2 ఫిబ్ర, 2011

మన నోటు మీద గాంధీ నే ఎందుకు ఉండాలి ?

మనకు స్వాతంత్ర్యం వచ్చి 63 సంవత్సరాలు దాటింది. ఈ 63 ఏళ్లలో మన నోటు మీద ఉండే  బొమ్మయొక్క రూపు రేఖలు మారుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా గమనించారా?
లేకపోతె ఇప్పుడు గమనించండి...



చూసారా...! పైన ఉన్నా మార్పు.. అదేనండోయ్.. మన జాతీయ చిహ్నం ఉన్న చోటు కి గాంధీ బొమ్మ వచ్చింది.అలా గాంధీ బొమ్మ చాల కాలం నుండి(1996 నుండి) ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. కాని ఎందుకు ఈ మార్పు రావాల్సి వచ్చింది? అంతటి ఉన్నతమైన స్థానం కేవలం ఆ ఒక్కడికే  ఎందుకు వచ్చింది ?
 
మనకు స్వాతంత్ర్యం తీసుకు రావడానికి గాంధీ ఒక్కడే కృషి చేయలేదు కదా...! అయన తో పాటు గా ఎందరో వీరులు, అంతకంటే గొప్ప నాయకులూ అన్ని వదులుకొని పోరాటం చేసారు.మరి అలాంటప్పుడు కేవలం గాంధీ బొమ్మ కే ఎందుకు నోటు మీద ఉండే హక్కు లభించింది.
నా ఈ శీర్షిక చదివే వాళ్ళలో చాల మంది ఉపాధ్యాయులు, చరిత్ర ని క్షున్నం గా చదివిన వాల్లూ , ఆర్ధిక శాస్త్ర కోవిదులు,మరియు ఏదైనా కొత్త అంశం గురించి శోధించాలి  అన్న తపన ఉన్నా వాళ్ళు  ఇలా అన్ని కోణాల నుండి వచ్చిన వాళ్ళు  ఉండే ఉంటారు. మీ అందరిని నా బ్లాగ్ తరఫున ఇలా ప్రశ్నిస్తున్న..." మన నోటు మీద గాంధీ బొమ్మ నే ఎందుకు ఉండాలి? ఇలా ఎంత కాలం ఉండాలి?"
మీలో  ఎవరికైనా సమాధానం తెలిసిన, లేదా ఏదైనా ఒక  ఆలోచన తట్టిన, లేదా మీ  మనసులో ఈ అంశం గురించి ఒక చిన్న ఉహ వచ్చిన రాయడానికి ఏమాత్రం సంకోచించ వద్దు.

7 కామెంట్‌లు:

  1. సరే. మంచి ప్రశ్న.
    ఈపాలికి గాందీని వదిలేయండి .

    నేనైతే కల్మాడి, రాజా, చవాన్, జగన్ బొమ్మలను ప్రతిపాదిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  2. మీరడిగిన ప్రశ్న బాగానే ఉంది కానీ ఆ నోటు మీదకి ఎక్కడానికి ఈ 63 ఏళ్ళల్లో ఒక్కరైనా కృషి చేసారా? ఒక్కరంటే ఒక్కరు ఉన్నారా అలాంటి వ్యక్తులు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నపుడు మళ్ళీ పోస్టు ఎందుకు శుద్ధ దండగ!!

    రిప్లయితొలగించండి
  3. నిహారిక గారికి నమస్కారములు. మీరన్నట్టు నోటు మీద ఎక్కడానికి గాంధీ తో సరితూగే మహానుభావులెవ్వరూ మన దేశ చరిత్ర లోనే లేరా? ఒక్కసారి ఆలోచించండి. కేవలం గాంధీ గారి వల్లనే దేశము బాగుపడినదనుకుంటున్నారా ..?

    రిప్లయితొలగించండి
  4. మీ బ్లాగు నేనివ్వాళ్ళే చూశానేమో కానీ మీ ప్రశ్న వల్ల కొన్ని పాత పోస్టులు చూశాను.ఎందువల్లనోగాని మీలో ఓ తేటదనం ఉందేమోననిపిస్తోంది. అందుకని ఇలాంటి ప్రశ్న అసలు మీకెందుకు వచ్చింది?

    ఏమైనాగానీ మీకు గాంధీ నచ్చుతాడు అనిపిస్తోంది.ఈనాటికి అలా లేకపోతే ఆయన గురించి తెలుసుకుంటూ ఉండండి. నోటు మీద ఉన్నా లేకున్నా నష్టంలేదు. దాని అసలు పర్పస్ ఆయన్ని మీకు గుర్తచెయ్యడమే. ఆయన్ని గుర్తుచేసుకుంటూ పోతే మిగితా అందరూ గుర్తుకొస్తారు కూడా.

    రిప్లయితొలగించండి
  5. గాంధి గారి గుండన్త నున్నగా మనలని గోరిగే వాళ్ళు ఎవ్వరులేకనే.సగం దేశాన్ని విడగొట్టి మనలకి నున్నగా గుండు చేశారు.దీనికి కృతజ్ఞతగా మన గుండుకోత్తే కాన్గీయులు అయన బొమ్మనే ఉంచేశారు మరి.

    రిప్లయితొలగించండి
  6. బాబూ! ఈ ప్రశ్న నాకు గాంధీజీ యే ఆదర్శం అని లోకానికి చాటిచెప్పిన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన "ఒబామా" ని అడుగు. దక్షిణాఫ్రికా నాయకుల్ని అడుగు. ఇంగ్లండు మ్యూజియాల్ని అడుగు.
    ఇక రెండో ప్రశ్న"గాంధీ గారు ఒక్కరే స్వాతంత్రం తెచ్చారా?" అని.
    మరి షాజహాన్ ఒక్కడే తాజ్ మహల్ కట్టాడా?
    కొంతమంది దృష్టిలో గాంధీగారు చెడ్డ మనిషి, అది మన దేశ దౌర్భాగ్యం...వాళ్ళ సంస్కారం... కాని చాలా మంది గుండెల్లో ఇప్పటికీ హిమాలయ పర్వతమంత ఎత్తైన మహా మనిషి మన గాంధీ.

    రిప్లయితొలగించండి
  7. http://anvvapparao.blogspot.com/2009/12/blog-post_23.html

    రిప్లయితొలగించండి