14 ఆగ, 2011

మన రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు వస్తాయేమో....!

నా కెందుకో మన  రాష్ట్రం  లో  మధ్యంతర ఎలక్షన్స్ వస్తే బావుండు అని అనిపిస్తుంది.
ఈ చాత కాని సి ఎం  ని చూడ లేక పోతున్నా. ఒకప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ అంటే మన
దేశంలోనే కాదు దాదాపు ప్రపంచం అంతటా ఓ మంచి పేరు ఉండేది. ఆ  స్థితికి రావడానికి చాల కాలం  పట్టింది.
బహుశ చంద్రబాబు కుడా తన హయాం లో ఈ పేరు కోసం చాల నే పబ్లిసిటీ చేసాడనుకోండి  . తానూ చేసింది గోరంతే అయినా చెప్పుకుంది కొండంత (అది వేరే విషయం లేండి).
అప్పుడున్న  మన రాష్ట్రాన్ని ఒక మామిడి తోట తో  పోలిస్తే, ఎవరో చెట్లని   నాటి, పెంచి, మరెవరో వాటిని పెద్దచేయాగా ఆ తోట  మంచి పక్వ దశ కి చేరువ అయింది  . ఆసమయం లో తోట ని కాపాడుతున్న తోట మాలి(న్.సి.న్ )  కి పైత్యం పెరిగి (కాలేజీ ఫీజు లు పెంచడం, ప్రభుత్వ ఉద్యోగులతో చెలగాట ఆడటం లాంటివి చేసాడు కదా..) తోటనంత చిందర వందర చేయడం మొదలు పెట్టాడు . దాంతో విసుగు చెందిన యజమాని (ఇక్కడ రాష్ట్ర ప్రజలు) ఆ తోటను వేరే తోట మాలి చేతి లో (వై.ఎస్.ర్) పెట్టాడు...       

అయితే ఇది వరకు ఉన్న తోట మాలి తోటను కొంచం చిందర వందర చేశాడే కాని , పక్వానికి వచ్చిన చెట్లను పాపం ఏమి చేయలేదు. అలా పరి పక్వ దశ లో ఉన్న మామిడి తోట ను తన  చేతి లోకి అందుకున్నతోట మాలి తోలి  దశ లో బాగానే కష్ట పడి ఆ పళ్ళను సరియైన రీతి లో సరియైన విధం గానే యజమానికి అప్పచెప్పాడు.

కాని మనిషికి దుర్భుద్ది అనేది ఒకటి ఉంటుంది  కదా.. అది కాస్త ఆ తోట మాలి ని నిలువునా మింగేసి కాచిన పల్లనన్నీ తనే తినడం, తనవాల్లకే పంచి పెట్టడం మొదలెట్టాడు.
ఇంకేముంది.... పళ్లన్నీ ఖాళీ అయ్యాయి, అంతే  కాకుండా.. చెట్లనీ పట్టిచుకునే నాథుడు లేక  చీడ కూడా మొదలయింది.

చీడ వేరు దశలో ఉన్నప్పుడే తోట మాలి మారిపోయాడు. కాని తర్వాత వచ్చిన తోట మాలి కి ఆ తోట ని బాగు చెసే  శక్తి లేక ఇంకా దీనవస్తకి తీసుకు వచ్చాడు .
అల చూస్తూ చూస్తూ ఉండగానే ఎక్కడి నుండో వచ్చిన దుండగులు ఆ తోట ని ముక్కలు ముక్కలు చేసి పంచుకోవాలని పన్నాగం పన్నారు. పాపం అమాయకుడయిన యజ మాని కి ఆ విషయం అర్థం కాలేదు. ఆ దుండగుల ని నమ్మడం  , వారి మాటలకి విలువనివ్వడం చెస్తూ వచ్చాడు   .
దాంతో ఇప్పుడు తోట కాస్త పంట లేక, విల విల బోతుంది . ఇప్పుడయిన ఆ తోట యజమాని (మన రాష్ట్ర ప్రజలు )మేలుకొని తోట బాగోగులని చూడటానికి ఒక  సరియైన , సమర్థుడైన తోట మాలి ని ఎంచుకుంటే బావుండు అని అనిపిస్తుంది.

అందుకోసం మధ్యంతర  ఎన్నికలు వస్తే బావుండు అని అనిపిస్తుంది.
దీనికి మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారా/ లేక ఈ అభిప్రాయాన్ని తప్పు పడతారా? లేక వేరే ఇతర సమాధానం చూపిస్తారా?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి