11 అక్టో, 2012

సింగపూర్ పెరుమాళ్ టెంపుల్ లో జరిగిన అన్నదానం....

దానాలన్నింటి లో కెల్లా అన్నదానం చాల గోప్పదంటారు. ఎందుకు  అంటే ఇది చదివండి,మీకే తెలుస్తుంది
ఇంతటి గొప్ప అన్నదానాన్ని కేవలం మన  దేశం లోనే కాకుండా ఇతర దేశాలల్లో కూడా మన వారు జరిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ సింగపూర్ లో ఉన్న పెరుమాళ్  టెంపుల్ లో గత శనివారం (06-10-2012) అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాములుగానే ఈ గుళ్ళో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. మేము అనుకోకుండా ఆ రోజు దేవుడి దర్శనానికని వెళ్ళాము, అంతే  అక్కడ ఉన్న జనాల్ని చూసి ఒక్కసారి గా ఆశ్చర్య పోయాము, ఏంటి ఇంత  మంది... ఎం జరుగుతున్డబ్బ అని చుస్తే అన్నతానం (తమిళ్ భాష లో అన్నతానం అంటారేమో) అని బోర్డు పెట్టి ఉంది. 
ఎన్ని వేల మంది వచ్చారో తెలీదు కాని బంతి , బంతి కి హాల్ నిండా నిండి పోయారు. నాకైతే ఎ 4-5 వేల మంది వచ్చారో అని అనిపించింది.
అందరు అన్న ప్రసాదం కోసం పెద్ద పెద్ద క్యూ  లలలో నిలబడి ఉన్నారు. వారిలో చిన్న చిన్న పిల్లలని పట్టుకొని ఉన్నవారు కూడా ఉన్నారు. మొదట మేము మా బాబు తో ఈ క్యు లో నిలబడటం కష్టం అని అనుకున్నాం, కాని తర్వాత మా కంటే పసి పిల్లలని ఎత్తుకొని కూడా క్యు లో జనాలను నిలబడి ఉండటం చూసి మేము నిలబడే సాహసం చేసాం. అంత  తమిళ్ స్టైల్ లో భోజనాలు ఏర్పాటు చేసారు. "అందరిని కుర్చీ లలలో కుర్చోబట్టి ముందర పొడవాటి టేబుల్ ల్లు  వేసి, అరటి ఆకూ లో అన్నం వడ్డించడం ".. బహుశ ఇది తమిళ్ వారి పద్దతనుకుంటాను, ఎందుకంటే నేను ఒకసారి చెన్నై లో జరిగిన ఒక  పెళ్లి కి వెళ్ళినప్పుడు కూడా ఇదే పద్దతి లో వడ్డించడం చూసాను.
ఏమో ఈ పద్దతి గురించి నాకు అంతగా తెలియదు లే..
మన  తెలుగు వాళ్లము (ఇది వరకయితే  మన రాష్ట్రమ గురించి ఏదయినా చెప్తున్నప్పుడు ఆంద్ర అని సంభోదిన్చేవాళ్ళం, కాని ఇప్పుడు ఆంధ్ర అంటే నన్ను జనాలు కొడతారేమో.. తెలంగాణా అయి ఉండి  ఆంధ్ర అంటావేంటి?? అని అందుకే ముందు జాగ్రత్త గా తెలుగు వాళ్ళం అని అంటున్నా.. :)   ) ఏదయినా భోజనాలల్లో కింద ఒక మాట్  వేసి, విస్తారాకు లో అన్నం వడ్డిస్తం  కదా..
కాని తమిళ్ వాళ్ళు అరటి ఆకులనే ఎక్కువగా ఉపయోగిస్తారు .

          ఆరోజు మధ్యాన్నం  అప్పటికే భోజనాలు చేస్తున్నారు కొందరు; అన్ని  క్యూ లు ఫుల్ అయ్యాయి బయట ఇంకా  చాల మంది క్యు లో నిల్చోవడానికి ఎదురు చూస్తున్నారు. అప్పుడు వెంటనే ఈ కుర్చీ ల సిస్టం సరిపోదనుకున్నారో ఏమో అక్కడి వలెన్తీర్స్ పక్కనే ఉన్న పెద్ద  హాల్ లో కిందనే అందరినీ బంతు లుగా కూర్చో పెట్టి ఫటా ఫట్ వద్దిన్చేసారు. అప్పుడు కొంచెం ఫాస్ట్ గా అయింది. 
ఇక వలెన్తీర్స్ గురించి చెప్పాలంటే ...
వాళ్లకి ఎంత ఓపిక అంటే .. వాళ్ళని చుస్తే ఉన్న కోపం అంత  హరిచుకు పోతదనిపించింది . తిన్న అరటి ఆకులని కూడా ఎవరిదీ వారు ఎత్తి పారేయడానికి వీల్లేదు, వాళ్ళే వచ్చి తీస్తున్నారు. వేరు వాళ్ళు తిన్న పళ్ళెం మనమెందుకు తీయాలి అనే వ్యక్తిత్వం గల వారు  ఒక్కసారి ఆ సీన్ చూడాలేమో  ని మనసులోఅనిపించింది. 

  తిన్న ఆకులు ఎవరిదీ వారు తీసుకుని వెళ్తే అక్కడి వారికి కొంచెం పని తగ్గుతుంది కదా అని నేను మా వారిని అడిగితె.. భోజనం పెట్టం అంటే కూర్చోబెట్టి అన్నం  వడ్డించి వారు తిన్న విస్తారకులు తీయడం వరకు అని అన్నాడు. అవునా??? ఇది కరెక్ట్ ఆ?? 





ఇంత  గొప్ప అన్నదానం నిర్వహించిన వారికి, టెంపుల్ వారికి, ఆ వాలేన్తీర్స్ కి  చేతులెత్తి మొక్కాల్సిందే !!   అన్నదాత సుఖీభవ!!!

     ఏమో లే మొత్తానికి కనీసం ఒక్కసారయిన  అలా ఒక అన్నదానం రోజున నిలబడి అందరికి సేవ చేయాలని  మాత్రం మనసులో  అనిపించింది. అది ఎలా నెరవేరుతుందో చూడాలి ...   



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి