17 ఆగ, 2011

అమ్మో వీళ్ళు మన నాయకులేనా? ఎంత మార్పు...!

మన రాజకీయ నాయకులు = ఎప్పుడు గొడవలు సృష్టిద్దామా అని ఎదురు చూసే వాళ్ళు.
మన రాజకీయ నాయకులు = అధికారమే జీవితాంత ఆశయం గా నమ్మే వాళ్ళు.
మనరాజకీయ నాయకులు =అక్రమ సంపాదన ఉంటేనే కడుపు నిండా భోజనం చేయగలరు, కంటి నిండా నిద్రించ గలరు.  
మన రాజకీయ నాయకులు = గ్రామ సర్పంచ్ నుండి పార్లమెంటు మెంబెర్ వరకు అందరికీ ఒకటే నీతి- అందినంత  వరకు దోచుకోవడమే.
మన రాజకీయ నాయకులు =ఎంత పెద్ద కుమ్భకోణం  లో  ఇరికినప్పటికీ  దర్జాగా  బ్రతుకుతూ శిక్ష నుండి తప్పించు కునే వారు.
మన రాజకీయ నాయకులు = కేవలం తామే కాదు, తమ  కొడుకులు,కూతుర్లు  లేదా  ఇతర  కుటుంబ  సభ్యులు  ఎవరైనా  ఎంతటి నేరాలకి పాల్పడినప్పటికీ కుడా  న్యాయస్థానానికి మాత్రం దొరకని వారు. 

మన రాజకీయ నాయకులు ఇలా  చాలానే అర్థాలని  సంతరించుకున్నారు.

                     కాని అందులో "అమ్మో!  వీళ్ళేనా!" అని అనిపించే అర్థం ఒకటి నాకు ఈ రోజే కనిపించింది. ఏంటంటే... వీళ్ళు, మన రాజకీయ నాయకులు అవినీతి కి వ్యతిరేకం గా పోరాడుతున్న మన అత్యుత్తమ దేశ నాయకుడైన శ్రీ అన్న హజారే గారికి మద్దతు తెలపడం.
ఇది నిజమైన వింత, ప్రపంచ లోని అన్ని వింతలలో కేల్ల అతి కొత్త వింత.
అవినీతికి  పరాకాష్ట అని చెప్పుకునే మన రాజ కీయ నాయకులు అవినీతి నిర్ములనకి తోడ్పాటు నందించడం  నమ్మదగిన విశయమేనా?

నాకెందుకో సందేహం గానే ఉంది.

ముందు ముందు ఈ బడా బాబులు ఇంకా ఎన్ని వింతల్ని , విడ్డూరాలని  మనకి చూపించ బోతున్నారో వేచి చూడాల్సిందే మరి!




3 కామెంట్‌లు:

  1. అవును వెల్ల సపోర్ట్ చూస్తుంటే నవ్వు వస్తుంది. ఎవరికి వాళ్ళు వల్లే నీతి మంతులు అనిపించుకోవాలని తాపత్రయం.

    రిప్లయితొలగించండి
  2. మీరు గమనించారో లేదో ఆన్నాజీకి మద్దతు తెలుపుతున్న వారందరూ ప్రతిపక్ష నాయకులే. అది కామన్, శతృవుకు శతృవు మిత్రుడు. అంతే.

    రిప్లయితొలగించండి
  3. అవినీతికి పరాకాష్ట
    కలియుగం

    రిప్లయితొలగించండి