మన రాష్ట్రం లో 2009 డిసెంబర్ 9 నుండి ప్రతి ఒక్కరికి పరిచయమైనా పదం " బంద్ ".
కెసిఆర్ ఏఉదేశ్యముతో తెలంగాణా అంశాన్ని లేవనేత్తాడో తెలియదు కానీ, ఆ మహానుభావుడి
పుణ్యమా అని దాదాపు గా ప్రతి నెలలో బంద్ లను చూడాల్సిన దుస్థితి దాపురిచినది.
నాకు ఒక్క విషయం ఇంత వరకు అర్థం కావడం లేదు... అది ఏంటంటే..
" ఒక సంస్థ లో పని చేసే వారు వారి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం బంద్ చేస్తారు అది ఓకే. మరి ఇక్కడ మన రాష్ట్రం లో "తెలంగాణా" అనే ఒక అద్భుతమైన పేరు వాడుకుంటూ ప్రతి నెల బంద్ ప్రకటించడం ఏంటి?" ఈ బంద్ ఉన్నప్పుడు
1. దుకాణాలన్నీ మూసెయ్యాలని అంటారు.
2. అన్ని విద్య సంస్థలు మూయలంటారు.
3. ఆఫీసు లను మూయలంటారు.
4. ఎలాంటి ప్రభుత్వ వాహనాలను నడప వద్దంటారు.
5. చివరికి కనీసము కూరగాయల బండ్ల ను కూడా రోడ్డు మీదికి రావద్దంటారు.
అమ్మో ఇంకా చాలా నే అంటారు లే..
కానీ ఇవన్నీ 2009 డిసెంబర్ నుండి విధి గా ప్రతి నెల సాగిస్తున్నారు. ఈ మధ్య అయితే మరీ ప్రతి 10 రోజులకు ఒక బంద్ ఉంటున్నట్టు ఉంది. ఇప్పటి వరకు చేసిన బంధ ల వాళ్ళ
కెసిఆర్ కైతే చాల పేరు వచ్చింది. ఇతర రాజకీయ నాయకులకి అయితే ఢిల్లీ నుండి హైదరాబాద్ కి ప్రయానాలే ప్రయాణాలు . ఇలా విమానం ఎక్కుతారు, అలా విమానం లో నుండి దిగుతారు
ఎందుకు వెళ్తున్నారో, ఏమి సాధిస్తున్నారో వాళ్ళ కే తెలియాలి.
కానీ నేను ఒక్క విషయం మాత్రం మీ అందర్నీ అడగాలనుకుంటున్నా.. ఏంటంటే ప్రతి ఉద్యమం లో విద్యార్థులు పాత్ర ఉండాలి ఉండాలి అంటారు కదా కానీ అసలు ఉద్యమము అంటే ఏంటో కూడా తెలియని ప్రాథమిక పాటశాల విద్యార్థుల్ని ఎందుకు ఈ ఉబి లో దిన్చుతున్నారో అర్థం కావడం లేదు.
కాలేజీ చదువులు చదువుతున్న వారిని ఎలాగో ఈ ఉబి లోకి దించారు, వారిని నిలువునా ముంచుతున్నారు. మరి పసి పాపాలు ఏమి తప్పు చేస్సారని వారికీ కూడా బంద్ లని వర్తింప చేస్తున్నారు?