11 ఆగ, 2011

ఈ బంద్ ల వాళ్ళ ఏమి సాధిస్తున్నారు?

మన రాష్ట్రం లో 2009 డిసెంబర్ 9 నుండి ప్రతి ఒక్కరికి పరిచయమైనా పదం " బంద్ ".
కెసిఆర్ ఏఉదేశ్యముతో తెలంగాణా అంశాన్ని లేవనేత్తాడో తెలియదు కానీ, ఆ మహానుభావుడి
పుణ్యమా అని దాదాపు గా ప్రతి  నెలలో బంద్ లను చూడాల్సిన దుస్థితి దాపురిచినది.
నాకు ఒక్క  విషయం ఇంత వరకు అర్థం కావడం లేదు... అది ఏంటంటే.. 
      " ఒక సంస్థ లో  పని చేసే వారు వారి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం బంద్ చేస్తారు అది ఓకే. మరి ఇక్కడ మన రాష్ట్రం లో "తెలంగాణా" అనే  ఒక అద్భుతమైన పేరు వాడుకుంటూ ప్రతి నెల బంద్ ప్రకటించడం ఏంటి?"  ఈ బంద్ ఉన్నప్పుడు

1. దుకాణాలన్నీ మూసెయ్యాలని అంటారు.
2. అన్ని విద్య సంస్థలు మూయలంటారు.
3. ఆఫీసు లను మూయలంటారు.
4. ఎలాంటి ప్రభుత్వ  వాహనాలను నడప వద్దంటారు.
5. చివరికి కనీసము కూరగాయల బండ్ల ను కూడా రోడ్డు మీదికి రావద్దంటారు.
అమ్మో ఇంకా చాలా నే అంటారు లే..

కానీ ఇవన్నీ  2009 డిసెంబర్ నుండి విధి గా ప్రతి నెల సాగిస్తున్నారు. ఈ మధ్య అయితే మరీ ప్రతి 10  రోజులకు ఒక బంద్ ఉంటున్నట్టు ఉంది. ఇప్పటి వరకు   చేసిన బంధ ల వాళ్ళ
కెసిఆర్ కైతే చాల పేరు వచ్చింది. ఇతర రాజకీయ నాయకులకి అయితే ఢిల్లీ నుండి హైదరాబాద్ కి ప్రయానాలే  ప్రయాణాలు . ఇలా విమానం ఎక్కుతారు, అలా విమానం లో నుండి దిగుతారు
ఎందుకు వెళ్తున్నారో, ఏమి సాధిస్తున్నారో  వాళ్ళ కే తెలియాలి.
కానీ నేను ఒక్క విషయం మాత్రం మీ అందర్నీ అడగాలనుకుంటున్నా.. ఏంటంటే ప్రతి ఉద్యమం లో విద్యార్థులు పాత్ర ఉండాలి ఉండాలి అంటారు కదా కానీ అసలు ఉద్యమము అంటే ఏంటో కూడా  తెలియని ప్రాథమిక పాటశాల విద్యార్థుల్ని ఎందుకు ఈ ఉబి లో దిన్చుతున్నారో అర్థం కావడం లేదు.
కాలేజీ చదువులు చదువుతున్న వారిని ఎలాగో ఈ ఉబి లోకి దించారు, వారిని నిలువునా  ముంచుతున్నారు. మరి పసి పాపాలు ఏమి తప్పు చేస్సారని వారికీ కూడా బంద్ లని వర్తింప చేస్తున్నారు? 




15 కామెంట్‌లు:

  1. అన్నయ ఈ రాజకీయనాయకులకు సిగ్గు శరం లేదు, తిన్నది అరగక ఏమి చేయాలో తెలియక , సామాన్య జనలా జీవితాలతో ఆటలు అడుతునారు , ఈ బంద్ ల వళ్ళ నేను ఎంత నస్తాపోయనో , ఫ్యామలీ లో ఒకరిబగోలేక హోం కి వెళ్ళటానికి బయటకు వెళ్ళితే బంద్ రెండు రోజులు హోం కి వెళ్ళలేక ఈక్కడ ఉండ్డలేక ఎంత నరకం చూశానో ఆ దేవునికి తెలుసు నేను నల్గొండ నుచి కానీ ఈ నాకోడుకులను బట్టలు ఈప్పి రోడ్స్ మేధా డాన్స్ చేపించాలి , తప్పులు రాసి ఉంటే క్షమించు అన్నయ

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణా సాధించినా మనల్ని సాధిస్తున్నారుగా అది చాలదూ :-D

    రిప్లయితొలగించండి
  3. ఇలా రాజకీయ పార్టీలు బందుల్నిర్వహించడం తద్వారా ప్రజల్నిక్కట్ల పాలుజెయ్యడం ప్రజాస్వామికమా? బందు సంపూర్ణంగా విజవంతమయ్యింది అంటే ఏమిటి? అదసలు సాధ్యమా? బందులకు వ్యతిరేకంగా చట్టాలెందుకు లేవు వున్న అవి ఎందుకు ఆచరించబడటంలేదు?

