందుగ చింత పండు ని కడిగి నానా పెట్టు కోవాలి .
ఖర్జూర పళ్ళని చిన్న చిన్న ముక్కలు గ కట్ చేసి పెట్టు కోవాలి .
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో చింత పండు ని ఆ నాన పెట్టిన నీళ్ళ తో సహా పోసేసి అందులోనే ఖర్జూర ముక్కల్ని కూడా వేసి ఉడక పెట్టాలి . అవి ఉడకడానికి కొంచెం ఎక్కువ గానే టైం పదుతున్ది. ముత పెట్టడం మరిచి పోవద్దు
ఆ లోపు జీలకర్ర ని , సొంఫు ని వేరు వేరు గ వేయించి చల్లార్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి .
మధ్య మధ్య లో ఉడుకుతున్న వాటిని కలుపుతూ ఉండాలి . అది దాదాపుగా ఉడికి మిశ్రమం కొంచెం చిక్కగా మారుతున్నప్పుడే ఈ జీలకర్ర పొడి ని, సొంఫు పొడి ని ఒకొక్కటి టీ స్ప్పోన్ చొప్పున వేసేయ్యాలి . అందులోనే ఒక స్పూన్ రెడ్ కారం కూడావేయాలి. చిటికెడు సొంటి పొడి ని కూడా వెయ్యాలి . అంతే . ఈ మిశ్రమము మరీ చిక్కగా కాకూడదు, అలా అని మరీ నీళ్ళ లా కూడా ఉండ కూడదు . తేనే లా జారు తు ఉంటె సరి పొతున్ది.ఇది చక్కటి మెరూన్ రంగు లో కనిపిస్తుంది. చూడగానే తినాలి అనిపించేలా ఉంటుది . దీన్ని వడ కట్టి ఒక డబ్బా లోకి తీసుకొని ఫ్రిజె లో నిలువ ఉంచు కోవచ్చు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి