ఒక్కోసారి మన మీద మనకే చాల కోపం వస్తుంది
ఆ కోపం మరీ ఎక్కువయితే అసహ్యం గా కూడా మారి పోతుంది.ఇంకే ముంది మనసులోనే గడగడ తిట్టుకోవడం, చేసే ఎ పని మీద అయిన ధ్యాస ఉండక పోవడం చివరికి అన్నిట్లో చిరాకు పడటం ఇలా ... జరుగుతూ ఉంటాయి కొన్ని సార్లు.
అసలు ఈ కథ అంత ఎప్పుడు మొదలవుతుందంటే ...
* ఒకరనుకుంటారు.. రేపు పొద్దున్నే లేవాలి అని...
$ మరొకరేమో.... రేపటి నుండి సీరియస్ గా చదవడం స్టార్ట్ చేయాలి అని..
% ఇంకొకరేమో నేను కొంచెం కోపాన్ని తగ్గించు కోవాలి; ఈ మధ్య అందరి మీదికి బస్సు మని లేస్తున్నాను అని..
ఇలా ఎవరికి కావాల్సిన టార్గెట్ ని వారు ఎంచుకొని పెట్టుకుంటారు. ఇక ఆచరణ లోకి తెద్దాం అనుకోని ఓ తెగ రెడీ అయిపోతారు.
* గారు మరుసటి రోజు ల్పోద్దున్నే లెవరు, మొదలు పెట్టలనుకున్న్న వాకింగ్/జాగింగ్/ఎక్షెర్కిసె చేయరు, అల ఒకటి , రెండు, రోజులు గడిచి పోతాయి; ఇక మూడో రోజు ఏదో లేచి అలా కొంచెం స్టార్ట్ చేస్తారు. మల్లీ కథ మొదటికే.. ఏదో అడపా దడపా చేసి చేయనట్టు సాగిపోతుంది. ఇలాగె బద్ధకం గా చేయాలనుకున్న పనులు పెట్టుకున్న టార్గెట్ లోపల పూర్తీ కావు.
దానితో రిజల్ట్స్ ఉండవు. పని ఒత్తిడి ఎక్కువ అయిపోతుంటది. ఇక కోపం ,చిరాకు అన్నీ స్టార్ట్ అయ్యి మన మీద మనకే అసహ్యం వ్వేసుకునే లా తయారవుతాము. ఇది ఎ ఒకరికో ,ఇద్దరికో కాదు. దాదాపుగామన వాళ్ళ లోనే ఎక్కువగా చూస్తాము. ఎవరో నూటి లో ఒక్కరు అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూరి చేసి చూపిస్తారు.
నాలెడ్జ్ విషయం లో ఇద్దరు సమానం గా ఉన్నప్పటికీ రిజల్ట్స్ ఎందుకు సమానం గా ఉండవు???
ఎందుకంటే మనసు మీద పట్టు (control) ఉన్న వ్యక్తీ సక్సెస్ ని చూస్తాడు, అది లేని వాడు తన మీద తనకే అసహ్యం వేసుకునేలా తయారవుతాడు.
కేవలం ఒక్క విషయం లో (మనసు మీద) ఆధిపత్యం సాధిస్తే ఇక తిరుగే ఉండదు. ప్రతీ విషయం లో టార్గెట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే; కాని అవి ఆచరణ లోకి వచ్చినప్పుడే వాటికి జీవం పడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి