మనది తెలుగు సంస్కృతి. ప్రత్యెక మైన పద్దతి తో , పచ్చని తోరణాల ముంగిళ్ళలో అందం గా , ఆనందం గా జరుపుకునే పండుగలు ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా మన ప్రతి పండుగ ఒక విశేష మైన కారణం తో జరుపుకోబడుతుంది.మరి అలాంటపుడు మనకంటూ ప్రత్యెక మైన తెలుగు సంవత్సర ఆరంభ వేడుక అదేనండి మన "ఉగాది" ఉండగా మరి ఈ జనవరి ఒకటిని ఎందుకు మనము జరుపుకోవాలి?
ఎందుకంటే.. మారుతున్న పరిస్థితుల తో, పరిచయాల తో మనము నడుచుకోవాలి అనేది పెద్దల మాట. అలాగని మన సంప్రదాయాల్ని, మన ఆచారలని, పండుగలని మనము మర్చి పోకూడదు. ఈ ప్రపంచీకరణ యుగం లో ఒక దేశపు, అలవాట్లను మరొకరు స్వీకరించడం పరిపాటి గా మారింది. ఉదాహరణకి మన యోగా , ధ్యానం, ఆయుర్వేదం, వంటి పురాతన పద్ధతులను విదేశీయులు మన నుండి నేర్చుకొని విధి గా ఆచరిస్తున్నారు. అంతే కాకుండా మన అతి పెద్ద పండుగ అయిన దీపావళి ని ఇతర దేశా లలలో ప్రభుత్వ పండుగ గా ప్రకటించి అమలు పరుసున్నారు. అలా అమలు చేయడం అక్కడ ఉండే మన వారి కోసమే అయినప్పటికీ మన పండుగను వాళ్ళు జరుపుకోవడం ఆనవాయితీ గా మరి పోయింది. అదే విధం గా మనం కుడా జనవరి ఒకటి ని కొత్త సంవత్సర పండు గా జరుపుకుంటున్నాం . మన దగ్గరి చాలా రంగాలలో జనవరి ని సంవత్సర ఆరంభం గా, డిసెంబర్ ని చివరి నెల గా పాటిస్తున్నారు. ఇంట్లో, బయటా , పిల్లలు పెద్దలు అందరూ కూడా జనవరి నుండి,డిసెంబర్ వరకు ఉండే కాలాన్ని ఒక సంవత్సరం గా పరిగనిస్తున్నారు . ఇలా ఏ రకం గా చూసిన కూడా మనకి తెలిసో , తెలియకనో జనవరి నెల మొదటి నెల గా మారి పోయింది. కాబట్టి మనము కూడా దీన్ని అంటే జనవరి ఒకటి ని నూతన సంవత్సర తోలి వేడుక గా , ఓ పండుగ గా చూస్తున్నాం మరియు అలా జరుపుకుంటున్నాం కూడా.
మరి ఈ 2011 సంవత్సరము మనందరికీ మంచి ఆరోగ్య సంవత్సరం గా ఉండాలని, మరియు అన్నింటిలో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి