19 డిసెం, 2010

మన గురించి ఒక టాక్సీ డ్రైవర్ ఏమన్నాడంటే .....

మన గురించి , మన ట్రాఫ్ఫిక్ సమస్యల గురించి మన దేశం లోనే కాకుండా విదేశాలలో కూడా ఏవిధంగా అనుకుంటున్నారో చెప్పటానికి ఇదో మంచి ఉదాహరణ.
                     నేను ఒక సారి నా ఫ్రెండ్ తో కలిసి మన hyd లో ఉన్నా imbliban బస్సు స్టాప్ కి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక వారం క్రితమే అమెరికా నుండి సెలవుల కోసం ఇండియా కి వచ్హాడు. మేమిద్దరం కలిసి వేరే ఊరికి వెళ్ళడం కోసం imbliban కి వెళ్ళాము.
అప్పుడు మన R. T. C Bus  ల నుండి వినిపించే ఆ భయంకరమైన శబ్దంలను విని తను ఒకటే మాటన్నాడు. ఏమిటంటే..."అరేయ్! నేను ఒక సంవత్సరం లో వినే sound మొత్తాన్ని ఏ ఒక 10 నిమిషాలలో వింటున్నాను రా"
ఆ మాట విన గానే నాకు ఏదో లా అనిపించింది. అంటే మనము ఎంత ఎక్కువగా శబ్ద కాలుష్యాన్ని కలుగ చేస్తున్నామో అని చాల బాధ అనిపించింది. 
            నేను గత వారమ సింగపూర్ కి వేల్లిన్నప్పుడు అక్కడ టాక్సీ ఎక్కాము. ఆ టాక్సీ డ్రైవర్ మమ్మల్ని చూసి indians అని గుర్తు పట్టాడు. అతను మమ్మల్ని  మాట్లాడిస్తూ... మధ్య లో తన గురించి చెప్పాడు ఇలా...." నేను దాదాపుగా  ప్రతి సంవత్సరం నా ఫ్యామిలీ తో సెలవులకి ఇండియా కి వెళ్తుంటాను. దక్షిణ భారత దేశమంతా తిరిగాము. ఇక ఉత్తరాన కాశ్మీర్ , హరిద్వార్, వారణాసి వంటి famous ప్రదేశాలను చూసాము. కానీ మాకు అక్కడ నచ్చనిదంటే... విపరీతమైన ట్రాఫ్ఫిక్ సమస్యలు, తట్టుకోలేనంతగా వినిపించే వాహనాల శబ్దాలు ... "అని అన్నాడు.  మేము ఇక్కడ మా దేశం లో చాల అరుదు గా, అది కూడా తప్పని సరి అని మాకు తోచితే నే మొగిస్తాము.  అతను అలా మాట్లాడగానే నాకు చాల బాధ అనిపించింది. అన్నిట్లో మంచి పేరు ఉన్నా మనము ఇలాంటి  సమస్యల్లో ఎందుకు ఇరుక్కొని  పేరు పోగుట్టుకున్తున్నమా!  
అని.........
                        మనము కోరోకునేదేమిటంటే... అతను మళ్లీ మన దేశాన్ని సందర్శిన్నప్పుడు ఈ విధమైన సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలని...
                             
                      
                     మన గురించి ఒక టాక్సీ డ్రైవర్ ఏమన్నాడంటే  ..... 





1 కామెంట్‌: