మన దేశం లో ప్రవేశ పెట్ట బోతున్న కామన్ మొబిలిటీ కార్డు కాన్సెప్ట్ అభినందనీయము.
ఈ కార్డు వలన దేశం లోని ఏ రాష్రంలోనైనా, ఏ ప్రభుత్వ రవాణ సాధనన్ని అయినా వినియోగించుకోవచ్చు. అవినీతి నిర్మూలనకి ఇది తొలి మెట్టు కాబోతునదని నా అభిప్రాయం.
ఈ రకం గా నైన రావణ శాఖ లో ఎదురవుతున్న మోసాలు, అవినీతి ని అరికట్ట వచ్చు.
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలని పరిశీలించినట్లయియితే..
1. తిరుపతి/ తిరుమల ప్రాంతం లో తిరిగే కొన్నిబస్సు సర్వీసులలో పనిచేసే కొంతమందికండక్టర్లు అసలు టికెట్లకి బదులుగా నకిలీ టికెట్లని తయారు చెస్తూ దొరికి పోయారు.
2. మన సౌలభ్యం కోసం రైల్వే శాఖ ఇ-టికెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కాని ఇ-టికెట్ లను కూడా అచ్చం గా ఒరిజినల్ టికెట్ల మాదిరి కొన్నింటిని తయారు చేసి దేశ వ్యాప్తముగా దోచుకుంటున్నదొంగల ముఠా ఒకటి ఈ మధ్య నే వెలుగులోకి వచ్చింది.
3. ఇక సిటీ బస్సులలో పనిచేసే కొంత మంది కండక్టర్లు చిల్లర లేదనే సాకుతో ప్రయనికులకి గండి కొట్టేస్తున్నారు. మరికొంత మందేమో ఇది వరకే ఇష్యూ చేసిన టికెట్ ని కొన్నిసార్లు ప్రయాణికుల దగ్గరి నుండి తీసుకొని వేరే వాళ్ళకి అదే టికెట్ ని ఇవ్వడం. ఇలాంటి సంఘటనలయితే వారం లో కనీసం 2-3 అయిన చుస్తూనె ఉన్నాం . ఈ రకమైన దోపిడీలో మగ కండక్టర్ల కంటే మహిళా కండక్టర్ల చేయివాటమే అధికం గా కనిపించడం నిజంగా అవమానం.
ఇవి కేవలం నాకు గుర్తున్న ఈ మధ్య జరిగిన, జరుగుతున్న సంఘటనలు మాత్రమే. ఇంకా ఇలాంటివి మన దేశం మొత్తం లో ఎన్నిజరుగుతున్నాయో ఎవరికి తెలుసు? వీటన్నింటి కి చెక్ పెట్టాలంటే కామన్ మొబిలిటీ కార్డు సరియైన విధానం అని నాకు అనిపిస్తుంది.
ఈ మధ్య సింగపూర్ కి వెళ్ళినపుడు అక్కడ కూడా ఇలాంటి కార్డు ని చూసాను. దాన్ని ez-link
అనే పేరు తో పిలుస్తారు . నేను మొట్ట మొదటి సారిగా అక్కడి మెట్రో ఎక్కినపుడు ఈ విధానానికి చాల సంతోష పడ్డాను. చిల్లర లేక పొతే మన హైదరాబాద్ లోని కండక్టర్లు అనే మాటలు ఒక్కసారి గుర్తొచ్చి నవ్వుకున్నాను కూడా. ఇప్పుడు ఇదే విధానం మన దేశం లో రాబోతోన్దంటే ఇది ఖచితంగా ప్రభుత్వ రవాణా విభాగం లో అవినీతి ని నిర్మూలించడానికి రాబోతున్నమంచి ఘడియలు అని అనుకోవచ్చు. దీనికి మీరేమంటారు?
corruption can be solved with technology 100%
రిప్లయితొలగించండి