17 నవం, 2011

గాలి కి ఎంత ఆశ ! అది ఆశ కాదు దురాశ!

గాలి కి ఎంత ఆశ ! అది ఆశ కాదు దురాశ! రోజు కో కొత్త కేసు, రోజు లో కొన్ని వందల కోట్లు స్వాహా అంటున్న గాలి  వార్తలు "గాలి జనార్ధన రెడ్డి " గారి వార్తలు వింటుంటే ఒంట్లో రక్తం ఉడికి పోతుంది. ఒక మనిషి రోజు కి ఎంత తింటాడు? కడుపులో పట్టినంత అన్నమే కదా మనిషి తినగలడు. ఈ పుట తిన్నాక ఇంకొంచెం అన్నాన్ని మరో పూట కోసం దాచుకుంటాడు. అందులో తప్పు లేదు. ఒక మాములు ఉద్యోగి తను సంపాదించినా దాంట్లో  నుండి కొంచెం తన జీవితం గడపటానికి దాచుకుంటాడు. ఇంకా కొంచెం పెద్ద ఉద్యోగి లేదా ఒక వ్యాపారి అయితే తన పిల్లల భవిష్యత్తు  కోసం కొంచెం కూడ పెడతాడు. దానిలోనూ తప్పు లేదు. ఇలా ఒక వ్యక్తి కోసమో  లేదా కుటుంబాని కోసమో సరిపడేంత దాచుకుంటే అది సహజం.  దాన్ని ఎవరు తప్పు పట్టరు. కాని ఇప్పుడున్న కుటుంబానికే కాదు, తన వంశం మొత్తానికి ఇంకా తర్వాత పుట్టే వంశం వారికీ, వారికీ పుట్టే తరాల వారికీ ఇలా ... లెక్కలు వేసుకుంటే పొతే దాన్ని ఏమనాలి? తప్పు అనాలా వద్దా? అది తప్పు కాదు, మహా పాపం, అక్రమం, అన్యాయం,దోపిడీ , దురాశ. ఇలా తెలుగు లో నీచ బుద్ది కి ఎన్ని పర్యాయ పదాలుంటే అన్ని ఆ వ్యక్తి కి వర్తిస్తాయి. ఇది ఈనాటి మన రాజకీయ నాయకుల కథ. తను తినడమే కాదు , తన తర తరాల వారు కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి పాస్తులను సంపాదించుకుంటున్నారు. ఈ కథ కేవలం గాలి ఒక్కడి ది కాదు, ఇక్కడ జగన్ అన్న, అక్కడ మాయావతి , పక్కన A. రాజ ఇలా  ఎ ఒక్క పార్టీ కో, లేక ఎ ఒక్క రాష్ట్రానికో కాదు, మన భారత  దేశం మొత్తం ఒకటే సినిమా. దోచుకో ,దోచుకో, దోచుకో....( ఇంకా ఇలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు మచుకు పెద్ద చాపలు ఇవి అనుకోండి. )
ఇలా పుట్టని తరాల వారికోసం కూడా ఇప్పుడే దోచుకొని దాచుకుంటే మరి ఇప్పుడు బతుకుతున్న మనిషి గతి ఏమవ్వాలి? దోచుకోవడానికి , దాచుకోవడానికి కాదు, కనీసం ఒక పూట కడుపు నింపు కోవడానికి కూడా అన్నం దొరకక విల విల లాడుతున్నాడు. పంటలు లేక రైతులు అల్లాడి పోతున్నారు. విపరీతమైన ధరల తో సాధారణ వ్యక్తి కుమిలి పోతున్నాడు. ఆసుపత్రి ఖర్చులు భరించలేక రోగులు నానా అవస్తలు పడుతున్నారు. మన చుట్టూ ఉన్న ఇంత మంది నరక యాతనలు అనుభవిస్తూ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఎలా  ఎంత పడితే అంత  దోచుకు తినగలుగుతున్నారు ?  పక్కనున్న వ్యక్తీ పడే అవస్తలు వాళ్ళ కంటి కి కూడా కనపడటం లేదు. పైగా వాళ్ళ వ్రుత్తి  సమాజ  సేవ (రాజకీయ రంగం). వాళ్ళకి తిన్న తిండి ఎలా అరుగుతుందో ఏమో? ఇన్ని ఘోర పాపాలు చేస్తుంటే కంటి నిండా నిద్ర ఎలా పో గాలుతున్నారో ఏమో?
ఇలాంటి వాళ్ళని ఎవరు శిక్షిస్తారు?
       ఇప్పటికి మన దేశం లో చాల చోట్ల పక్క వీధి లో ఎవరైనా చని పొతే ఆ ఇంట్లో వాళ్ళు బాధల్లో ఉన్నారు, మనం మాత్రం వండుకొని తింటే ఎలా అని , వాళ్ళు కూడా ఆ రోజంతా తినకుండా పక్కింటి వారితో కలిసి దుఖాన్ని పంచుకుంటారు. అంతటి గొప్ప సంస్కృతి మనది. అలాంటి చోట పుట్టిన ఈ రాజకీయనాయకులకి ఈ దుర్భుద్ది ఎప్పుడు వీడుతుందో  ఏమో !!!!




3 కామెంట్‌లు:

  1. గాలి వార్తలు అచ్చు వేసె పత్రికలు చెసిన దోపిడి గురుంచి కూడా ఆలొచించండి

    రిప్లయితొలగించండి
  2. బాగా రాశారు. వారి అన్యాయాన్ని మీ ఆవేదననీ కళ్ళకి కట్టినట్టు చూపించారు. మనకీ మన కుటుంబానికీ ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకొని మిగిలినది పక్కవారికి వెచ్చించగలిగితే ఈ ప్రపంచంలో బాధలు అసలు ఉండవేమో.

    రిప్లయితొలగించండి