ఎవరయినా తిట్టినా , కోప్పడినా, ఏదైనా ఇష్టం లేని ఉచిత సలహా ఇచ్చినా, మనకు నచ్చని వారిని పొగిడినా,
శక్తి కి మించి పని చేసినా, పిల్లలు సతాయించినా, అట లో ఓడిపోయినా వెంటనే కోపం వస్తుంది.
ఆ కోపం తట్టుకోలేని విధం గా తయారవుతుంది.
ఆ కోపం లో చేయాల్సిన పనులను సక్రమం గా చేయము తద్వారా మన మీద మనకే మళ్ళీ కోపం మొదలవుతుంది.
ఇలాంటివన్నీ నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అనుభవిస్తాం, బాధ పాడుతాం, మారాలి అనే ఒక చిన్న ప్రయత్నం చేస్తాం కాని మారము. అంతే ...ఇది ఒక చక్రం లా జరుగుతూ ఉంటది.
కోపం తగ్గాక ఆలోచిస్తే... ఛీ.. ఒక్క క్షణం అలోచించి చేస్తే బాగుండేది, అనవసరం గా మళ్లీ తప్పు చేశాను అని అనుకుంటాం . ఆ ఒక్క క్షణం ఆలోచన అనేది సహనం . అది ఉన్న వాడు ఎప్పుడు తిరిగి తప్పు చేయడు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి