14 డిసెం, 2011

సినిమాలలో కనపడే కామిడి సీన్ కి అర్థం ఎందుకు మారి పోతుంది ????

ఎందుకు ఈ మధ్య సినిమాలల్లో హాస్యానికి అర్థం మారి పోయింది?
హాస్య నటులతో హాస్యానికి బదులు అపహాస్యం పలికిస్తున్నట్లు ఉంది.
కామిడి సీన్ వచ్చినదంటే చాలు... బ్రహ్మానందం ని పలు రకాలుగా తిట్టడమో లేక కొట్టడమో చేయడం. ఆ సమయం లో బ్రహ్మానందం గారి ముఖ కవలికల్ని చూసి మనం నవ్వుకోవడం. ఇంతే. ఇదే జరుగుతుంది. ఇది ఏ ఒక్క సినిమా లో కాదు దాదాపు గా గత 6/7 సంవత్సరాల నుండి వస్తున్న అన్ని తెలుగు సినిమా లలలో ఇదే కనపడుతుంది. అప్పుడు అది హాస్యం ఎలా అవుతుందో నాకు మాత్రం అర్థం కావడం లేదు. హాస్యం అంటే సహజం గ ఉండాలి. విన గానే లేదా చూడగానే మనసుకి ఒక రకమైన భావన కలగాలి. అప్పుడు మన లో సంతోషం ఏర్పడుతుంది. అది మన పెదవుల పైన నవ్వు ని చిలకరిస్తుంది. కాని ఈ మధ్య వస్తున్న సినిమా లలో హాస్యం అంటే కేవలం హాస్యనటులని కొడుతూ , తిడుతూ ఉండటం. ఇది నిజానికి హాస్యం కాదు. అపహాస్యమే అవుతుంది. వేరే వాళ్ళ మీద సటైర్లు వేసి నవ్వించడం ఒకటి రెండు సార్లు అయితే చూడవచ్చు కాని అదే సీను అన్ని సినిమాలల్లో వాడుతుంటే ఈ డైరెక్టర్ లకు తీయడానికి బోర్ కొట్టట్లేదు, చేసే నటులకు బోర్ కొట్టట్లేదు. ఇక మిగిలింది మనమే.. ప్రేక్షకులం. మనకు మాత్రం బోర్ కొట్టిచ్చి చంపుతున్నారు. రవి తేజ సినిమా ఒకటి (పేరు గుర్తు లేదు )... అందులో అయితే ఒకటే పని గా కొట్టడమే కామిడి అయిపొయింది. మొన్న వచ్చిన దూకుడు అంతే . అంత పెద్ద కమిడియన్ స్టార్ అయిన బ్రహ్మానందం ని అరేయ్ ఒరేయ్ అని పిలుస్తూ ఉండటం చూసే వాళ్ళకే అసహ్యం వేసే ల ఉంది . ఇక ఉన్న డైరెక్టర్ లకు కొత్త ఆలోచనలు ఎలాగో రావని అర్థమయి పోయింది కాని తీసే నటులయిన కొంచెం కొత్తగా ఉంటే నే తీస్తాం అని మొండి కేస్తే సరి.

    "అలా మొదలైంది" సినిమా లో ని కామిడి కొంచెం కొత్తగా ఉంది.  ఆ డైరెక్టర్ నందిని రెడ్డి సినిమా క్లైమాక్స్ సీన్ లో గౌతమ్ (హీరో కాదు, తాగు బోతు గా నటించిన రమేష్ ) అనే కొత్త కారెక్టర్ తో  చాలానే  నవ్వించింది. 
ఆ గౌతమ్ "అబ్బ తమ్ముడూ..." అనే డైలాగ్ ని వింటే చాలా బాగా అనిపిస్తుంది. అతను సహజం గా చేసినట్లు ఉంది. అతను మాట్లాడే ప్రతి డైలాగ్ ఆ రోల్ కి కరెక్ట్ గా suit అయ్యింది. ఇలా కొంచెం కొత్త డైరెక్టర్లయినా వచ్చి ఉన్న హాస్యాన్ని అపహాస్యం కానీయకుండా చుస్తే బాగుంటది,( పాత వాళ్ళు ఎలాగో మారరు).



7 కామెంట్‌లు:

  1. ఇలాంటివి చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాము అంటారు.అంటే చూసేవాళ్లలో కూడా లోపం ఉందని అనుకోవచ్చు. ఎవరైనా కాలు జారి పడితే కొంతమంది అయ్యో అని సాయం చెయ్యబోతారు, కొంతమంది అప్రయత్నంగ నవ్వేస్తారు. బహుశ రెండో రకం ప్రేక్షకులు ఎక్కువయ్యారేమో.

    రిప్లయితొలగించండి
  2. కాలంతో పాటే కామెడీ మారింది ! మిగతా విలువలతో పాటు మీరన్నట్టు హాస్యం అపహాస్యం అవుతున్నది !

    రిప్లయితొలగించండి
  3. @బాలు గారు : మీరన్నది కూడా వాస్తవమే.

    రిప్లయితొలగించండి
  4. @ పల్లా కొండల రావు గారికి ,
    @బాలు గారికి ,
    @కొత్తపాళీ గారికి నా కృతఙ్ఞతలు

    రిప్లయితొలగించండి
  5. బుర్రలో గుజ్జు తక్కువ ఉన్న వాళ్ళు స్టార్ రైటర్లూ, స్టార్ డైరెక్టర్లూ అవడంతో వచ్చిన తిప్పలు ఇవి.

    రిప్లయితొలగించండి
  6. @KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు : మీ బ్లాగ్ టైటిల్ లాగానే మీ కామెంట్ కూడా అదుర్స్ !!!!

    రిప్లయితొలగించండి