13 డిసెం, 2011

"ఈ రోజుల్లో జనాలకి ఓపిక లేకుండా పోతుంది"

అలా బోర్ కొడుతుందని రేడియో ఖుషి పెట్టాను. అందులో ఎక్కువగా నేను R.J మిత్ర ప్రోగ్రాం అదేనండి "మల్లి మల్లి పాడాలి" అనే ప్రోగ్రాం వింటాను. అది కాకుండా "నమస్తే మామ" కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాను. ఈ రోజు కుడా ఎప్పటి లాగానే "నమస్తే మామ" పెట్టాను. అందులో ఇవ్వాల్టి టాపిక్ 
"ఈ రోజుల్లో జనాలకి ఓపిక లేకుండా పోతుంది". ఈ టాపిక్ గురించి ఆ మామ , అల్లుల్లూ ఇద్దరి సంభాషణ సూపర్. మామ చెప్పే మాటలకు మధ్య మధ్య లో అల్లుడు వేసే జోక్స్ చాల బాగున్నాయి. మొత్తానికి వీళ్ళిద్దరూ ఉన్నది ఉన్నట్టు గా కరెక్ట్ గా చెప్తారు. ఒక్కోసారి వింటుంటే మన లో  కూడా ఈ లక్షణం ఉంది అని బయటికి అనుకోక పోయినా మనసులో మాత్రం ఒప్పుకుంటాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మామ రైల్వే స్టేషన్ లో జరిగే ఒక చిన్న ఉదాహరణ ఇచ్హాడు. అది exact  గా ఈ మధ్య జరుగుతూనే ఉంది.
అదేంటంటే... 
మామ : ఈ మధ్య కాలం లో అంతా ఆన్ లైన్ లోనే టికెట్ బుక్ చేసుకుంటారు. స్తేషని కి కేవలం ఒక మూడు, నాలుగు నిమిషాల ముందు వస్తారు . ఇక ట్రైన్ పొరపాటుగా కొంచెం లేట్ ఉంది అని అన్నౌన్సుమేంట్ వచిన్దనుకోండి. అంతే.. ఒకటే చిరాకు పడతారు. పది నిమిషాలు కూడా ఓపిక పట్టరు. ఇటు అటు తిరుగుతూ ఒకటే టెన్షన్ పదుతూ కొంపలు అంటుకుపోతున్నట్టు చేస్తారు అని అంటాడు. అదే మా కాలం లో అయితే మేము ఓపికగా అలాగనే కూర్చొని ఉండే వాళ్ళం అని అంటాడు. దానికి వెంటనే అల్లుడు మీ కాలం లో మీకు ఏమి పని ఉండకపోయేదేమో అని టక్కున అనేస్తాడు . :D 
అప్పుడు మామ : మా కాలం లో ఎందుకు పనులు ఉండవనుకున్టున్నావు, మీకంటే ఎక్కువ గానే ఉండేవి; ఇంకా మాకు అప్పుడు ఇంత టెక్నాలజీ  లేకున్నా మేము ఆదర , బాదర పడకుండా ఓపిక గా ఉండే వాళ్ళం అని అనేస్తాడు. ఏది ఏమయినా ఆ కాలం వాళ్ళ తో పోల్చుకుంటే  మనలో కొంచెం ఓపిక తక్కువే అని మాత్రం మనం అందరం ఒప్పుకోవాల్సిందే. 

అలా సరదాగా సాగే  వీరి ప్రోగ్రాం వింటే ఖుషి ఖుషి గా , హాయి హాయి గా అనిపిస్తుంది.

10 కామెంట్‌లు:

  1. బాగుందండి

    నేను కూడా మీ టపా చదివి కుసి కుసి అయ్యాను. ఏమిటో ఇలాగే చదువుకుంటూ పోతే "ళ" అక్షరం కొన్ని రోజులకు మర్చి పోతానేమో నని సందేహం :(

    రిప్లయితొలగించండి
  2. Thank you bhaskera rami reddy gaaru .
    కాని మీరు "ళ" అక్షరం గురించి అన్న మాట సరిగ్గా అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా, 'ళ' అన్న అక్షరం ఒకటి తెలుగులో ఉందని తెలియజేసుకో వలసి వచ్చినందుకు విచారిస్తున్నాను.

    "మల్లి మల్లి పాడాలి" అన్నారు. ఇది తప్పు. "మళ్ళీ మళ్ళీ పాడాలి" అని వ్రాయాలి.

    "అల్లుల్లూ" అన్నారు కాని నిజానికి "అళ్ళుళ్ళూ" అని వ్రాయాలి.
    'లక్షణం' అన్నారు. సంతోషం. మీకింకా 'ణ' గుర్తు ఉన్నందుకు 'లక్షనం' అననందుకు.

    అదీ సంగతి.

    రిప్లయితొలగించండి
  4. మల్లి మల్లి పాడాలి - మళ్ళీ మళ్ళీ పాడాలి
    అల్లుల్లు - అల్లుళ్ళు

    రిప్లయితొలగించండి
  5. మనిషి మనిషిని ప్రేమించడం మాని వస్తువును ప్రేమించడం ఎక్కువవుతున్నందున ఈ అనవసరపు హడావిడి. పైగా దీనినే కెరీర్ అని ముద్దుగా , బెట్టుగా చెప్పుకుంటున్నారు . నిజానికిది చాలా ఎబ్బెట్టు ? మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని పెంచేది ఏదైనా అది గొప్పది కాదు . కానేరదు. అలా అనుకునేవాళ్ళు ఎప్పటికీ గొప్పవారు కారు. కాబోరు.
    "ళ" గొడవేందో !? నాకూ అర్ధం కాలా !?

    రిప్లయితొలగించండి
  6. "మళ్ళీ మళ్ళీ పాడాలి"

    -సత్తిబాబు ఆకెళ్ళ

    రిప్లయితొలగించండి
  7. @శ్యామలీయం గారు : నా తప్పుని ఎత్తి చూపడమే కాకుండా దానికి సరియైన వివరణ కూడా ఇచ్చినందుకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
    thank you so much... :)

    రిప్లయితొలగించండి
  8. @పల్లా కొండల రావు గారు : మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ వల్ల పుట్టుకొస్తున్న కొత్త కొత్త వస్తువులు మనుషుల మధ్య చాలా దూరాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకి iphone తీసుకోండి... ఇది చేతిలో ఉంటె పక్కన ఎవరున్నరనేది కూడా చూడకుండా కాలం గడిచి పోతుంది.
    రావు గారు మీ అభిప్రాయాన్ని తెలియ చేసినందుకు నా ధన్యవాదాలు . :)

    రిప్లయితొలగించండి
  9. @ సత్తిబాబు ఆకెళ్ళ గారు : thank you so much ... :)

    రిప్లయితొలగించండి