    రిప్లయితొలగించండి
  4. ఇలాగె జరిగితే నిజం గా తెలంగాణ వస్తుంది. ఇప్పటికే ఉద్యోగాల కోసం బెంగళూర్, చెన్నై వెడుతున్నారు. విద్యార్ధులు కర్ణాటక లో , తమిళనాడు లో చేర్చుతున్నారు తల్లి దండ్రులు.

    ఇప్పటికే రియల్ , సాఫ్ట్ వేర్ డౌన్ అయ్యాయి.
    పండగ రోజుల్లో బంద్ చాలా ఇబ్బంది కరం

    సకల జలుల సమ్మె .... ?

    రిప్లయితొలగించండి
  5. మీ అభిప్రాయాలను తెలియ చేసినదుకు గాను ముందుగా "తెలుగు పాటలు" గారికి, "Indian minerva" గారికి , మరియు "అజ్ఞాత " గారికి నా కృతఙ్ఞతలు.

    అజ్ఞాత గారికి నా మరో ప్రశ్న.... ఏంటంటే...

    మీరు బంద్ లు జరిపితేనే తెలంగాణా వస్తుందంటార? ఉద్యాగాల కోసం వేరే ప్రాంతమే కాదు వేరే దేశాల కే వెళ్తున్నారు కదా.. అయినా ఈ వలస విధానం ఇప్పుడేమి మనకు కొత్త కాదు కదా.. ఒక రాష్టాన్ని విడగొడితే ఉద్యోగాలు పుట్టుకోస్తాయా?? ఉద్యోగం అనేది ఒక వ్యక్తి తన ప్రతిభ కనపరిచి తెచ్చుకునేది. అంతే గాని విడగొడితే ఉద్యోగం కొత్తగా ఎక్కడి నుండి వచ్చేస్తది? నేను ఇలా అంటున్నా నని నన్ను ఆంధ్ర ప్రాంత వాసి నని పొరపడ వద్దు. నేను పక్కా తెలంగాణా నివాసి ని.

    రిప్లయితొలగించండి
  6. ఇప్పటికే రియల్ , సాఫ్ట్ వేర్ డౌన్ అయ్యాయి.
    పండగ రోజుల్లో బంద్ చాలా ఇబ్బంది కరం.

    I never know that these two things can be categorized as achievements. Seems like we have got more ppl in blogs who gotta be promoted to be politicians.

    రిప్లయితొలగించండి
  7. Are you opposed to *all* bandhs for *any* reason? If yes, please note that your criticism applies equally to "samaikyavadis". For example, the "samaikya JAC" has called for a bandh today (August 11) protesting against the decision to delete 14F.

    I am OK with people supporting or opposing Telangana. Please do avoid hypocrisy (e.g. criticizing Telangana bandhs but silent when అసమదీయులు do the same)

    రిప్లయితొలగించండి
  8. hello jai...
    my article describes about "bandh". i just criticised whoever does this stuppid task.im support for neither telangana nor samaikyandhra.
    i raised my point that, do people achieve their final goal by irritating a common man?

    రిప్లయితొలగించండి
  9. @Jai gaaru : I agree with ప్రతి-ఉదయం gaaru. Both the parties are wrecking havoc in the commoners' life with their bands. Both are equally rascallous and equally punishable.

    రిప్లయితొలగించండి
  10. @ప్రతి-ఉదయం:

    Thanks for the clarification. I will look forward to the same spirit when others call for bandhs.

    I believe bandhs are a part of democracy. Gandhi & co. also did bandhs.

    రిప్లయితొలగించండి
  11. YEE BANDULA SAMAYAMLO YE PAKKANUNDI YEVADU RAALLESI NAASANAM CHESTHAARONANI BHAYAPADI ANDARU ANNI MUSUKUNI KURCHUNTE ADI 'SWACHCHANDA BANDH' ANI ATU MEDIA, YITU NAAYAKULU PICHCHI VAAGUDU VAAGADAM YEE PARAMPARAKU KOSAMERUPU. GD ARTICLE.

    రిప్లయితొలగించండి
  12. This post is a comment made on bandhs, by closing eyes. Most of the common men are participating in Telangana bandh on their own spirit. What is bandh? The people who are dieing for Telangana, are only common men .. not political leaders. People who are not ready to accept the democratic right of Telangana people, are posing as if, they only know about democracy.

    రిప్లయితొలగించండి