మన Central Bureau Of Investigation(C.B.I) గురించి అందరికి తెలిసిందే. ఇది మన దేశం లోనే అత్యున్నత మైన investigating police agency. దేశానికి సంబంధించిన అతి కీలకమైన కేసులను, ముఖ్యం గా దేశ ప్రజలకు ఆర్థిక, సామాజికముగా నష్టం కలుగ చేసే కేసులను తీసుకొని విచారించే విభాగము. అతి కీలకమైన క్రిమినల్ కేసులను కూడా మన ప్రభుత్వం (union government) C.B.I. కే అప్పగిస్తుంది. ఈ విభాగము గత 48 సంవత్సరాల నుండి దేశం లోని ఎన్నో ముఖ్యమైన కేసులను చేదిస్తూ వస్తుంది. మరి ఇంతటి గణనీయమైన అనుభవం కలిగిన C.B.I ఒక మాములు అమ్మాయి హత్య కి సంబంధించిన కేసుకి తగిన సాక్షాధారాలు దొరకక పోవడం విచిత్రం.ఈ మధ్య కాలం లో ఎలాగో దేశ ద్రోహుల కి సంబంధిన కేసులను ఒక కొలిక్కి తీసుకు రావట్లేదు. కనీసం ఒక సాధారణ అమ్మాయి హత్య ఇంట్లో జరిగింది . అది ఎలా జరిగిందో కూడా తేల్చలేకపోవడం విడ్డూరం. మరి ఇక ఆ సంస్థ ఉండి ఎందుకు? ఈ కేసు గురించి ఒక మన దేశం లినే కాదు, ఇతర దేశాలల్లో కూడా న్యూస్ పేపర్స్ చాలా దారుణం గా వ్రాస్తున్నాయి. అయిన మన వాళ్ళు మారరు, మనల్ని బాగు పడనీయరు. చిన్న చిన్న కేసులు కూడా సంవత్సరాల కొద్ది తీర్పు కోసం వాయిదా పడుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో? ఇది వ్రాస్తుంటే నాకు లీడర్ సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది.
"ఒక అమాయకు రాలైనా ఆడపిల్లకు న్యాయం చేయం లేని వ్యవస్థ ఉంటె ఎంత? ఊడితే ఎంత?"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి