12 జన, 2013

అసలు మనము ఎక్కడికి పోతున్నాం???

రోజు రోజు కి మన దేశం లో జరిగే సంఘటనలని చూస్తుంటే మనము ఎక్కడి పోతున్నామ అనే సందేహం కలుగుతుంది.

నేను ఈ మధ్య ఒక బ్లాగ్ లో పెళ్లి గురించి వచ్చిన ఒక వ్యాసం చదివాను. ఆ బ్లాగర్  వివాహం అనే బంధాన్నికొంచెం  వివరించి వ్రాసాడు.అది  బాగానే ఉంది, ఆయన ఎం చెప్పాలనుకున్నాడో అది తన వ్యక్తిగత విషయం .. తనకు నచ్చ్హిన విధం గా చెప్పాడు.
అయితే అది చదివిన వారిలో ఒకరు కామెంట్  చేసిన తీరు చాలా  అసభ్య కరం గా ఉంది.
కన్న తల్లి తండ్రుల విషయం లో ఆయన  మాట్లాడిన విధానం చుస్తే కళ్ళు,చెవులు   ముసుకోక తప్పదు మరి.కాని  తను వ్రాసిన విధానం గమనిస్తే మంచి చదువరి అని అనిపించింది. తను వ్రాసింది సబబబే అని నిరుపించుకోవడానికి ఎంత ప్రయత్నించాడో అనేది ఆ వ్యాసం చదిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యె ఉంటుంది ఈపాటికి . అలా ఉన్నాయి  మన చదువులు,సంస్కారాలు.
   ఇక డిల్లీ అమ్మాయి కి జరిగింది చాలా ఘోరమయిన  అన్యాయం అని తెలిసి కూడా, సాక్ష్యాధారాలు అన్నీ దొరికినా కూడా మన చట్టాలు, న్యాయ స్థానాలు ఇంకా నానుస్తూనే ఉన్నాయి.
అసలు ఆ కేసు ఎంత దూరమ్ పోతుందో , అసలు తీర్పు ఈ దశాబ్ద కాలం లోపల వెలువడుతుందో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు తర్వాత అలాంటివి చాల వెలుగు లోకి వచ్చాయి . వాటిలో కొన్ని 10,15 సంవత్సరాలయినా కూడా తీర్పు వేలువదలేదనట . ఇలా ఉన్నాయి మన న్వ్యవస్థలు.
ఇక మన రాష్ట్రం లో చుస్తే 3 ఏళ్లుగా ఒకటే బంద్ లు,గొడవలు, అల్లర్లు, తెలంగాణా , ఆంధ్రా అని.
ఈ రాజకీయ నాయకులూ వాళ్ళు బతకడానికి మనల్ని చంపుకు తింటున్నారు. చదువుకుంటున్న విద్యార్తులు కూడా "ఊ" అంటే బంద్ అంటున్నారు. వాళ్ళే కాదు వాళ్ళకి చదువు చెప్పే గురువులు కూడా అదే ప్రోత్సహిస్తుంటే ఏమననుకోవాలి? ఒక ప్రాంతం అభివృధ్హి చెందాలంటే కావాల్సింది పాలకుల్లో చిత్త  శుద్హి, అక్కడి వ్యవస్థ లో పారదర్శకత, సత్యము, ధర్మమూ..
ఇవి కనక ఉంటె ఆ ప్రాంతం కలిసి ఉన్న, విడిపోయినా ప్రజలు సుఖం గా బతుకుతారు.
అసలు ఇవే  సరిగ్గా లేనప్పుడు ఎంత మార్పు వస్తే ఏం  లాభం? ముందు మన నాయకులు , వారి తీరు మారనిది మనము ఎంత బంద్ లు చేసినా వృధాయే కదా!!
  ఈ మధ్య you tube  లో దుమారం లేపిన ఒక హైదరాబాద్ వాసి, ప్రజా నాయకుడు గారి ఉపన్యాసం వింటే ఒళ్ళు దద్దరిల్లింది. ఎంతగా కావాలని మత కలహాలు సృష్టిస్తున్నాడా  అని ఆవేదన కలిగింది. ఆయన గారు అలా ఉపన్యాసం ఇస్తూ ఉంటె అక్కడి రక్షక భట యంత్రాంగం ఎం చేస్తుండే అక్కడ?
మన కెమరమన్ గంగ తో రాంబాబు ఎం చేస్తుండే అక్కడ? ఎక్కడో గుడి చుట్టూ పంది  ప్రదక్షణాలు చేసినదని, లేకపోతె కోతి ఏదో వింత చేసిందని, చెత్త చెత్త బ్రేకింగ్ న్యూస్ లతో  లేకపోతె అనవసరమయిన డిస్కషన్స్ పెట్టి చానల్ నడుపుకు పోతున్న వారికి పాపులర్ స్పీచ్ గురించి ఎందుకు న్యూస్  కవర్ చేయలేదో? ఎంత సేపు కమర్షియల్ న్యూస్ ఎ తప్ప ప్రజలకు ఉపయోగ పడేవి మాత్రం శూన్యం.
     ఇవన్ని చూస్తుంటే మొత్తం మన దగ్గర ఉన్న ప్రతి వ్యవస్థ కుల్లిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి వవ్స్తలో ఉన్న మనమ ఎటు పోతున్నామా అని భయం గా  ఉంది.  







1 కామెంట్‌:

  1. ఏ బ్లాగ్, ఏ పెళ్లి, ఎవరు రాసారు, ఎవరు తిట్టారు, ఎవరు చదివారు.
    నా మానానా నేను ఏవో సొల్లు రాతలు చదువుకుంటూ ఉంటె , చెప్పీ చెప్పనట్టు, చుపించీ చుపించానట్టు..ఏంటండి ఇదీ ...??
    ఆ లింక్స్ ఏవో ఇస్తే మేము తరిస్తాం.
    :venkat

    రిప్లయితొలగించండి