17 నవం, 2011

ఈ కోదండ రామ్ ని ఏమనాలి?

ఈ కోదండ రామ్ ని ఏమనాలి? ఈయనకి నిజంగ తెలంగాణా రావాలని ఉందా అని ఒక చిన్న అనుమానం వేస్తుంది. ఎప్పుడు చుసిన ఏదో ఒక కొత్త పేరు తో బంద్ కి పిలుపు నిస్తాడు. ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తాడు. ఆయన ఇంట్లో చిన్న పిల్లలు బడికి వెళ్ళే వయస్సు వారు లేరు కవోచు. ఉంటె తెలిసేది స్కూలు సమయం ఎంత గా వృధా అవుతుందో అని; ఆయనకి ఎదిగిన పిల్లలు (నిరుద్యోగులు గాని, కాలేజి చదువులు చదువుతున్న పిల్లలు) లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది ఇంత వరకి కష్ట పడి చదివి  ఈ స్థాయికి చేరిన కొడుకో, కూతురి దో జీవితం ఇలా బందల కారణం గా ఆటంకాలకి గురవుతుందీ అని;  ఆయనకి నెల నెల జీతం సరిగ్గా వస్తుంది కావచు, అల నెల నెల జీతం  సరిగ్గా రాకపోతే ఇల్లు గడవడం ఎంత కష్టమవుతుందో అని, ఆయనకీ ఇంట్లో బి.పి, షుగర్ ఉన్న పెద్ద వాళ్ళు లేరు కావచు, ఉంటె తెలిసేది  నిరంతర బంద వల్ల ఇంట్లో కనీసం కరెంటు లేక ఫ్యాన్ తిరుగక , గాలి కుడా  ఆడక పొతే మనిషికి ఎంత కష్టం గా ఉంటుందో నని; ఆయన ఇంట్లో ప్రభుత్వ ఆఫీసులతో అయ్యే పనులు లేవు కావొచ్చు, ఉంటె తెలిసేది నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు ముసి ఉంటె ఆ అవసరం ఉన్న వారికి ఎంత ఇబ్బంది అవుతుందో  అని;  ఆయనకి ఇంట్లో గర్భిని స్త్రీలు లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది అసలు సమయం లో ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ రవాణా (ఇటు బస్సులు, రైళ్ళు; అటు ఆటోలు ....) సదుపాయం కూడా లేకపోతె ఆ తండ్రి పడే ఆవేదన అర్థమయి ఉండేది.
ఇవన్ని కష్టాలు మన రాజకీయ ఐ.క.స. చైర్మన్ గారైన శ్రీ కోదండ రామ్ గారికి లేవు కావొచ్చు ఉంటె తెలిసేది అసలు బంద్ అనే చిన్న పదం వలన ఎంత పెద్ద ప్రమాద సృష్తి కి మూల పురుషుడు అవుతున్నాడు అని. కేవలం ఈ మహానుభావుడు ఒక్కడే కాదు, మన హరీష్ రావ్ గారు, కే.సి.ర గారు ఇంకా ఇలా బంద్ అనే పేరు ఎత్తుతున్న ప్రతి మహా మహారతులందరూ ఎప్పుడు ఈ బంద్ అనే అపదని ఆపేస్తారో అని అనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణా లోనే కాదు ఆంద్ర, రాయలసీమ , యావత్ భారత్ దేశం మొత్తానికి ఈ బంద్ అనే విపత్తు నుండి విముక్తి కావాలి. 
  నేను పైన వ్రాసిన ఉదాహరణలు కేవలం ఊహత్మకమ్ కాదు , మొన్న జరిగిన సకల జనుల సమ్మె వల్ల నా  చుట్టూ పక్కల ఉన్న వారు పడ్డ ఆవేదనలు. ఆ సమ్మె వలన మరి మన సమ్మె కి నాంది  పలికిన వీరులు ఏమంత ఘన విజయం సాధించారో ఏమో మరి. ఈ రోజేమో ఆయన గారు మనం మహానేత అయినటువంటి ఉత్తర ప్రదేశ్  ముఖ్య మంత్రి గారి బాటలో నడవాలని హితువు పలుకుతున్నాడు, అసలు ఈయనకి మాయావతి ఎంతటి గొప్ప చరిత్ర కలిగిన నేతనో తెలియదు కావొచ్చు. ఒక్కసారి ఒక నెల రోజుల కోసం కుటుంబం తో కలిసి  ఉత్తర ప్రదేశ కి వెళ్లి ఒక ఇల్లు అద్దె కి తీసుకొని ఉంటె తెలుస్తుంది, ఆమె గారి పరిపాలన ఎంతటి ఘనం గా సాగుతుందో అని; ఊరికే ఎవరిని పడితే వారిని ఉదాహరణ గా తీసుకుంటే ఇక అంటే సంగతులు. చిప్ప చేత పట్టుకొని రోడ్డునేక్కల్సిందే.  ఈ విషయాలన్నీ మన మహా మహా కుటిల రాజకేయ నాయకులకి ఎన్నడు అవగత మవుతాయో ఏమో?????