పూణే వారియర్స్ మొదలు పెట్టిన "Cheer Queens" పద్ధతి మెచ్చుకోదగినది. ఇలా చేయడం వలన మన దేశము లోని అన్ని రకాల నృత్య కలలకి ఆదరణ లభిస్తుంది. అంతే కాకుండా మన లోని నూతన కళాకారులకి ఒక విధమైన ప్రోత్సాహము ఇచినట్లు అవుతుంది. ఇవ్వాళా ఉన్న పరిస్థితి లోఒక స్కూల్ పిల్లాడిని ఇలా అడిగితే..." మన దేశం లో ఎన్ని రకాల నృత్య కళలు ఉన్నాయి అని అడిగితే" జవాబు చెప్పే వాళ్ళు చాల అరుదు. కాని ఒక క్రికెటర్ పేరు చెప్పగానే వాడి పుట్టు పూర్వోత్తరాలు అన్ని గడ గడా చెప్పేస్తారు. మరి అంతటి పోపులరితి ఉన్న వేదిక దొరికినప్పుడు అంది పట్టుకోవడం గొప్పవాళ్ళ లక్షణం . అదే పని పూణే టీం మొదలు పెట్టింది. మిగతా టీం లు కూడా ఇదే పద్ధతి ని పాటిస్తే బాగుంటది. కదా...! మీరు ఏమంటారు?
కాకపొతే ఒక చిన్న మార్పు ఉంటె బాగుంటదని నేను అనుకుంటున్నా.
ఏంటంటే... మన దేశం లో ఒక్కో ప్రాంతానికి/ రాష్ట్రానికి ఒక్కో ప్రత్యెక నాట్యం ఉంది. దాన్ని ఆయా టీం వాళ్ళు తీసుకొని ప్రదర్శిస్తే బాగుంటది( అన్ని రాష్ట్రాల నాట్యలని ఒకే టీం ప్రదర్శించకుండా).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి