హలో .... నమస్తే.... నమస్కారం.... ఎలా ఉన్నారు...?
ఏమి చేస్తున్నారు...? అంతా కుశలమేనా..!
ఏంటి ఈ రోజు ప్రతి-ఉదయం లో ఈ సోది ప్రశ్నలు అని అనుకుంటున్నారా..!
ఏమి లేదు లెండి, ఏదో వెరైటీ కోసం ప్రయత్నించాను. మీకు నచితే సంతోషం, నచ్చక పొతే సారీ... నేనేమి చెయ్యలేను. అసలు విషయానికి వస్తే... నేను నిన్న న ఒక ఫ్రెండ్ ని కలిసాను. అప్పుడు మాటల్లో మాట గ ఈ శ్రీ రామ రాజ్యం సినిమా గురించి వచ్చింది. ఈ సినిమాపాటలు విన్నావా అని న ఫ్రెండ్ నాతో అనింది. నేను ఇంకా లేదు అన్నాను. విను చాల బాగున్నాయి అని తన అభిప్రాయం గ చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత పాటలు పెట్టాను. మొదటి పాట విన్నాను. ఏదో కొంచెం కొత్త బాణీ లో పాడినట్లున్నారు అని అనుకున్నాను. అలాగే వరుసగా అన్ని పాటల్ని కంటిన్యూ చేశాను. మధ్య లో ఈ సినిమా కి ఇంతకీ మ్యూజిక్ అందించిన మహాను భావులు ఎవరా అని ఒక్కసారి చూసాను.
అంతే.. ఒక్కసారిగా ఖంగు తిన్నాను. ఎందుకంటే ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ది గ్రేట్ గురువు గారు, నా ఫేవరేట్ అయిన ఇలయ రాజా నా అని !
అప్పుడు అనిపించించింది... గురువు గారి బాణీ లో నే తేడా లు మొదలైనట్లున్నాయి అని.
మనసులో చిన్న అనుమానం కూడా వేసింది ఏంటంటే.. ప్రొడ్యూసర్ అనుకున్నంత డబ్బు ఇవ్వకుండా మోసం చేసదేమో అందుకు గురువు గారు ఈ రకం గా ప్రతీకారం తీసుకున్నరేమో అని. (ఇది నా మనసులో మెదిలిన ఒక పిచ్చి ఊహమాత్రమే.)
మొత్తానికి ఇలయ రాజా గారు కూడా ఈ తరం సంగీత దర్శకులల్లో ఒకరిగా కలిసి పోయారు.
ప్చ్... చాలా బాధ గా ఉంది .
avunandi. patalu bhakthi patala laga anipinchaledu.. kothaga anipinchaledu.. malli vinalanipinchaledu..
రిప్లయితొలగించండి:(
Kamal gaaru... I think almost all have the same opinion like u.
రిప్లయితొలగించండిప్రతి-ఉదయం గారు మేము బాగున్నాము, శ్రీ రామ రాజ్యం సాంగ్స్ బాగున్నవి, మీరు ఒకసారి విని ఉంటారు , శ్రీ రాముడు గూర్చి మనకు తెలుసు చాల సినిమాలు చూశాము, చాల సాంగ్స్ విన్నాము , సో మీకు సాంగ్స్ లో నూతన గా ఏమి కనిపించలేదు అనుకుంటాను , ఇళయరాజా గారి కూల్ ప్రతి సాంగ్స్ లో కనిపించిది......
రిప్లయితొలగించండిపాటలు మీకు ఎందుకు నచ్చలేదో నాకు అర్ధం కావడం లేదు! మణిశర్మ ,తమన్ లాంటి వాళ్ళ చెత్త మ్యూజిక్ మీకు నచుతుందేమో! హీరో ని దృష్టిలో పెట్టుకొని పాటలు వినకండి.. మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టి ఒక్క పాటలనే వినండి ..
రిప్లయితొలగించండి@తెలుగు పాటలు - మీరు ప్రతి పాట లోని పదాల మాధుర్యాన్ని ఆస్వదిస్తూ వింటారు కావొచ్చు, బహుశ మీలో ఉన్న ఈ అరుదైన ఆసక్తే మీ చేత ఈ తెలుగు పాటలు అనే బ్లాగ్ ని నడిపిస్తుందేమో. ఇది కేవల నా అభిప్రాయం. అందుకే మీకు శ్రీ రామ రాజ్యం లోని పాటలు కూడా నచ్చి ఉంటాయి. ఈపాటల అర్థం బాగుంది. కాని సంగీతమే కొంచెం.... :( అయినా ఒక్కొక్కరికి ఒకో ఇష్టం ఉంటుంది. దాని లో ఏమి తప్పు లేపు. ఏది ఏమైనా మీ ఈ స్పందనకు నా కృతఙ్ఞతలు.
రిప్లయితొలగించండి@అజ్ఞాత - మీరన్నట్లు ఈ సారి ఏదో పని లో పాటు గా కాకుండా కేవలం పాటలనే విని చూస్తాను. కాని మీరన్న ఈ మాటకి మాత్రం -" హీరో ని దృష్టి లో పెట్టుకొని వినకండి "- చాల నవ్వొచింది. ఈ మాట వింటే పాపం ఆ హీరో ఫాన్స్ ఫీల్ అవుతారేమో.
రిప్లయితొలగించండిమీకు నాదొక చిన్న మనవి... ఏంటంటే.. ఇలా అజ్ఞాత అని పిలుపించు కోవడం ఎమన్నా బాగుందా? మీకు కూడా అందరి లాగానే ఒక పేరు ఉంటుంది కదా.. చక్కగా ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుదని నా అభిప్రాయం. ఏది ఏమైనా మీరు ప్రతి-ఉదయం ని సందర్శినందుకు నా థాంక్స్.