ఈ రోజు కడాయి పనీర్ తినాలని అనిపించింది . అంతే ఇక వెంటనే షాప్ కి వెళ్లి కావాల్సినవన్నీ తెచుకొని చక చక చేసేసాను . ఎలా చేసానంటే...
కావలసినవి:
1 . పనీర్ ౩౦౦ gm
2.కాప్సికం ౩ (చిన్నవి)
(ట్రాఫ్ఫిక్ లైట్ కాప్సికం కొన్నాను... అంటే green, red, yellow కలర్ వి )
3 .ఉల్లిపాయలు తరిగినవి ఒక పెద్ద కప్ నిండా
4 . నూనె 3/4 tbps
5 . టమాటాలు 2
6 . కొత్తిమీర
7 . కరివేపాకు
8 . ఎండు మిర్చి
9 . జీలకర్ర
10 .ఉప్పు , కారం, పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు

ఆ తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు , టమాట ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టాలి .
కొంచెం సేపు అయ్యాక కలిపి అప్పుడు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మల్లి మూత పెట్టాలి
అది మొత్తం గ్రేవీ చిక్క పడుతుంది.
తర్వాత పనీర్ కూడా వేసి కలిపి కొంచెం సేపు (మరో 5 నిముషాలు ) మూత పెట్టాలి.
అంతే కడాయి పనీర్ తయ్యార్ !!!!!!!!!!!!!!!!!!!!!!!!
కావలసినవి:
1 . పనీర్ ౩౦౦ gm
2.కాప్సికం ౩ (చిన్నవి)
(ట్రాఫ్ఫిక్ లైట్ కాప్సికం కొన్నాను... అంటే green, red, yellow కలర్ వి )
3 .ఉల్లిపాయలు తరిగినవి ఒక పెద్ద కప్ నిండా
4 . నూనె 3/4 tbps
5 . టమాటాలు 2
6 . కొత్తిమీర
7 . కరివేపాకు
8 . ఎండు మిర్చి
9 . జీలకర్ర
10 .ఉప్పు , కారం, పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు
ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా!!!!!
step 1: ముందుగా కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పనీర్ ని వేయించుకున్నాను
ఆ తర్వాత పనీర్ ని అందులోంచి తీసి అదే కడాయి లో ఇంకొచెం నూనె వేసి కాప్సికం ముక్కల్ని వేయించాలి.
ఇక్కడ నేను తీసుకొని వచ్చిన రెడ్ కాప్సికం ఖరాబ్ అయింది. అందుకని వాడలేక పోయాను.
వీటిని కొంచెం వేయించిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలి.
తర్వాత అదే నూనె లో ఎండిన మిరప కాయలు, జీలకర్ర, వేసి వేయించాలి.
కొంచెం సేపు అయ్యాక కలిపి అప్పుడు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మల్లి మూత పెట్టాలి
అది మొత్తం గ్రేవీ చిక్క పడుతుంది.
అప్పుడు ముందుగ వేయించిన కాప్సికం ముక్కల్ని, పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలిపి ఒక 5 నిముషాలు మూతపెట్టాలి.
తర్వాత పనీర్ కూడా వేసి కలిపి కొంచెం సేపు (మరో 5 నిముషాలు ) మూత పెట్టాలి.
చివరిగా కొత్తిమీర వేసి దించెయ్యాలి.
అంతే కడాయి పనీర్ తయ్యార్ !!!!!!!!!!!!!!!!!!!!!!!!
dhaniyalu lekunda... kadai paneer ? ... hmm i will try this also :-)
రిప్లయితొలగించండి