21 డిసెం, 2010

సచిన్! సచిన్! సచిన్! సచిన్ టెండుల్కర్!......

కొందరి గురుంచి మాట్లాడటం మొదలు పెట్టగానే అబ్బ! ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అని విసుగు పుడుతుంది.
అదే మరి కొందరి గురించి మాట్లాడటం మొదలు పెట్ట బోతుంటేనే...చెవులకి ఎంతో హాయిగా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. ఆ కోవకు చెందిన వారే మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.
                            ఎన్ని  రికార్డులు సృష్టించినా , ఎన్ని పతకాలు సాధించినా ఏమాత్రం గర్వపడకుండా, ఎంతో ఒదిగి ఉండే  మనస్తత్వం కేవలం సచిన్ కే సాధ్యం కావచ్చు. అంతర్జాతీయ వన్డే లలలో 46 శతకాలు సాధించి, 17,514 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచినే అని చెప్పుకోవడాన్ని  ప్రతి భారతీయుడు ఇష్టపడుతాడు  . అంతే కాకుండా 1990లో ప్రారంభించిన తన టెస్ట్ శతకాల ప్రవాహం నేటికీ  ఝాలా ఝాలా అంటూ   ప్రవహిస్తూ, అర్థ శతక శతకాలతో  మన దేశ గొప్పతనాన్ని రోజు రోజు కి పెంచుతూనే ఉంది. అతను ఎన్ని రికార్డులు బ్రేఅక్ చేసినా  కూడా అతని ముఖము లో  మాత్రం  గర్వమనే ఛాయలు మచ్చుకైనా కనపడవు. అదే స్వరం, అదే అభిమానం, అదే దేశ భక్తీ ఆనాటి నుండి నేటి వరకు ఆ ముఖం లో కొట్టచ్చినట్లు  కనిపిస్తుంది. ఆ రోజు జరిగే మ్యాచ్ లో సచిన్ ఉండటం వలన మొత్తం ఆ మ్యాచ్ కే ఆదరణ బాగా పెరిగి పోతుందని విదేశీయులే చెప్పుకోవటం చూస్తుంటే మన సచిన్ ఎక్కడున్నాడో అర్థమవుతుంది.అంతటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా  తక్కువే అవుతుతుంది. ఒక్క మాటలో చెప్పాలి  అంటే.. 
"ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే వాఖ్యానికి పరిపూర్ణమైన నిర్వచనం సచిన్ టెండుల్కర్ అని మనం సగర్వం గా చెప్పవచ్చు .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి