మొన్న హనుమాన్ జయంతి జరుపుకున్నాం కదా... మరి మీలో చాల మంది గుడికి వెళ్లి ఉంటారు.అక్కడ ఆంజనేయ స్వామి ని మీ కోరికలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఉంటారు. పూజారి గారు పెట్టిన వడ ప్రసదమో లేక, పులిహోర నో లేక శనగల ప్రసదమో ఇలా ఏదో ఒకటి తినే ఉంటారు. మరీ ఒక్కసారి ఆ స్వామి కి పూసి ఉన్న చందనం చూసారా? ఆ చందనం ఎందుకు పూయబడిందో తెలుసుకున్నారా?
ఇదిగో నేను చెప్తున్నా వినండి.... ఎందుకంటే...
సీత దేవి ఆచూకి కనిపెట్టడానికి హనుమంతుడు లంక కి వెళ్తాడు కదా. అక్కడ సీతమ్మ వారి నుదుట ఉన్న బొట్టు చూసి ఇలా అడుగుతాడు ... "అమ్మ నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావ్" ఇలా అడిగినపుడు ఆ సీతమ్మతల్లి " న రాముడి ఆయుశ్హు పెరగాలని" అని చెప్పినదట. అది విన్న ఆంజనేయ స్వామి శ్రీరామ చంద్ర మూర్తి కోసం తన ఒళ్ళంతా చందనం పూసుకోవడం ఆరంభించినాడట . అందుకని ఆ సంప్రదాయం అలాగే నేటికీ కొనసాగుతూ ఉంది.
జై శ్రీ రామ్